7, ఫిబ్రవరి 2021, ఆదివారం

భూం బద్దలు భూం బద్దలు...

మాస్ మహారాజా రవితేజ రీసెంట్ హిట్ క్రాక్ సినిమాలోని ఈ మస్త్ ఐటమ్ సాంగ్ తో వీకెండ్ ముగించండి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ గోపాల్ వర్మ ఫైండ్ అపర్ణ రాణి అండ్ రవితేజ స్టెప్పులకి భూమి బద్దలే.  

ఈడియో ::



ఆడియో :: 


లిరికియో ::

ఊళ్ళో యాడ ఫంక్షన్ జరిగిన
మనమే కదా ఫస్టు గెస్టు
దద్దరిల్లే దరువుల లెక్కన
మన ఐటమ్ సాంగ్ మస్టు

అల్ ది బెస్టు

చీమకుర్తిలో కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా

ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా
ఏ చోటికి పోయినా అదే పాత వరసా
చిన్నా పెద్దా నన్ను చూసి వచ్చేస్తారు వలస
ఆ కష్టం పళ్ళేక ఆళ్ళ గోల సూళ్ళేక
గాల్లోన ముద్దులని ఎగరేసా

భూం బద్దలు భూం బద్దలు
నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ 
అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు
నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు 
మందే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే
నువ్వు నవ్వుతుంటె గుండెకింద సలుపొస్తాందే
నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా నలుపొస్తాందే

స్టేజి మీదకెక్కనియ్యి
వంద కోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ
కందకుండా పిండేస్తా
కరువుతీరా ఒక్కసారి
కావులించి వదిలేస్తా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దొస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే

డీజే డీజే డీజే… 
డీజే కాదురొరేయ్…
ఇది ఓజే… 
ఒంగోలు జాతర… 
ఓజే ఓజే ఓజే

యమ ఆర్కెస్ట్రా డాన్సు
మీకు దొరికిందే చాన్సు
ఐ లవ్ యు మై ఫ్యాన్సు
అందరికీ థాంక్సు
ఈ రాతిరి మీకు ఫుల్ మీల్సు
దిమ్మ తిరిగే రిలాక్సు
అడగన్లే టాక్సు
తెల్లార్లు కొట్టండి క్లాప్సు

నీ జోషు, నీ గ్రేసు
అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందర జుజూబీలే
మిస్ ఇండియా ఫిగర్స్
వన్ టౌన్ రాజా 
నీ ఫన్ టౌన్ కి వచ్చాడే
వినిపించెయ్ నా జ్యూకు బాక్సు

భూం బద్దలు భూం బద్దలు
నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ 
అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు
నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు 
మందే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

సైన్మా :: క్రాక్ - 2021
దరువుల్ :: ఎస్.ఎస్.తమన్  
రాతల్ :: రామజోగయ్య శాస్త్రి 
గొంతుల్ :: మంగ్లి, సింహ, శ్రీకృష్ణ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.