20, ఏప్రిల్ 2021, మంగళవారం

రాంసక్కనోడివిరా పిలగో...

రఘు కుంచె స్వరపరచి పాడి నటించిన ఈ హుషారైన స్పెషల్ సాంగ్ మీకోసం. లేడీ వాయిస్ మంగ్లీ పాడిందిలెండి రఘు పాడిన ఐటమ్ సాంగ్ ఏంటీ అని అలా క్లోజ్ చేసేయకండి :-)

ఈడియో ::


ఆడియో :: 


లిరికియో ::

Mangli- 
రాంసక్కనోడివిరో పిలగో 
రయ్ అంటూ నువ్ దూకితే 
మరి ఎలగో 
రాంసక్కనోడివిరో పిలగో 
రయ్ అంటూ నువ్ దూకితే 
మరి ఎలగో 
ఎనకెనకే పడతావు 
ఎగాదిగా సూత్తావు 
డీజేలు పెడతావు 
డిస్కోలు ఆడేవు 
కత ఏంటీ నీ కథ ఏంటీ 
కారేడ్డము ఆడమాకు పిలగో 
నా కంట్లో నలుసవ్వమాకు పిలగో
రాంసక్కనోడివిరో పిలగో 
రయ్ అంటూ నువ్ దూకితే 
మరి ఎలగో 

Mangli - 
గంపెడు పూలట్టుకొని 
కొప్పులెడతనంటావు 
గుప్పెడంత గుండెలోన
కుంపటెట్టి పోతావు 

Raghu -   
గులు గులు గులాబ్జామ్ 
గుడి ఎనక్కే చెక్కేద్దామా 

Mangli-   
జానాబెత్తెడు నడుము 
షానా బాగుందని 
మెల్లకుండ గిల్లిపోయి 
నన్నేమో పరేషానుజేత్తావు

Raghu-   
జింగిరి బింగిరి జంబలహాట్టు 
రంగులరాట్నం ఎక్కేద్దామా 

Mangli -  
దిగజూసి ఎగజూసి 
సిర్రెత్తుకొత్తుంటే  
సీటీలే కోట్టేత్తావూ 
తెగ ఆశపెట్టేసి నావైపే రాకుండా 
ఎవైపో ఎల్పోతావు 
కత ఏంటి నీ కత ఏంటి 
అసలు కత ఏంటి

ఎడమ కన్ను అదిరింది పిలగో 
నా ఎన్ను పూస కరిగింది పిలగో 
ఎహె రాంసక్కనోడివిరో పిలగో 
రయ్ అంటూ నువ్ దూకితే 
మరి ఎలగో  

పాపిట బిళ్ళట్టుకొని ఎగాదిగా జూత్తావు 
పాయసాల పిట్టవని పగలబడి నవ్వేవు 

Raghu -  
రింగుడుబిళ్ల రూపాయిబిళ్ళ 
దండ కాదు తామర మొగ్గ 

Mangli -  
చెక్కెర కేళీ పండు చెక్కిలిపై 
రుద్దేస్తూ చిటికేసి చటుక్కున  
చతికిలబడిపోతావు

Raghu - 
తింగరి బుచ్చి మాయలమచ్చి 
కోతికొమ్మచ్చాడేద్దామా 

Mangli -  
గరంగరం నరం నరం 
మెలిపెట్టి తిప్పేసి 
హడావిడే సేసేత్తావూ 
చల్లకొచ్చి ముంత దాచి 
నన్ను నువ్వు ఏలాగోలా 
సుర్ర సురా సుట్టెత్తావూ  
కథ ఏంటి అసలు కథ ఏంటి 
నీ కతేందిరా 
లడాయికి వచ్చినావ పీలగో
మరి లగ్గమైతదీ చూస్కో పిలగో

రాంసక్కనోడివిరో పిలగో 
రయ్ అంటూ నువ్ దూకితే 
మరి ఎలగో 

Raghu -   
రింగుడుబిళ్ల 
రూపాయిదండ 
జింగిరి బింగిరి 
మాయల మచ్చే 

సైన్మా :: కొశ్చన్ మార్క్ - 2021
మోతల్ :: రఘు కుంచె 
రాతల్ :: బండి సత్యం 
గొంతుల్ :: మంగ్లి, రఘుకుంచె, అదితి భావరాజు  
గెంతుల్ :: శేఖర్ మాస్టర్  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.