ఆరుద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరుద్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జులై 2016, మంగళవారం

మసక మసక చీకటిలో..

ఐటం సాంగ్స్ అంటే ఎల్.ఆర్.ఈశ్వరి గారిని గుర్తుచేస్కోకుండా కుదరదు కదా.. అందుకే ఆవిడ అదరగొట్టేసిన ఒక సూపర్ పాటను చూసి విని రెండు ఈలలేసుకుని ఎంజాయ్ చేద్దాం.. 

ఆడియో ::
naasongs.com/devudu-chesina-manushulu.html

ఈడియో ::
లిరికియో ::

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
మాపటేళకలుసుకో...
నీ మనసైనది దొరుకుతుంది
మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

ఓకే... యా... యా యా... యయాయయాయా...
యా యా... యయాయయాయా... హా...

మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా
మా దేశం వచ్చినవాడా మా బొమ్మలు మెచ్చినవాడా

తరతరాల అందాల తరగని తొలి చందాల
తరతరాల అందాల తరగని తొలి చందాల
ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా
అయితే... ఏ ఏ...

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
మాపటేళకలుసుకో...
నీ మనసైనది దొరుకుతుంది
మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

ఓకే... యా... యా యా... యయాయయాయా...
యా యా... యయాయయాయా... హా...

చోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా
చోద్యాలు వెతికేవాడా సొగసు చూసి మురిసేవాడా

కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల
కళ చేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల
నీ ముందుకు రావాలా నీ సొంతం కావాలా
అయితే.. ఏ ఏ..

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
మాపటేళ కలుసుకో..
నీ మనసైనది దొరుకుతుంది
మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది

ఓకే... యా.. యా యా.. యయాయయాయా..
యా యా.. యయాయయాయా.. హా..
  
సైన్మా :: దేవుడు చేసిన మనుషులు (1973)
దరువులు :: రమేశ్ నాయుడు
రాతలు :: ఆరుద్ర
గొంతులు :: ఎల్.ఆర్. ఈశ్వరి