నగ్మా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నగ్మా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, నవంబర్ 2018, శుక్రవారం

పిలిచే కుహు కుహు..

ఈ పాట ఈ బ్లాగ్ లో ఏ కేటగిరీలోకి వస్తుందబ్బా అని అట్టే ఆలోచించకుండా జానకి గారి గొంతులోని నిషాని గుండెనిండా నింపేసుకుని వీకెండ్ మొదలెట్టేయండి మజా మజాగా..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఓఓఓ.... ఓఓఓ...
పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే
పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

ఒళ్ళే ఉయ్యాలగ ఊగిందిలే
ఒళ్ళో తాపాలను రేపిందిలే
ఓఓఓఓ.... ఓఓఓఓఓ....

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

చురుక్కుమంటు కొరుక్కుతింటు
చురచురామనే సూరీడు
కలుక్కుమంటు తళుక్కుమంటు
ససేమిరా అనే నా ఈడు
అదేమిటో గానీ తడే తమాషా
చలెందుకో గానీ బలే కులాసా
ఓహో... ఓఓఓ...
వయ్యరాలే ఓణీలేసే

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

పదాల తాళం పెదాల రాగం
తనువులో లయే ఝుమ్మంది
కిలాడి ప్రాయం చలాకి గేయం
పద పసాసరి లెమ్మందీ
అదేమిటో గాని చలే నిజంలా
మనస్సుతో పేచి మజా మజాగా
ఓహో... ఓఓఓ...
గాలే నాలో ఈలే వేసె

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే
ఒళ్ళే ఉయ్యలగ ఊగిందిలే
ఒళ్ళో తాపాలను రేపిందిలే
ఓఓఓ...

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

సైన్మా :: కిల్లర్ -
మోతల్ :: ఇళయరాజా
రాతల్ :: వేటూరి 
గొంతుల్ :: జానకి