5, మార్చి 2021, శుక్రవారం

పైన పటారం...

ప్రోమోలో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు చూసి ఐటమ్ సాంగ్ అనుకున్నా కానీ ఈ పాట లిరిక్స్ విన్నాక అనసూయ అన్నట్లు ఇది ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే. మరి ఈ పాట విశేషమేంటో ఈ వీకెండ్ మీరే చూసి తేల్చుకోండి.

ఈడియో ::


ఆడియో :: 


లిరికియో ::

పుట్టు వేళా తల్లికీ నువ్వు పురిటి నొప్పివైతివీ 
గిట్టు వేళా ఆలికేమో మనసు నొప్పి వైతివా 
గిట్టు వేళా ఆలికేమో మనసు నొప్పి వైతివా 

బట్ట మరక పడితే నువ్వు కొత్త బట్టలంటివీ 
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా 
ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కడితివా

ఎట్టాగున్నవయ్యో పీటరన్నయ్యో 
నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో 
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు 
స్వచ్చమంటి నిన్నే సామి కోరినాడయ్యా 
 
పైన పటారం ఈడ లోన లొటారం 
ఇనుబాసూ సెబుతానీ లోకమెవ్వారం 
ఇనుబాసూ సెబుతానీ లోకమెవ్వారం 
పైకి బంగారం లోన గూడు పుటారం 
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
 
మనుషులు మాయగాళ్లు మచ్చలున్న కేటుగాళ్లు 
కానీ ఎవరికాళ్ళు మనుసులున్న గ్రేటుగాళ్లు 
నాది నాది అన్న స్వార్ధమున్న సెడ్డవాళ్లు 
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు 
నా కాడ వందుంటే నా ఎంటే తిరిగేటోళ్లు 
నీ కాడ వెయ్యుంటే నా పైనే మొరుగుతారు 
సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్లు 
నీ కాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు 

లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా 
అది తవ్వి చూడడానికె ఈ జీవితమయ్యా 
తవ్వే కొద్దీ వస్తుంటారు నిండా ముంచి పోతుంటారు 
నీతో నాతొ ఉండే సగం దొంగోళ్లేనయ్యా
 
వి ఆర్ వెరీ హ్యాపీ బాసు 
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు 
అరె వి ఆర్ వెరీ హ్యాపీ బాసు 
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
 
హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇనుబాసూ సెబుతానీ లోకమెవ్వారం 
పైకి బంగారం లోన గూడు పుటారం 
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

కారు బంగ్లాలు వేలికున్న ఉంగరాలు 
ఏవీ రావంటా సచ్చినాక మనవెంట 
నీతో ఉన్నవాళ్లు నిన్ను మోసి కన్నవాళ్ళు 
వెళిపోతారంతా వెలిగినాక చితి మంట 
మట్టి మీద నువు కలిసిన బంధాలన్నీ అబద్దం 
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే చివరి ప్రపంచం 

మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా 
అందుకనే చెబుతున్న వినరాదయ్యా 
బాధే లేని బెంగే లేని రేపేంటన్నా చింతే లేని 
చోటేదైనా ఉన్నాదంటే స్మశానమే రా అందుకే 
వి ఆర్ వెరీ హ్యాపీ బాసు 
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే పైన పటారం ఈడ లోన లొటారం
ఇనుబాసూ సెబుతానీ లోకమెవ్వారం 
పైకి బంగారం లోన గూడు పుటారం 
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికి సూడు తెలిసిపోద్ది అసలు బండారం

సైన్మా :: చావుకబురు చల్లగా - 2021
మోతల్ :: జేక్స్ బిజోయ్ 
రాతల్ :: సానారె
గొంతుల్ :: మంగ్లి, సాకేత్ కొమ్మండూరి  
గెంతుల్ :: జానీ మాస్టర్ 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.