రాజశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజశ్రీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2018, మంగళవారం

నా నవ్వే దీపావళీ..

వన్నెల విసనకర్రలాంటి చిన్నదాని వెన్నెల నవ్వుల వెలుగుల ముందు దీపావళి దివ్వెల వెలుగులు ఏపాటివి చెప్పండి. అందుకే ఈమె నా నవ్వే దీపావళి అని అంత ధీమాగా పాడగలిగింది. ట్యూన్ క్లాస్ అయినా ఈ పాటలో మిగిలినవన్నీ మాసే.. చూసీ వినీ ఆనందించేయండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం నా వయసే
అతిమధురం నా మనసే

నా నవ్వే నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
అందాలన్నీ పూచెను నేడే
ఆశల కోటా వెలిసెను నేడే
స్నేహం నాది దాహం నీది
కొసరే రేయీ నాదే నీదే
ఆడీ పాడీ నువ్వే రా

నా నవ్వే నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం నా వయసే
అతిమధురం నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

లలలాల లాల లాలలాలలాలా
లాలలా లాలలాలాలాలాలల

కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు పలికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు పలికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం
పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడీ పాడీ నువ్వే రా

నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

సైన్మా : నాయకుడు (1987)
దరువుల్ : ఇళయరాజా
రాతల్ : రాజశ్రీ
గొంతుల్ : జమునా రాణి

26, జులై 2016, మంగళవారం

జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ..

అప్పట్లో సర్దార్ పాపారాయుడు సినిమా దదాపు యాభై రోజులు ఆడిన తర్వాత మళ్ళీ జనాన్ని థియేటర్లకి రప్పించడానికి ఈ పాట కలిపారట... అదీ ఐటం సాంగ్స్ పవర్ అంటే. ఇక ఈ పాటను డైలాగ్స్ తో సహా జానకి గారు పాడిన తీరు నభూతో నభవిష్యత్.. సరదాగా సాగే ఈ పాటను మీరూ చుసీ వినీ ఎంజాయ్ చేయండి.

ఆడియో ::
http://gaana.com/album/sardar-paparayudu

ఈడియో ::

 
లిరికియో ::


నమస్కారమండి... ఆయ్.. అవునండీ..
అయ్ బాబోయ్ ఈల్లెందుకండీ వచ్చేశానుగా..

మొన్నీమధ్య బావగారబ్బాయ్ పెళ్ళికి బెజవాడెళ్ళానండీ..
వాయించరా సచ్చినాడా ఊపుకావాలీ..
ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయనీ మనోరమా ఓటేలుకెళ్ళానండీ..
రూమ్ కావాలన్నాను..
డబలా సింగిలా అన్నారు
డబలే అన్నాను
ఏసీయా నానేసీయా అన్నారు
ఏసియే అన్నాను
పేరు అన్నాడు
జ్యోతిలక్ష్మి అన్నాను
అనగానే


గబుక్కున జూశాడు గుటుక్కున నవ్వాడు
గబుక్కున జూశాడు  గుటుక్కున నవ్వాడు
చటుక్కున లేచాడు పుటుక్కున పిలిచాడు
చటుక్కున లేచాడు పుటుక్కున పిలిచాడు
గూర్ఖా రామ్ సింగ్ ఆపరేటరజిత్ సింగ్
కిళ్ళీ కొట్టు కిషన్ సింగ్ హహ పేపర్ స్టాలు ధారాసింగ్
వగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు
వగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు

ఏవనరిచారో తెలుసా..

 
జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. పాపం చీరకె సిగ్గేసిందీ..
అ జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. పాపం చీరకె సిగ్గేసిందీ..
అయ్యో బొట్టుకే భయమేసిం దీ.. ఊరంతా హోరెత్తింది..
బొట్టుకే భయమేసిందీ.. ఊరంతా హోరెత్తింది..

అన్చెప్పి గోల గోల చేసి చివరికి
రూం నంబర్ నూటపదకొండిచ్చాడు.
తీరా తలుపు తీసి చూస్తే..

 
మంచం పక్కన పగిలినా గాజుముక్కలూ
మంచం కింద నలిగినా మల్లెమొగ్గలూ
మంచం మీద మిగిలినా ఆకువక్కలూ
మంచం చాటున ఒలికినా పాలచుక్కలూ పాలచుక్కలూ..

కంగారు పడి ఏవిటా అని అడిగాను
ఎవరో కొత్తగా పెళ్ళి చేసుకున్న దంపతులు
మూడు నిద్దర్లు జేసెళ్ళారన్నారు
ఆ నిద్దర్లు నాకెప్పుడా అని
ఆ మంచం మీదే పడుకున్నాను పడుకోగానే


ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోనూ.. డుర్ర్..డుర్ర్..డుర్ర్.. మని బెల్లూ..
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మని ఫోనూ.. డుర్ర్..డుర్ర్..డుర్ర్.. మని బెల్లూ..
ధన్ ధన్ ధన్ మని తలుపూ.. ధన్ ధన్ ధన్ మని తలుపూ..
రారారా రమ్మని పిలుపు.. రారారా రమ్మని పులుపూ..

ఏవిటా అని తలుపు తీశాను.. తీయగానే

ఫస్ట్ ఫ్లోరు పాపయ్య.. రెండో ఫ్లోరు రంగయ్య
ఆయ్ మూడో ఫ్లోరు ముత్తయ్య.. లిఫ్ట్ బోయ్ లింగయ్య..
వగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు
వగర్చుకుంటూ వచ్చారు ఆయాసంతో అరిచారు

ఏవనీ..


జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. పాపం చీరకె సిగ్గేసిందీ..
జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. పాపం చీరకె సిగ్గేసిందీ..
అయ్యో బొట్టుకే భయమేసిందీ.. ఊరంతా హోరెత్తిందీ..
బొట్టుకే భయమేసిందీ.. ఊరంతా హోరెత్తిందీ..

ఆతర్వాతెలాగో మా ఇంటికెళ్ళిపోయాను..
తీరా ఇంటికెళ్తే..

 
గుమ్మానికీ మావిడి తోరణాలు..
ఇల్లంతా మనుషుల తిరనాళ్ళు..
గదిలో కొత్తవి ఆభరణాలు..
గదిలో కొత్తవి ఆభరణాలు..
చూసీ చూడని నవ్వుల బాణాలు..

ఖంగారు పడిపోయండీ.. ఏవిటా అని అడిగాను..
ఎవరో నన్ను పెళ్ళి చేస్కోడానికి
పెళ్ళి చూపులకొచ్చారన్నారు
అతను చూస్తాడు తొరగా రమ్మని
ముస్తాబు చేసి కూర్చోబెట్టారు..
కూర్చోగానే..

 
పెళ్ళికొడుకు తమ్ముడూ.. తమ్ముడు గారి తండ్రీ..
తండ్రి గారి తాత.. తాత గారి మనవడు..
అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు
అరుచుకుంటూ లేచారు.. విరుచుకుంటూ అరిచారు

ఏవనో తెలుసా..

 
జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. పాపం చీరకె సిగ్గేసిందీ..
జ్యోతిలక్ష్మి చీరకట్టిందీ.. పాపం చీరకె సిగ్గేసిందీ..
అమ్మో బొట్టుకే భయమేసిందీ.. ఊరంతా హోరెత్తిందీ..
బొట్టుకే భయమేసిందీ.. ఊరంతా హోరెత్తిందీ..

అనీ కోపంగా ఎళ్ళిపొయారు..
ఆ అందరి కోసం అలా ఉండమంటారా..
ఇలా చీరగట్టుకోమంటారా..


సైన్మ :: సర్దార్ పాపారాయుడు -- 1980
దరువుల్ :: చక్రవర్తి
రాతల్ :: దాసరి/రాజశ్రీ
గొంతుల్ :: జానకి