18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నా పరువం నీకోసం...

అసలు సిసలైన మాస్ సినిమాలంటే అన్నగారి సినిమాలే మాస్ సాంగ్స్ అంటే ఆయన సినిమాలో సాంగ్సే. యుగంధర్ సినిమా లోని ఈ ఇళయరాజా గారి పాటను జానకి గారు భలే పాడారు. జయమాలిని అభిమానులకు వినడానికే కాదు చూడడానికి కూడా బావుంటుందనుకోండి. 
ఎంజాయ్ ద వీకెండ్ విత్ దిస్ వింటేజ్ సాంగ్. 

ఈడియో ::


లిరికియో ::

నా పరువం నీకోసం
నా పరువం నీకోసం
పానుపువేసి ఉన్నదీ 
వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా 
నా పరువం నీకోసం
నా పరువం నీకోసం

రాకరాక వచ్చానోయి 
మీ ఇంటికి ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి 
నా కంటికి నా చిగురొంటికీ
రాకరాక వచ్చానోయి 
మీ ఇంటికి ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి 
నా కంటికి నా చిగురొంటికీ
ఈ సమయం నా హృదయం
ఈ సమయం నా హృదయం
నిన్ను చూసి నాగులాగ 
ఊగుతున్నదీ 
చెలరేగుతున్నదీ

నా పరువం నీకోసం
నా పరువం నీకోసం

ఒక్కమాటు ఇక్కడే 
నువ్వుండిపోరా 
రుచులందుకోరా
తియ్యగా నేనర్పించేది 
తీసుకోరా ఆపై చూసుకోరా
ఒక్కమాటు ఇక్కడే 
నువ్వుండిపోరా 
రుచులందుకోరా
తియ్యగా నేనర్పించేది 
తీసుకోరా ఆపై చూసుకోరా
ఈ రోజూ ఇక రాదూ
ఈ రోజూ ఇక రాదూ
ఈ కన్నెవయసు అందుకేలే 
కాగుతున్నది 
తెగ కాచుకున్నది

నా పరువం నీకోసం
నా పరువం నీకోసం
పానుపువేసి ఉన్నదీ 
వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా 

సైన్మా :: యుగంధర్ - 1979
దరువుల్ :: ఇళయరాజా 
రాతల్ :: సినారె
గొంతుల్ :: జానకి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.