సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కన్నా వీళ్ళ కెమిస్ట్రీ ఫిజిక్సూ బయాలజీ అన్నీ టూమచ్ గా ఉన్నట్లున్నాయ్ కదా. అంతా బానే ఉంది కానీ ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా టీవీ చూసే సమయంలో ఈ పాట ప్రసారం చేయడం మాత్రం... హ్మ్.. ఎందుకులెండి.. ఏమైనా అంటే రిమోట్ లేదా అంటారు.. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఈ పోస్ట్ చివర ఉంది.
ప్రోమోలో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు చూసి ఐటమ్ సాంగ్ అనుకున్నా కానీ ఈ పాట లిరిక్స్ విన్నాక అనసూయ అన్నట్లు ఇది ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే. మరి ఈ పాట విశేషమేంటో ఈ వీకెండ్ మీరే చూసి తేల్చుకోండి.
నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నా అందం చూసి మీరు మతిపోగొట్టుకుంటే అందులో నా తప్పేముందంటూ ప్రశ్నిస్తున్న ఈ మిస్ యూనివర్స్ కంటెండర్ "ఊర్వశి రౌతేలా" గొడవేంటో మీరూ కాస్త చూడండి ఈ వీకెండ్.
గద్దలకొండ గణేష్ సినిమాలో ఇది విలన్ పాటే అయినా ఐటం గర్ల్ "డింపుల్ హయాతి" పాడే సూపర్ హిట్టు పల్లవే అసలైన కిక్కు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాట వింటూ మీరు పాదం కలిపేయండి ఈ వీకెండ్.
మొన్న సంక్రాంతికి విడుదలైన మరో కమర్షియల్ సినిమా అల్లుడు అదుర్స్. దీనిలో బిగ్ బాస్ ఫోర్ ద్వారా ఫేమస్ అయిన గుజరాతీ భామ మోనల్ గజ్జర్ ఓ మెరుపు మెరిసిన ఐటం సాంగ్ ఇది. దేవీశ్రీ మ్యూజిక్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని మీరూ ఎంజాయ్ చేయండి.
ఈ సంక్రాంతికి విడుదలైన మరో సినిమా రెడ్ లోని ఈ మస్త్ ఐటమ్ సాంగ్ కి కూడా జానీ మాస్టరే కొరియోగ్రఫీ. ఈయన ఈ పాటల స్పెషలిస్ట్ అయిపోతున్నట్లున్నారు. లవ్లీ హెబ్బాపటేల్ అండ్ ఎనర్జిటిక్ రామ్ లతో మీరూ పాదం కలిపేయండి.
మాస్ మహారాజా రవితేజ రీసెంట్ హిట్ క్రాక్ సినిమాలోని ఈ మస్త్ ఐటమ్ సాంగ్ తో వీకెండ్ ముగించండి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ గోపాల్ వర్మ ఫైండ్ అపర్ణ రాణి అండ్ రవితేజ స్టెప్పులకి భూమి బద్దలే.
అసలు సిసలైన మాస్ సినిమాలంటే అన్నగారి సినిమాలే మాస్ సాంగ్స్ అంటే ఆయన సినిమాలో సాంగ్సే. యుగంధర్ సినిమా లోని ఈ ఇళయరాజా గారి పాటను జానకి గారు భలే పాడారు. జయమాలిని అభిమానులకు వినడానికే కాదు చూడడానికి కూడా బావుంటుందనుకోండి.
మణిరత్నం ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఇక స్పెషల్ సాంగ్స్ అంటే ఇంకెంత ప్రత్యేకంగా తీస్తారో చెప్పక్కర్లేదు కదా. గురుకాంత్ సినిమాలో టర్కిష్ బెల్లీ డాన్సర్స్ గా మల్లికా షెరావత్ మీద చిత్రీకరించిన ఈ పాట sizzling అనే పదానికి డిక్షనరీ మీనింగ్ లా ఉంటుంది. మయ్యా అంటే అరబిక్ లో నీరు అని అర్థమట. మరియమ్ టేలర్ అండ్ చిన్మయిల గానం, రెహమాన్ మ్యూజిక్, గుల్జార్/వేటూరి గార్ల లిరిక్స్ కుర్రకారును ఒక ఊపు ఊపేశాయి . సౌండ్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే డాన్సర్ ఒంటిపై బీడ్స్ శబ్దం కూడా వినిపిస్తుంది కొన్ని చోట్ల.
కంటైనర్ ట్రాలర్ మీద అదీ రోడ్ పై వెళ్తూ ఉండగా అంతమంది గ్రూప్ డాన్సర్స్ తో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో స్టెప్పులతో పాట తీయడం అసలు ఎంత క్రేజీ ఆలోచనో కదా. అలాంటి క్రేజీ ఆలోచనకి పాట రాసే అవకాశం రామజోగయ్య శాస్త్రి గారికి వచ్చింది. పైగా అదే తన మొదటి పాట, గురువుగారు సిరివెన్నెల గారు తన ప్రియ శిష్యునికి ఓం రాసిచ్చినట్లుగా ఓ మాంచి పల్లవి రాసిచ్చారు. ఇంక తిరుగేముంది రాంజో కలం కదం తొక్కింది ఈ అందమైన పాటని మన ముందుంచింది. బొత్తాలు చిన్న మొత్తాల పొదుపు లాంటి రైమింగ్ పదాలతో కవ్వించి నవ్వించేశారు రాంజో.
జెస్సీ గిఫ్ట్స్ కంపోజ్ చేసి పాడిన ఈ పాట ట్యూన్ కి, చిత్రీకరణకి, లిరిక్స్ కి కూడా నేను ఫ్యాన్ ని. బిగ్ బాస్ సీజన్ టూ చూసిన వాళ్ళకి అమిత్ తివారి తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయ్ పేరు కౌశ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఇక ఈ పాటలో ఉన్న గ్రూప్ డాన్సర్స్ లో ఇప్పటి ఫేమస్ డాన్స్ మాస్టర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా కనిపిస్తారు. మరి ఆలశ్యమెందుకు చూసి ఆనందించండి.
మాల్గాడిశుభ పాడిన "చిక్ పక్ చిక్ భం" ఆల్బమ్ సూపర్ హిట్ అయిన రోజుల్లోదనుకుంటాను ఈ పాట. ఆ ఆల్బమ్ పాటలు రాసిన సాహితే ఈ పాట రాసింది కూడా. సెన్సార్ దాటిన వీడియోలో లిరిక్స్ కాస్త పర్లేదు కానీ ఆడియో లోవి మాత్రం స్ట్రిక్ట్లీ పెద్దలకు మాత్రమే. పాట ట్యూన్ అండ్ బీట్ మాత్రం మంచి హుషారుగా ఉంటుంది.
హాయిగా రిలాక్స్ అయ్యే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారాలు ఎంత కఠినమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కదా. అలాంటి సోమవారాలు మొదలు పెట్టడానికి మనకో మాంచి హుషారైన పాట తోడుంటే ఆ కిక్కే వేరు అనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఎంచక్కా ఈ పాట వింటూ చూస్తూ స్టెప్పులేసుకుంటూ హుషారుగా మీ రోజు మొదలెట్టేయండి.
ఒకప్పటి ఐటం సాంగ్స్ కూడా ఎంత మర్యాదగా రాసేవారో తెలుసుకోవాలంటే ఈ పాటే ఒక మంచి ఉదాహరణ. జీవితం సినిమా కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినారే గారి రచనను విని దరువు వేయని వారుండరనడం అతిశయోక్తి కాదేమో. ఈ పాట వీడియో ఎక్కడైన దొరికితె కామెంట్స్ లో చెప్పగలరు.
జిగేలు రాణులని ఇప్పుడు పిలుస్తున్నారేమో కానీ ఆకాలం నుండీ సదరు జిగేలు రాణులు సమాజ సేవ చేస్తూనే ఉన్నారటండీ.. ఎలా అంటారా ఇదిగో ఇక్కడ జబర్దస్త్ రాఘవ స్కిట్ లో వివరిస్తున్నాడు మీరూ చూసి నవ్వుకోండి. మరి అలా అడిగినా అడగకపోయినా వివరంగా అడ్రస్ చెప్పిన జిగేలు రాణిలకే జిగేలురాణి లాంటి సిల్క్ స్మిత పాటతో ఈ వీకెండ్ సంబరాలు మొదలెట్టేయండి.
దీన్ని ఐటమ్ ఆర్ మాస్ సాంగ్ అనేకన్నా కామెడీ సాంగ్ అనచ్చేమో... కాకపోతే రిలీజైన అప్పట్లో కిళ్ళీ కొట్లలోనూ, కాఫీ హోటళ్ళలోనూ మారుమోగి పోయేది... ఆ సంగతేంటో మీరూ చూసి ఎంజాయ్ చేస్తూ వీకెండ్ మొదలెట్టండి.
రసిక రాజాస్ అండ్ రాణీస్ అందరికీ హాపీ న్యూ ఇయర్.. నిన్న పార్టీ కుమ్మేశారా.. కొత్త సంవత్సరం మూడు స్టెప్పులు ఆరు దరువులతో దద్దరిల్లిపోవాలని కోరుకుంటూ హాపీ హాపీ న్యూ ఇయర్.. సుకుమార్ దేవీశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ఒక మాంచి ఊపున్న సాంగ్ తో సంవత్సరం మొదలెట్టేద్దాం..