31, మార్చి 2013, ఆదివారం

ఈ బ్లాగ్ లో...


** హెచ్చరిక **

ఈ బ్లాగ్ లో తెలుగు మరియూ హిందీ సినిమాల నుండి సంగ్రహింపబడిన ఐటం సాంగ్ వీడియోలు, ఆడియోలు, లిరిక్స్ ఉంటాయి. ఇంకా కొన్ని తెలుగు సినిమాలలో మాంచి ఊపున్న పాటలను కూడా పొందుపరిచే ఉద్దేశ్యముంది. అంటే ఐటం సాంగ్ కాకపోయినా అవి మంచి బీట్ ఉన్న పాటలై మాస్ ఎంజాయ్ చేసేట్లుంటే ఆవి కూడా ఇస్తాను.

ఇవి అన్నీ కూడా పబ్లిక్ గా ప్రదర్శింపబడే సినిమాలలో నుండి సంగ్రహించబడినవే అయినా కూడా...

చాలాపాటలలో శృతిమించిన శృంగారం ఉండవచ్చు

అందువలన 18 సం.ల. వయసు లోపు వారు, ఈ బ్లాగ్ కు దూరంగా ఉండటం అన్నివిధాలా శ్రేయస్కరం. అలాగే ఇటువంటి కంటెంట్ ఇష్టంలేని వారు సైతం దయచేసి ఈ బ్లాగ్ చూడవద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. చూడకూడనివి అన్నీ చూసేసి ఆనక తీరిగ్గా మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడిస్తే తూర్పు తిరిగి దండం పెట్టమనడం తప్ప నేనేం చేయలేను.

అయితే ఇవన్నీ కూడా U/A or A సెన్సార్ సర్టిఫికెట్ పొంది దేశవ్యాప్తంగా ప్రదర్శించబడే చిత్రాలలోని పాటలే కనుక నేను ఈ బ్లాగ్ కు అడల్ట్ కంటెంట్ అని టాగ్ చేయడంలేదు. పిల్లలు చూడకుండా నియంత్రించాలంటే నెట్ లో దొరికే కంటెంట్ ఫిల్టర్స్ ఉపయోగించ గలరు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.