12, ఆగస్టు 2019, సోమవారం

చల్ ఛయ్య ఛయ్య..

హాయిగా రిలాక్స్ అయ్యే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారాలు ఎంత కఠినమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కదా. అలాంటి సోమవారాలు మొదలు పెట్టడానికి మనకో మాంచి హుషారైన పాట తోడుంటే ఆ కిక్కే వేరు అనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఎంచక్కా ఈ పాట వింటూ చూస్తూ స్టెప్పులేసుకుంటూ హుషారుగా మీ రోజు మొదలెట్టేయండి. 

ఈడియో ::



ఆడియో ::


లిరికియో ::

ఎంత అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మాని
ఎంత అలకే కిన్నెరసాని

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికేయ
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా
తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా

తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా
ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా
ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని
ఏనాటికి కనిపించేనయ్యా 
తొలగేన మరీ ఈ మాయ తెరా
తన చెలిమి సిరీ నా కలిమి అనీ
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి
తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి

జాలిపడైనా ఓయ్ అనదే
మర్యాదకైన పరదా విడదే
అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై
నా వైపే వస్తూ ఉన్నదయా

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా
చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా

మదినూయలలూపే సొగసయ్యా
తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా
పరువాల తరంగమే తానయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా
మహరాణి రూపు హరివిల్లయ్యా

ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
ఎంతటి అలకే కిన్నెరసాని
మావని చేరే అల్లరి మానీ
చెప్పరయ్య నా జాణ తోటి
తన జంటపడే దారేదయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(4)

చెలి కిలకిలలే చిటికేయ హోయ్య
చెలి కిలకిలలే చిటికెయ్య
మది చెదిరి కథాకళి చెయ్యా హొయ్యా
మది చెదిరి కథాకళి చెయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(4)

ఓ కన్నియపై చూపున్నదయా
ఎదట పడే చొరవుండదయా
మనసాపలేక మాటాడలేక
ఒక ఖయ్యామై తయ్యారయ్యా

చల్ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా(6)

సైన్మా :: ప్రేమతో - 1998
దరువుల్ :: ఏ.ఆర్.రహ్మాన్ 
రాతల్ :: సిరివెన్నెల 
గొంతుల్ :: ఏ.ఆర్.రహ్మాన్, సౌమ్య రావ్,
డామ్నిక్, కవిత పౌడ్వాల్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.