సలీం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సలీం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2019, శుక్రవారం

అన్నం పెట్టమంది...

దీన్ని ఐటమ్ ఆర్ మాస్ సాంగ్ అనేకన్నా కామెడీ సాంగ్ అనచ్చేమో... కాకపోతే రిలీజైన అప్పట్లో కిళ్ళీ కొట్లలోనూ, కాఫీ హోటళ్ళలోనూ మారుమోగి పోయేది... ఆ సంగతేంటో మీరూ చూసి ఎంజాయ్ చేస్తూ వీకెండ్ మొదలెట్టండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

బావా మరే...
అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

కూర వేసి పెట్టనా
మజ్జిగేసి పెట్టనా
కూర వేసి పెట్టనా
మజ్జిగేసి పెట్టనా
పీట వేసి పెట్టనా
బల్లమీద పెట్టనా
ఎక్కడ పెట్టను బావో
ఏమేసి పెట్టను బావా

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

అలిసి అలిసి వస్తాడూ
చమట పట్టి ఉంటాడూ
పంపు తిప్పి నీళ్ళు వదిలి
లక్సు పెట్టి వీపు రుద్ది

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

తడిసి తడిసి ఉంటాడూ
తుడుచుకోను అంటాడూ
ఒళ్ళు తుడిచి పౌడరేసి
బట్టలేసి సెంటు పూసీ

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

ఆవురావురంటాడూ
ఆకలైనా అడగడూ
ఆశతీర ఆకువేసి
కోరుకున్న కూరలేసి

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

ఆదమరచి ఉంటాడు
తమలపాకులంటాడూ
చిలకచుట్టి నోటపెట్టి
దిండు వేసి పండబెట్టి

నన్న నన్ననానా నన్నా.. 
పప్ప పప్పపాపా పప్పా..
ఊహూ..హూహుఃఊహు.. 

సైన్మా :: రాముడు కాదు కృష్ణుడు -- 1983
మోతల్ :: చక్రవర్తి
రాతల్ :: దాసరి 
గొంతుల్ :: జానకి 


18, నవంబర్ 2018, ఆదివారం

మబ్బే మసకేసిందిలే..

ఓ వ్యాసంలో ఖదీర్ గారు చెప్పినట్లు ఇది రాత్రి పాట, కోరిక పాట, తాపం పాట, నిప్పు రగిల్చే పాట, అప్పట్లో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన పాట. బాలుగారు ఆటాడుకున్నట్లుగా పాడిన పాట. మీ వీకెండ్ ని ఈ పాటతో ముగించండి. 

ఆడియో :: 


ఈడియో ::  


లిరికియో :: 

హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ అంత సిగ్గా

మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే

కురిసే సన్నని వాన సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వాన సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా 
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూలమంచం
వెచ్చగ వుందామూ మనమూ

హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగ ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే

పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించువేళా
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ మనదీ

హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే

నవ్వని పువ్వే నువ్వు 
నునువెచ్చని తేనెలు ఇవ్వు 
దాగదు మనసే ఆగదు వయసే 
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు 
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు 
ఇద్దరమొకటవనీ కానీ 

హే బుగ్గమీదా మొగ్గలన్నీ దూసుకోనీ 
రాతిరంతా జాగారమే చేసుకోనీ 
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే 
మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే

సైన్మ :: వయసు పిలిచింది -- 1978
రాతల్ :: వేటూరి
మోతల్ :: ఇళయరాజా
గొంతుల్ :: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

7, జనవరి 2018, ఆదివారం

పుట్టింటోళ్ళు తరిమేసారు...

వేటూరి గారు రాసిన ఈ పాట లిరిక్స్ శ్రద్దగా వింటే ఇది ఐటమ్ సాంగ్ గా కన్నా కూడా కామెడీ సాంగ్ గా అనుకోవచ్చేమో అనిపిస్తుంటుంది. జయమాలిని డ్రస్ కూడా ఈ కాలం హీరోయిన్ల డ్రస్ కన్నా నయమే అనచ్చు..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా నాసామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా నాసామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా

అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓరాణి
కట్టు కధలు చెప్పమాకులే

పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ

హా గడపదాటిననాడె కడప చేరాను
తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను..
వడ్డించుకుంటాను
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో...
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి
ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి
ముద్దుకైనా ముట్టుకోను
ముద్దుకైనా ముట్టుకోను

పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ

గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే అ.
నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అహహ....
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

పుట్టింటోళ్ళు తరిమేసారు
హ.కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ

సైన్మా :: వేటగాడు - 1979
దరువుల్ :: చక్రవర్తి
రాతల్ :: వేటూరి సుందర రామమూర్తి
గొంతుల్ :: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల

1, అక్టోబర్ 2017, ఆదివారం

గుడివాడ ఎళ్ళాను..

అడియో ::


ఈడియో ::


లిరికియో ::

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను

కమ్మని పాట చక్కని ఆట
కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా.. కొందరు నన్ను
పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు
నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైబడతారు
దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుత్తూరు ఎన్నెన్నో చూసాను

బందరులోనా అందరిలోనా
రంభవె అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాగు బాబు చేసాడు డాబు
రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె
తిరపతి లోనా పరపతి పోయే
అందరి మెప్పు పొందాలంటె
దేవుడికైన తరం కాదు.. యముండా..
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను
యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

సైన్మా :: యమగోల -- 1977
మోతల్ :: చక్రవర్తి
రాతల్ :: వేటూరి
గొంతుల్ :: సుశీల