27, ఫిబ్రవరి 2021, శనివారం

నా తప్పు ఏమున్నదబ్బా..

నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నా అందం చూసి మీరు మతిపోగొట్టుకుంటే అందులో నా తప్పేముందంటూ ప్రశ్నిస్తున్న ఈ మిస్ యూనివర్స్ కంటెండర్ "ఊర్వశి రౌతేలా" గొడవేంటో మీరూ కాస్త చూడండి ఈ వీకెండ్.

ఈడియో ::


ఆడియో :: 


లిరికియో ::

హలో సౌత్ ఇండియా
దిస్ ఈజ్ ఊర్వశి 
అయామ్ ద బ్రాండ్ ఆఫ్ 
రంభా ఊర్వశి మేనకా 
ప్లీజ్ బ్లెస్స్ మీ 
మై డెబ్యూ బ్లాక్ రోజ్

నేను పుట్టీ పుట్టగానే బుగ్గ మీద
అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే
నేను నడిచీ నడవగానే నల్ల తాడు
నాన్న నా కాలికి కట్టేసినాడే
నేను నవ్వీ నవ్వగానే నా నోరు నొక్కినారు,హాయ్
ఆడీ పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు..
నేను బడికెళ్తే భాగోతం.. మరి గుడికెళ్తే ప్రేమ గీతం
నా అందాలు చూసి… అబ్బాయిలు టెంప్ట్ ఐతే

నా త ప్పు ఏ ముం దబ్బా… హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా…
హా… నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
అర్రె..! నా తప్పు ఏమున్నదబ్బా

నా మొహాన్ని చూసి… 
డిస్టర్బ్ ఔతున్నారని
మేకప్పుతో కప్పేసానే
నా పెదాల్ని చూసి… 
పిచ్చెక్కుతున్నారని
లిప్స్టిక్కుతో దాచేశానే

నా కళ్ళను కాజల్తో కప్పేస్తి… 
నా చెవులను దిద్దుల్తో దాచేస్తి
నా మెడను నగల్తో మూసేస్తి… 
నా ముక్కుని పుడకతో పూడ్చేస్తి
ఇంత చేసినా ఈ కుర్రాళ్లు 
ఎర్రెక్కిపోతున్నారంటే
నా తప్పు ఏముందబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా… హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా

ఆర్డినరీ గర్ల్స్ కి… ఇస్తారు పింక్ రోజ్
యావరేజ్ గర్ల్స్ కి… ఇస్తారు యెల్లో రోజ్
అందమైన గర్ల్స్ కి… ఇస్తారు రెడ్ రోజ్
నాలాంటి హాట్ గర్ల్స్ కి… ఇస్తారు బ్లాక్ రోజ్
 
నా మాటల్తో మెంటల్… 
ఎక్కిపోతున్నారని
ఛాటింగులే నే చేసానే
నా చీర కట్టు చూసి… 
చెదిరిపోతున్నారని
టు పీసులే ఏసేశానే

ఇల్లు దాటకుండ ఇంస్టాగ్రామ్లోకొస్తి
ఒళ్ళు దాచకుండ పోస్టులే చేస్తి
మీ ఫాలొవర్సె కదా నా ఆస్తి
పెళ్ళెందుకంట..? ఉండగ మీ దోస్తీ

నా కొలతలు చూసి… 
మీరు కలతలు చెందితే
నా తప్పు ఏముందబ్బా… హాయ్
నా తప్పు ఏమున్నదబ్బా
హా… నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా

సైన్మా :: బ్లాక్ రోజ్ - 2020
మోతల్ :: మణిశర్మ  
రాతల్ :: సంపత్ నంది  
గొంతుల్ :: హారిక నారాయణ్  
గెంతుల్ :: జానీ మాస్టర్ 
 

1 కామెంట్‌:

  1. కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
    ప్రతి ఉదయం నీ పిలుపే
    హృదయంనే కదిలించే
    మనసే పులకించే
    Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
    Song Link: https://youtu.be/Z9qVLatW6dQ
    Please hit Like and Subscribe

    రిప్లయితొలగించండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.