25, జనవరి 2020, శనివారం

గంప నెత్తినెట్టుకోని...

మాల్గాడిశుభ పాడిన "చిక్ పక్ చిక్ భం" ఆల్బమ్ సూపర్ హిట్ అయిన రోజుల్లోదనుకుంటాను ఈ పాట. ఆ ఆల్బమ్ పాటలు రాసిన సాహితే ఈ పాట రాసింది కూడా. సెన్సార్ దాటిన వీడియోలో లిరిక్స్ కాస్త పర్లేదు కానీ ఆడియో లోవి మాత్రం స్ట్రిక్ట్లీ పెద్దలకు మాత్రమే. పాట ట్యూన్ అండ్ బీట్ మాత్రం మంచి హుషారుగా ఉంటుంది. 

ఈడియో :: 


12, ఆగస్టు 2019, సోమవారం

చల్ ఛయ్య ఛయ్య..

హాయిగా రిలాక్స్ అయ్యే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారాలు ఎంత కఠినమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కదా. అలాంటి సోమవారాలు మొదలు పెట్టడానికి మనకో మాంచి హుషారైన పాట తోడుంటే ఆ కిక్కే వేరు అనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఎంచక్కా ఈ పాట వింటూ చూస్తూ స్టెప్పులేసుకుంటూ హుషారుగా మీ రోజు మొదలెట్టేయండి. 

ఈడియో ::


7, ఆగస్టు 2019, బుధవారం

మావిడి తోపుల్లోనా (ఓలమ్మో ఓర్నాయనో)

ఒకప్పటి ఐటం సాంగ్స్ కూడా ఎంత మర్యాదగా రాసేవారో తెలుసుకోవాలంటే ఈ పాటే ఒక మంచి ఉదాహరణ. జీవితం సినిమా కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినారే గారి రచనను విని దరువు వేయని వారుండరనడం అతిశయోక్తి కాదేమో. ఈ పాట వీడియో ఎక్కడైన దొరికితె కామెంట్స్ లో చెప్పగలరు.

ఆడియో ఇన్ ఈడియో ::


17, ఫిబ్రవరి 2019, ఆదివారం

వంగతోట మలుపు కాడ..

దేవీశ్రీప్రసాద్ తన కెరీర్ తొలి రోజుల్లో కంపోజ్ చేసిన ఒక మస్త్ బీట్ సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఈ వీకెండ్ ముగించేసేయండి. 

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

వంగతోట మలుపూ కాడా... 
కొంగు బట్టీ లాగాడే...
సందు చూసీ సైగే చేసీ 
గోల చేశాడే హే... హే... హే...

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే 
సందు చూసి సైగే చేసి గోల చేశాడే 

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే 
సందు చూసి సైగే చేసి గోల చేశాడే 
చూట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే...

హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో
హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో.. హోయ్.. 

హేయ్...
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే

హే... వచ్చినీడు వచ్చినట్లే 
అరే గిచ్చిగిచ్చి చంపుతుంటే..
కుచ్చిళ్ళ లంకలో పొత్తిళ్ల వంకతో 
ఒళ్ళంత నొక్కినాడే... 

పచ్చి పచ్చి సిగ్గులెన్నో 
చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మా మూతికీ బుగ్గమ్మా బంతికి 
ముద్దెట్టి పోయేనాడే 

హే.అయ్య బాబోయ్ ఎక్కడోడే 
సక్కనోడే గాని తిక్కలోడు 
గోడెక్కి వస్తడు గోరు ముద్దులిస్తడు
గోపాలుడంటి వాడు గోల కృష్ణుడు 

వంగతోట ...వంగతోట... హే
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే... ఏ...

వంగాతోట... వంగా... వంగాతోట

హే... గోంగూర చేనికాడా 
లంగోటిగాడు కంగారు పెట్టినాడే 
వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా
వాటెయ్య వచ్చినాడే

గోంగూర సంత కాడా శృంగారపొడు 
మింగేట్టు చూసినాడే తూచేది తూచగా 
తుచాలు తప్పకా దోచేసి పోయ్యినాడే
అయ్య బాబోయ్ పిల్లగాడే 
గంప దించి నా కొంప ముంచినాడు
మ్యాట్నీకి రమ్మనీ నడిరేతిరాటనీ 
దీపాలు పెట్టగానే ఏసుకుంటడూ

వంగతోట... వంగతోట...హే... 
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే..
చూట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే...

హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో
హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో.. హోయ్.. 

సైన్మా :: అభి (2004)
గొంతుల్ :: మాలతీ
రాతల్ :: వేటూరి సుందరరామూర్తి
మోతల్ :: దేవి శ్రీ ప్రసాద్