రేలా కుమార్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రేలా కుమార్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, అక్టోబర్ 2018, సోమవారం

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు...

ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ సుకుమార్ సిన్మా, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇక అడ్డేముంది అందుకే ఓ ఆర్నెల్ల నుండీ ఊర్లో ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తుంది. అందుకే మన బ్లాగ్ రీఓపెనింగ్ ఈ పాటతో చేసేస్కుందారి. 

ఈడియో :: 


లిరికియో ::

రంగస్థల గ్రామ ప్రజలందరికి  విజ్ఞప్తి
మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి
జిగేలు రాణి వచ్చేసింది ఆడి పాడి అలరించేస్తది అంతే...
మీరందరు రెడీ గా ఉండండి
అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు

ఒరెఒరెఒరెఒరే...
ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో
మరి ఉండ్రా ఏంటి నువ్వత్తన్నావ్ అని తెలిసీ
పక్కురినుండి కూడా వచ్చాం.. ఎగేసుకుంటూ
ఇదిగో ఆ గళ్ళ సొక్కా జిగేల్ రాజా ఏంది
గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకే
నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి
నువ్వేందయ్యా పూల సొక్కా
ఓ మీద మీద కొత్తన్నావో
ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ
అందరి దగ్గరకు నేనే వస్తా
ఆ అందరడిగింది ఇచ్చే పోతా.... అదీ

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ

ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే
ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే

ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణీ
కొత్త ప్రెసిడెంటు కది దాచుంచానే
మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణీ
మీ అయ్యతోని పోటీ నీకు వద్దంటానే
మరి నాకేమిత్తావే జిగేలు రాణే.ఏఏఏ..హోయ్
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

నీ వయసూ సెప్పవే జిగేలు రాణీ
అది ఆరో క్లాసులో ఆపేశానే
నువు సదివెందెంతే జిగేలు రాణీ
మగాళ్ళా ఈకునెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ
సుబ్బిశెట్టి పంచి ఊడితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణీ
అది పోలీసోళ్ళకి రిజర్వేషనే
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణే..ఏఏ..హేయ్..
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ
ఏదడిగినా లేదంటావ్
నీ దగ్గర ఇంకేం ఉంది చెప్పూ
నీకేం కావాలో చెప్పూ

హేయ్....నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ
దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ
నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ
వాటి సప్పుడు వింటూ సచ్చిపోతమూ
అరె నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ
ఆ వాసన చూస్తూ బతుకంతా బ్రతికేత్తామూ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట వాడు పాడండోయ్ రాజా

నా పాటా ఏలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడెద్దు
నా పాటా పులి గోరూ
వెండి పళ్ళెం.. ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగా కట్టించుకున్న ఇల్లూ
నా పాట రైసు మిల్లూ
అహే ఇవన్ని కాదు కానీ
నా పాట క్యాషు లక్షా
అయిబాబోయ్ లచ్చే

సైన్మా :: రంగస్థలం - 2018
మోతల్ :: దేవి శ్రీ ప్రసాద్
రాతల్ :: చంద్రబోస్
గొంతుల్ :: రేలాకుమార్, గంటా వెంకట లక్ష్మీ