మోహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మోహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2017, మంగళవారం

డిక్కడిక్క డుండుం..

సోగ్గాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మాసు క్లాసు తేడా లేకుండా ఒక ఊపు ఊపేసిన ఈ పాట ఎంజాయ్ చేసేయండి... 

ఆడియో ::

ఈడియో ::



లిరికియో :: 

అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ.. 
వాసి వాడి తస్సదియ్యా.. 
ఆ... అద్దీ లెక్క... ఆఆ..ఆఆఅ..
హల్లో హలో.. మైక్ టెస్టింగ్.. చుక్ చుక్ 
ఆ వస్తందొస్తందీ.. ఓకే.. స్టార్ట్.. 

డుంగడుంగ డుంగ్ డుంగ్ 
డుంగడుంగ డుంగ్ డుంగ్ 
డుంగడుంగ డుంగ్ డుంగ్ 
హేయ్ పాడండే... 
డుంగడుంగ డుంగ్ డుంగ్ 
డుంగడుంగ డుంగ్ డుంగ్ 
డుంగడుంగ డుంగ్ డుంగ్ 
ఎస్కో... 
ఎయి...

ముంతలో కల్లు ఊరిస్తవుంటే ఓ సుక్క ఎసేయ్యరో.. కరెక్ట్..
ఒంటిలో వేడి తన్నేస్తవుంటే ఓ పట్టు పట్టెయ్యరో.. రైటో.. 
కల్లుకోసమొచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు
కళ్ళ ముందు అందముంటె తస్సదియ్య తప్పుకోడు
సంబరాలు చేసుకోరా సొగ్గాడే చిన్ని నాయన.. హాయ్...

అరే.. డిక్కడిక్క డుండుం..
డిక్కడిక్క డుండుం..డిక్కడిక్క డుండుం..
ఆరే.. డిక్కడిక్క డుండుం..
డిక్కడిక్క డుండుం..డిక్కడిక్క డుండుం..

అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఊపుతున్నారే

యో యో యో యో యో యో ఏ ఏ
యో యో యో యో ఏ

అరె.. మూడొచ్చినప్పుడే.. జింగిలాలో
నువ్వు గోడెక్కి దూకరో.. జింగిలాలో
మరి నాలాగ ఎవ్వడు.. జింగిలాలో
నీకు బొట్టెట్టి చెప్పడు.. జింగిలాలో
అరె.. గొంతులోకి జారుతున్న ఒక్కొక్క చుక్కా
గంతులేసి ఆడమన్నదే
అరె పుట్టుమచ్చ చూడగానె 
లేనిపోని ఉక్క చుట్టుముట్టి చంపుతున్నదే
గంప గుత్తకొస్తవా గాజుల్ని తెస్తను
పంపు షెడ్డు కొస్తవా పట్టీలు తెస్తను
వంగ తోట కొస్తనంటే రాసి ఇస్త వీలునామా.. 
హోయ్... వస్తావా... 
అక్కడ్రా ఇక్కడ్రా అంటన్నావ్ ఇంతకీ ఏం జేస్తావేంటి

ఇంకేవుందీ...
డిక్కడిక్క డుండుం.. డిక్కడిక్క డుండుం.. 
డిక్కడిక్క డుండుం..

హా... అరె.. డిక్కడిక్క డుండుం..
డిక్కడిక్క డుండుం..డిక్కడిక్క డుండుం..
గోడ చాటుకెళ్ళీ ఆడఈడ గిల్లీ
డిక్కడిక్క డుండుం..

ఎయ్.. ఏహెయ్.. 
ఏస్కో.. ఏస్కో.. 
ఏయ్.. ఏయ్.. ఏయ్.. ఏయ్..

అరె అరె అరె అరె అరె 
కుర్రోడు సూపరో.. జింగిలాలో
బోలెడున్నాది మాటరో.. జింగిలాలో
ట్రాకు ఎక్కాడు సూడరో.. జింగిలాలో
ఇంక తగ్గేది లేదురో.. జింగిలాలో
అరె.. తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట
నొప్పి నొప్పి నొప్పి గున్నది హా... 
అరె లేనిపోని కోరికేదొ రంకెలేసుకుంటూ
రయ్యి రయ్యి రయ్యి మన్నది
ఆవలింతలన్నవే రావేంటొ ఇప్పుడు
కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు
ముట్టుకుంటె కందిపోయే అందమున్న సిన్నదాన
హోయ్... 

అద్గదీ.. ఇప్పుడు మొదలవుద్ది జూడు.. 
ఏంటదీ.. 
అరే.. డిక్కడిక్క డుండుం..
డిక్కడిక్క డుండుం..డిక్కడిక్క డుండుం..
అంటే 
అరె.. మోగిపోద్ది డప్పు నిప్పు మీద ఉప్పు
డిక్కడిక్క డుండుం..

సైన్మా :: సోగ్గాడే చిన్ని నాయన - 2016
దరువుల్ :: అనూప్ రూబెన్స్ 
రాతల్ :: భాస్కర భట్ల 
గొంతుల్ :: ధనుంజయ్, మోహన భోగరాజు

31, జులై 2016, ఆదివారం

మనోహరీ..మనోహరీ..

బాహుబలి సినిమా లోని ఈ పాట నా ఫేవరెట్స్ లో ఒకటి ఐటమ్ సాంగ్ ఐనా కూడా చైతన్యప్రసాద్ కమ్మటి తెలుగు పదాలతో చాలా అందంగా రాశారు. పూర్తిగా ఊహా ప్రపంచంలో విశృంఖలతకు అవకాశమున్నా రాజమౌళి కాస్ట్యూమ్స్ మొదలు చిత్రీకరణ వరకూ చాలా హుందాగా తెరకెక్కించాడు.

ఆడియో ::
http://mio.to/album/M.M.+Keeravaani,+Mounima/Baahubali+-+The+Beginning+(2015)

ఈడియో ::

లిరికియో ::

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తీయ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్ రా చేయ్ రా
మనోహరీ... మనోహరీ...

తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్ నా
నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా
నీ కండల కొండలపై నాకైదండలు వేసెయ్ నా
నా పయ్యెద సంపదలే ఇక నీ శయ్యగ చేసేయ్ నా
సుఖించగా రా...
మనోహరీ మనోహరీ

పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

సైన్మా :: బాహుబలి -- 2015
దరువుల్ :: ఎమ్ ఎమ్ కీరవాణి
రాతల్ :: చైతన్య ప్రసాద్
గొంతుల్ :: మోహన భోగరాజు, రేవంత్