7, సెప్టెంబర్ 2020, సోమవారం

ఓణీ వేసుకున్న పూలతీగ...

కంటైనర్ ట్రాలర్ మీద అదీ రోడ్ పై వెళ్తూ ఉండగా అంతమంది గ్రూప్ డాన్సర్స్ తో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో స్టెప్పులతో పాట తీయడం అసలు ఎంత క్రేజీ ఆలోచనో కదా. అలాంటి క్రేజీ ఆలోచనకి పాట రాసే అవకాశం రామజోగయ్య శాస్త్రి గారికి వచ్చింది. పైగా అదే తన మొదటి పాట, గురువుగారు సిరివెన్నెల గారు తన ప్రియ శిష్యునికి ఓం రాసిచ్చినట్లుగా ఓ మాంచి పల్లవి రాసిచ్చారు. ఇంక తిరుగేముంది రాంజో కలం కదం తొక్కింది ఈ అందమైన పాటని మన ముందుంచింది. బొత్తాలు చిన్న మొత్తాల పొదుపు లాంటి రైమింగ్ పదాలతో కవ్వించి నవ్వించేశారు రాంజో. 

జెస్సీ గిఫ్ట్స్ కంపోజ్ చేసి పాడిన ఈ పాట ట్యూన్ కి, చిత్రీకరణకి, లిరిక్స్ కి కూడా నేను ఫ్యాన్ ని. బిగ్ బాస్ సీజన్ టూ చూసిన వాళ్ళకి అమిత్ తివారి తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయ్ పేరు కౌశ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఇక ఈ పాటలో ఉన్న గ్రూప్ డాన్సర్స్ లో ఇప్పటి ఫేమస్ డాన్స్ మాస్టర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా కనిపిస్తారు. మరి ఆలశ్యమెందుకు చూసి ఆనందించండి.

ఈడియో :: 



లిరికియో ::

ఓణీ వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
రాణీ కాసులున్నీ కళ్ళనిండా రాలుతుంటే బల్లే బల్లే
కానీ ఖర్చులేని అల్లరిట్టా తుల్లుతుంటే బల్లే బల్లే

యే హై చాంద్ కా టూక్ డా..
ఏదో చేయవేంది పోరడా..
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా
 
ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే 
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా 

మణులున్న గనిలాంటి నిగనిగల సిరి వగల 
కలవారి కామాక్షి నువ్వే కదా...
కళలంటీ కలలన్నీ మా కళ్లకిచ్చేసి నిరుపేద లోలాక్షివయ్యావుగా 
బట్టల్లో పోదుపంటే నాకిష్టం
అందాలపై అదుపు అంతే కష్టం
బొత్తాలు మానేసి లోకానికీ
చిన్ని మొత్తాల పొదుపుంటే చూపావులే

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే 
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
యే హై చాంద్ కా టూక్ డా
ఏదో చేయవేంది పోరడా 
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

తల్వారు తళుకుల్తో నిలువెల్లా కోస్తుంటే 
ఆ తీపిగాయాలు మానేదెలా
జలతారు సొంపుల్తో జాదూలు చేస్తుంటే 
ఆ చిలిపి జాతర్ని ఆపేదెలా
ఇన్నిన్ని అందాలు నా నేరమా 
జాలేసి చూపిస్తే నిష్టూరమా 
నీకున్న జనశక్తి సామాన్యమా
నిన్ను చూసాక మతిచెడితే విడ్డూరమా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే 
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
యే హై చాంద్ కా టుక్ డా
ఏదో చేయవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
నీకు ఆశ ఉంటే చెయ్యి వెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

సైన్మ :: యువసేన - 2004
గొంతుల్ :: జెస్సీ గిఫ్ట్స్, స్మిత 
రాతల్ :: రామజోగయ్య శాస్ర్తి 
దరువుల్ :: జెస్సీ గిఫ్ట్స్   
 
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.