ప్రభాస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రభాస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2016, ఆదివారం

మనోహరీ..మనోహరీ..

బాహుబలి సినిమా లోని ఈ పాట నా ఫేవరెట్స్ లో ఒకటి ఐటమ్ సాంగ్ ఐనా కూడా చైతన్యప్రసాద్ కమ్మటి తెలుగు పదాలతో చాలా అందంగా రాశారు. పూర్తిగా ఊహా ప్రపంచంలో విశృంఖలతకు అవకాశమున్నా రాజమౌళి కాస్ట్యూమ్స్ మొదలు చిత్రీకరణ వరకూ చాలా హుందాగా తెరకెక్కించాడు.

ఆడియో ::
http://mio.to/album/M.M.+Keeravaani,+Mounima/Baahubali+-+The+Beginning+(2015)

ఈడియో ::

లిరికియో ::

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తీయ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్ రా చేయ్ రా
మనోహరీ... మనోహరీ...

తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్ నా
నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా
నీ కండల కొండలపై నాకైదండలు వేసెయ్ నా
నా పయ్యెద సంపదలే ఇక నీ శయ్యగ చేసేయ్ నా
సుఖించగా రా...
మనోహరీ మనోహరీ

పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

సైన్మా :: బాహుబలి -- 2015
దరువుల్ :: ఎమ్ ఎమ్ కీరవాణి
రాతల్ :: చైతన్య ప్రసాద్
గొంతుల్ :: మోహన భోగరాజు, రేవంత్

8, జులై 2016, శుక్రవారం

మన్నేల తింటివిరా కన్నా

కీరవాణి మెలోడీస్ ఎంతమంచివి ఇస్తారో మాస్ బీట్ సాంగ్స్ కూడా అంతే బాగా కంపోజ్ చేస్తారు... ఈ పాటను ఎవరు మర్చిపోగలరు చెప్పండి.. అలాగే దరువేయకుండా వినగలవారెవరైనా ఉన్నారా... ఇంకెందుకు ఆలశ్యం వీకెండ్ ను మాంచి ఊపుతో మొదలెట్టేయండి....

ఆడియో : 
http://play.raaga.com/telugu/album/Chathrapathi-songs-A0000516

ఈడియో :


శ్రీ రాజరాజేశ్వరీ వరప్రసాద 
మహారాజశ్రీ పసలపూడి పంకజంగారి 
పరమకళా రసిక నాట్యమండలికీ.. జై..
హ్మ్.. అదీ.. శభాష్..
అంచేత.. ఆడియెన్సులారా.. రసిక శిఖామణులారా..
వాసికెక్కిన వైజాగు వాసులారా.. 
మన్నుతిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో
ఆ వెన్నదొంగ.. నువ్వు తొక్కవయ్యా హార్మోనీ 
పోలీస్ బాబుగారు కూడా చూస్తున్నారు..
 
అన్నయ్య బాలురు గొల్లోలు చెప్పిరిగాని
ఏ పాపమెరుగునే తల్లి 
నేను మన్నసలే తినలేదే తల్లి
 
ఏయ్ అబద్ధాలడతావు
మన్ను తినడానికి నీకు ఏం కర్మ పట్టిందిరా
నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా పోని అటుకుల్లేవా
నీకు నీకు నీకు పంచదార పూరీలు లేవా
నీకు మిరపకాయ బజ్జీలు లేవా 
నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా
లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి 
నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా

మన్నేల తింటివిరా కృష్ణా

మన్నేల తింటివిరా కృష్ణా
లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా

పొద్దుగాల తరిపిదూడా పొదుగుపాలు తాగబోతే
ఆ తాగబోతే.. 
లాగిపెట్టి తన్నిందే మట్టిమూతి కంటిందే
అయ్యో...
ఉల్లి పెసరట్లు లేవా రవ్వా మినపట్లు లేవా 
అప్పాలు లేవా పప్పులు లేవా
కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా 
నీకు కాకినాడా కాజాలు లేవా..లేవా..
నీకు మైసూరు బొండాలు లేవా.. లేవా.. 
పోనీ బందారు లడ్డూలు లేవా.. లేవా.. 
ఆహ ఆత్రేయపురం పూతరేకులు లేవా
రంగు జాంగిరి నీకు రమ్యముగా చేయిస్తీ
మన్నేల తింటివిరా కృష్ణా
మన్నేల తింటివిరా కృష్ణా

ఏటి గట్టు తోటలోన మొక్కనాటి నీరుకట్టి 
ఎరువుమీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి 
చెక్కరకేళి గెలలు లేవా పంపర పనస తొనలు లేవా
పూరిల్లేవా బూరిల్లేవా తేనెలూరు చిల్లిగారెల్లేవా 
నీకు కాశ్మీరు యాపిల్సు లేవా.. 
అరెరె పాలకొల్లు బత్తాయి లేదా 
నీకు వడ్లమూడి నారింజ లేదా 
అయ్యో కాబూలు దానిమ్మ లేదా 
పాల ముంజలు నీకు పరువముగా చేయిస్తి
మన్నేల తింటివిరా కృష్ణా
నువ్ మన్నేల తింటివిరా కృష్ణా
హెయ్. హెయ్.హెయ్.
హెయ్..అయ్..హెయ్..అయ్..

సైన్మా :: ఛత్రపతి (2005)
దరువు :: కీరవాణి 
రాతలు :: శివశక్తిదత్త 
గొంతులు :: టిప్పు,స్మిత,కళ్యాణి