20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సిలక సిలక (జిల్లేలమ్మా/దిమాక్)

ఈ రోజే విడుదలైన ఈ వీర ఊర మాస్ సాంగ్ తో ఈ వీకెండ్ కుమ్మేయండి. 

ఈడియో ::



లిరికియో :: 

వాని ఎద మీద ఉండేటి 
ఘమ ఘమ గంధాలు సందామావయ్యలో...
నా రైక ముడి మీద రాలినా 
సాలయ్య రంగారామయ్యలో...

వాని నడుముకు ఉండేటి 
బిళ్ళల మొలతాడు సందామావయ్యలో...
నా పట్టుకుచ్చుల కోకకంటినా సాలయ్య
రంగారామయ్యలో...

సిలక సిలక సిలక ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా పెట్టిపోరా సురక
గిరక గిరక గిరక ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్టబుగ్గే కొరక
జిల్లేలమ్మా జిట్టా ..పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా...నిన్నే తేలై కుట్ట

ఉంటే దమ్ముంటే నే పూలపక్క
ఏస్తా చల్లేసేయ్ నీ సెమట సుక్క
వస్తా తాగేస్తా నీ సోకే గటక
ఏస్తా ఏయిస్తా నీ తోటే గుటక

జిల్లేలమ్మా జిట్టా ..పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా...నిన్నే తేలై కుట్ట

సిలక సిలక సిలక ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా పెట్టిపోరా సురక

గిరక గిరక గిరక ఇది సేదబాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్టబుగ్గే కొరక

పట్టుకొని జోకిస్తే చెటాకే నడుము...
తట్టుకొని ఊపేస్తా పటాకై తడుము...
సత్తువనీ చూపిస్తే పిల్లోడా దినము
దత్తతనే ఇస్తారా మల్లెపూల వనము

ఇస్మార్టే ఈ శంకరు.. పేల్చేస్తా నీ బంకరు
వస్తావా నా సెంటరు.. చూస్తారా నీ టెంపరు

అసలుకు నే కిరాకే నన్ను కెలక్కే
మసులుతుంది దిమాకే నువ్వు ఫసక్కే...

జిల్లేలమ్మా జిట్టా ..పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా...నిన్నే తేలై కుట్ట

సిలక సిలక సిలక ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా పెట్టిపోరా సురక

గిరక గిరక గిరక ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్టబుగ్గే కొరక

ఒంపులలో దాచుంచా చెకుముకి రాళ్ళు 
నిప్పులనే పుట్టించు తాకించీ వేళ్ళు 
ఎన్నెలనే మింగేసి యమాగుంది ఒళ్ళు
తిన్నెలపై మంచేసా చలో జొన్నసేలు

ఇస్మార్టే ఈ శంకరు.. సమరంలో యమకింకరు
అట్లయితే నువు సూపరు.. స్వర్గాలే మన ప్రాపరు

ముద్దులకే గిరాకే పొద్దుపోయాకే
వద్దు అంటే సిరాకే తెల్లవారాకే...

జిల్లేలమ్మా జిట్టా ..పిల్లా పాలపిట్ట
జిల్లేలమ్మా జిట్టా...నిన్నే తేలై కుట్ట

సిలక సిలక సిలక ఇది సిత్తరాంగి సిలక
పిలగో పిలగ పిలగా పెట్టిపోరా సురక

గిరక గిరక గిరక ఇది సెదబాయి గిరక
ఉరక ఉరక ఉరక సొట్టబుగ్గే కొరక

సైన్మా :: ఇస్మార్ట్ శంకర్ - 2019
దరువుల్ :: మణిశర్మ 
రాతల్ :: కాసర్ల శ్యామ్
గొంతుల్ :: సాకేత్, కీర్తన శర్మ 
గంతుల్ :: శేఖర్ మాస్టర్ 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.