16, మార్చి 2021, మంగళవారం

జల జల జలపాతం - ఈటీవీ

సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కన్నా వీళ్ళ కెమిస్ట్రీ ఫిజిక్సూ బయాలజీ అన్నీ టూమచ్ గా ఉన్నట్లున్నాయ్ కదా. అంతా బానే ఉంది కానీ ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా టీవీ చూసే సమయంలో ఈ పాట ప్రసారం చేయడం మాత్రం... హ్మ్.. ఎందుకులెండి.. ఏమైనా అంటే రిమోట్ లేదా అంటారు.. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఈ పోస్ట్ చివర ఉంది.

ఈడియో ::


ఆడియో :: 


లిరికియో ::

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరుఅలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

హే... మన జంటవైపు 
జాబిలమ్మ తొంగి చూసెనే
హే... ఇటు చూడకంటూ
మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుందీ లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఎలాగ బైటపడుతోంది ఈవేళా
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్నూ
నీ నుంచి నన్నూ 
తెంచలేదు లోకం  

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు
రాదు రాదు రోజూ
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు
తడపదంట ఒళ్లు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఏక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను 
మనకు మనమే సొంతం 

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను

చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చెర చెర నువు అల్లితే నన్ను
ఎగసే కెరటాన్నవుతాను

సైన్మా :: ఉప్పెన - 2021
మోతల్ :: దేవీశ్రీప్రసాద్ 
రాతల్ :: శ్రీమణి  
గొంతుల్ :: జస్ ప్రీత్, శ్రేయాఘోషల్  
గెంతుల్ :: సునీల్ మాస్టర్ (ఈ వీడియోలో) 
గెంతుల్ :: బృంద మాస్టర్ (సినిమాలో) 

ఒరిజినల్ సినిమాలోని వీడియో ఇక్కడ చూడవచ్చు.  


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.