అల్లరినరేష్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అల్లరినరేష్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జులై 2016, ఆదివారం

హత్తెరీ ఎంత హుషారే..

సిరివెన్నెల గారితో ఐటమ్ సాంగ్ రాయించాలనే ఆలోచన అసలు క్రిష్ కి ఎలా వచ్చిందో కానీ.. ఆయన ఈ పాటను కూడా ఎంత అందంగా రాశారో.. ఇక ఆ మ్యూజిక్ కి అయితే తెలియకుండానే డాన్స్ వేసేస్తాం..

ఆడియో ::
http://play.raaga.com/telugu/album/Gamyam-songs-A0001236

ఈడియో ::


లిరికియో ::

హత్తెరీ ఎంత హుషారే చింతామణి
ఎల్లలు మీరే చిందాపనీ
విందడిగారే అందాలని
ముందుకురారే అందాలని

కొమ్మలో గమ్మున ఉంటే కంటపడవే నిధులు
కమ్మగా ఘం ఘం అంటూ కబురెడితే నీ సుధలు
దిరిసెన పువ్వా దర్శనమివ్వా అనవా తుమ్మెదలూ
పాపలా నిదరోమంటే వింటదా ఈడసలు
ఏపుగా ఎదుగుతు ఉంటే ఒంటిలో మిసమిసలు
ఎగబడతారే పొగబెడతారే తెగబడి తుంటరులు
స్వేచ్ఛగా ఎగురుతు ఉంటే పసివన్నెల జెండా
భక్తిగా వందనమనరా ఊరు వాడంతా
పచ్చిగా గుచ్చుకుంటే సూదంటి చూపులిట్టా
పైటిలా నిలబడుతుందా చెక్కు చెదరకుండా

హత్తెరీ ఎంత హుషారే చింతామణి
ఎల్లలు మీరే చిందాపనీ
విందడిగారే అందాలని
ముందుకురారే అందాలని

అరె అరె అరె అరె..
పిందెలా ఉన్నది కానీ పండెరో కళలన్నీ
ఎందరో తెలియదు కానీ పిండెరో వలపన్ని
చంబల్ రాణీ సొంపులలోని సంపదలెన్నెన్నీ..
నిందలో నిజమో కానీ ఎందుకా కథలన్నీ
మందిలో దొరలే కానీ దొంగలసరెవ్వరని
గుండెలలోని గూడుపుఠాణి అడిగేదెవ్వరనీ
కుందనపు బొమ్మై ఆలి నట్టింట్లో ఉన్నా
నిన్నొదిలి పోలేరమ్మా ఓ పోలేరమ్మ
చేతిలో అమృతముంటే చేదేలేవయ్యా
సంతలో అమ్మే అంబలి బాగుంటుందయ్య

హత్తెరీ ఎంత హుషారే చింతామణి
ఎల్లలు మీరే చిందాపనీ
విందడిగారే అందాలని
ముందుకురారే అందాలని

సైన్మా :: గమ్యం - 2008
దరువులు :: ఈ.ఎస్ మూర్తి
రాతలు :: సిరివెన్నెల 
గొంతులు :: గాయత్రి, ఈ.ఎస్.మూర్తి