7, సెప్టెంబర్ 2020, సోమవారం

ఓణీ వేసుకున్న పూలతీగ...

కంటైనర్ ట్రాలర్ మీద అదీ రోడ్ పై వెళ్తూ ఉండగా అంతమంది గ్రూప్ డాన్సర్స్ తో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో స్టెప్పులతో పాట తీయడం అసలు ఎంత క్రేజీ ఆలోచనో కదా. అలాంటి క్రేజీ ఆలోచనకి పాట రాసే అవకాశం రామజోగయ్య శాస్త్రి గారికి వచ్చింది. పైగా అదే తన మొదటి పాట, గురువుగారు సిరివెన్నెల గారు తన ప్రియ శిష్యునికి ఓం రాసిచ్చినట్లుగా ఓ మాంచి పల్లవి రాసిచ్చారు. ఇంక తిరుగేముంది రాంజో కలం కదం తొక్కింది ఈ అందమైన పాటని మన ముందుంచింది. బొత్తాలు చిన్న మొత్తాల పొదుపు లాంటి రైమింగ్ పదాలతో కవ్వించి నవ్వించేశారు రాంజో. 

జెస్సీ గిఫ్ట్స్ కంపోజ్ చేసి పాడిన ఈ పాట ట్యూన్ కి, చిత్రీకరణకి, లిరిక్స్ కి కూడా నేను ఫ్యాన్ ని. బిగ్ బాస్ సీజన్ టూ చూసిన వాళ్ళకి అమిత్ తివారి తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయ్ పేరు కౌశ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. ఇక ఈ పాటలో ఉన్న గ్రూప్ డాన్సర్స్ లో ఇప్పటి ఫేమస్ డాన్స్ మాస్టర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా కనిపిస్తారు. మరి ఆలశ్యమెందుకు చూసి ఆనందించండి.

ఈడియో :: 


28, జనవరి 2020, మంగళవారం

జాతరో జాతరో...

గోపీ సుందర్ మెలోడీస్ ఎంత బావుంటాయో మాస్/ఐటం సాంగ్స్ కూడా అంతే బావుంటాయ్. ఈ మధ్యే వచ్చిన ఈ హుషారైన పాట విని మీరూ ఎంజాయ్ చేయండి. 

ఈడియో ::


25, జనవరి 2020, శనివారం

గంప నెత్తినెట్టుకోని...

మాల్గాడిశుభ పాడిన "చిక్ పక్ చిక్ భం" ఆల్బమ్ సూపర్ హిట్ అయిన రోజుల్లోదనుకుంటాను ఈ పాట. ఆ ఆల్బమ్ పాటలు రాసిన సాహితే ఈ పాట రాసింది కూడా. సెన్సార్ దాటిన వీడియోలో లిరిక్స్ కాస్త పర్లేదు కానీ ఆడియో లోవి మాత్రం స్ట్రిక్ట్లీ పెద్దలకు మాత్రమే. పాట ట్యూన్ అండ్ బీట్ మాత్రం మంచి హుషారుగా ఉంటుంది. 

ఈడియో :: 


12, ఆగస్టు 2019, సోమవారం

చల్ ఛయ్య ఛయ్య..

హాయిగా రిలాక్స్ అయ్యే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారాలు ఎంత కఠినమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కదా. అలాంటి సోమవారాలు మొదలు పెట్టడానికి మనకో మాంచి హుషారైన పాట తోడుంటే ఆ కిక్కే వేరు అనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఎంచక్కా ఈ పాట వింటూ చూస్తూ స్టెప్పులేసుకుంటూ హుషారుగా మీ రోజు మొదలెట్టేయండి. 

ఈడియో ::