4, అక్టోబర్ 2017, బుధవారం

ముద్దుల ముత్యామే వాడు..

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ మొదటి సారి ఒక ఐటమ్ సాంగ్ చేస్తుందంటే మరి ఈ మాత్రం ఉండాలి కదా.. రాశి నిండుగా చీరకట్టుకుని కూడా కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించ గలిగిందంటే కారణం ప్రీతి గొంతు, లారెన్స్ మాస్టర్ సింపుల్ స్టెప్స్, శశి ప్రీతం ట్యూన్, కృష్ణవంశీ టేకింగ్.. వేటికవే అబ్బా..ఆహా..😉 అబ్బా..ఆహా..😉 అబ్బా..ఆహా..😉 
 
ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఆఅ..ఆఅ...ఆఆ...ఆఆ...
ముద్దుల ముత్యామే వాడు
ముద్దుల రత్నామే వాని
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కందీ పువ్వోలే నవ్వు కత్తి అంచోలే చూపు
కరకు రాళ్ళంటి కండరాలు ఉన్నోడే
ఊఊ...ఊఊఊ...ఊఊ..ఊఊఊఊ..
చెట్టులేకుండా పూచే పువ్వుల గుత్తుల
వళ్లు మొత్తం నేనొద్దంటున్న హత్తుకున్నాడే

అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...

మ్.మ్..మ్...మ్మ్మ్...మ్..మ్మ్..మ్..

కుడిచేతిమీద కొరికేసి గడియారమంటడ్
కోసచెవులు కొరికి వాడు నీకు దుద్దుల్ పెడ్తినంటడ్
ఆ మంచూ ముక్క తెచ్చి నొక్కిపట్టి
వాడు ముక్కూ పుడక అంటడ్
అరె బొడ్డు మీదుగా నడుంచుట్టి గిల్లి
వడ్డాణమంటడమ్మో...
ఊఊఊ..ఊఊ..మ్మ్..మ్మ్...మ్...మ్...

ముద్దుల ముత్యామేవాడు
ముద్దుల రత్నామేవాని
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
కన్నే పువ్వోలే నవ్వు కత్తి అంచోలే చూపు
కరకు రాళ్ళంటి కండరాలు ఉన్నోడే

మరియాదగానే మొదలేమో మంచం వేయమంటడ్
కనికట్టు ఏదొచేసీ మాట పెగలకుండ చేస్తడ్
ఇంక పిక్కా మీద వున్న పుట్టుమచ్చలెన్నో
లెక్కా పెడ్తు వుంటడ్
సిరి మల్లెమొగ్గ వంటి ఒళ్ళే అలిసెనని
కాళ్ళు పడ్తడమ్మో...
ఊఊఊ..ఊఊ..మ్మ్..మ్మ్...మ్...మ్...

ముద్దుల ముత్యామే వాడు
ముద్దుల రత్నామే వాని
ముద్దుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే
చెట్టులేకుండా పూచే పువ్వుల గుత్తుల
వళ్లు మొత్తం నేనొద్దంటున్న హత్తుకున్నాడే

అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా... ఆహా... అబ్బా... ఆహా...
అబ్బా...

సైన్మ :: సముద్రం (1999)
మోతల్ :: శశిప్రీతమ్
రాతల్ :: సుద్దాల అశోక్ తేజ
గొంతుల్ :: ప్రీతి(ముంబై)

1, అక్టోబర్ 2017, ఆదివారం

గుడివాడ ఎళ్ళాను..

అడియో ::


ఈడియో ::


లిరికియో ::

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను

కమ్మని పాట చక్కని ఆట
కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా.. కొందరు నన్ను
పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు
నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైబడతారు
దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుత్తూరు ఎన్నెన్నో చూసాను

బందరులోనా అందరిలోనా
రంభవె అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాగు బాబు చేసాడు డాబు
రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె
తిరపతి లోనా పరపతి పోయే
అందరి మెప్పు పొందాలంటె
దేవుడికైన తరం కాదు.. యముండా..
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎళ్ళాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను
యాడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

సైన్మా :: యమగోల -- 1977
మోతల్ :: చక్రవర్తి
రాతల్ :: వేటూరి
గొంతుల్ :: సుశీల

27, సెప్టెంబర్ 2017, బుధవారం

సైసైసయ్యారే - ఈటీవి బ్రేకింగ్ ఆల్ బారియర్స్

ఈ వీక్ అంటే నిన్న మంగళవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చూశారా లేకపోతే ఇక్కడ చూడండి. జగదేక వీరుడు అతిలోక సుందరి నుండి "యమహో నీ యమ" , సాహస వీరుడు సాగరకన్య నుండి "మీనా మీనా" , అల్లరి మొగుడు చిత్రం నుండి "నీలిమబ్బు నురగలో" పాటలకు సంబంధించిన విశేషాలు వివరించారు. అండ్ ఈ చివరి పాటకు స్టేజ్ పై చేసిన పెర్ఫార్మెన్స్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంది. స్టేజ్ పైనే ఆర్టిస్టులని నీళ్ళలో తడిపేసి ఏ వానపాటకూ తీసిపోని విధంగా చిత్రీకరించేశారు. అది చూశాక ఈటీవీ బ్రేకింగ్ ఆల్ బారియర్స్ అనిపించి షేర్ చేస్తున్నా..

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

ఎంతసేపైన ఎదురు చూపేన..

ప్రస్తుతం మాములు పాటలు కూడా ఐటమ్ సాంగ్స్ లెవల్ లో తీస్తున్న రామ్ గోపాల్ వర్మ వచ్చిన కొత్తలో నైంటీస్ లో తీసిన ఓ మెలోడియస్ ఐటమ్ సాంగ్ తో మీ ఆదివారాన్ని ఆనందంగా ప్రారంభించండి. 

ఆడియో ::


ఈడియో :: 


లిరికియో ::

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

పపర పాపపౌ పపర పాపాపా
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  

ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా హా 
అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వేయిమందున్నా ఓహో 
ఒక్కదాన్నే వేగి పోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఏలుకోడేవె నా రాజు చప్పునా హ హా

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జూజూజూ.. ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

హా తోడులేని ఆడవాళ్ళంటే లాల.. 
కోడేగాళ్ళ చూడలేరంతే 
లాలాల లాల లాల లాలాల 
తోడేళ్ళే తరుముతూ ఉంటే 
తప్పు కోను త్రోవలేకుందే
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదీ
ఏవి లాభం గాలితో చెప్పుకుంటే

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

సైన్మా :: అంతం - 1992
మోతల్ :: ఆర్.డి.బర్మన్ 
రాతల్ :: సిరివెన్నెల 
గొంతుల్ :: చిత్ర 

20, సెప్టెంబర్ 2017, బుధవారం

ఎంతటి రసికుడవో తెలిసెరా...

మహా మహా బాపు గారికీ తప్పలేదు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం కానీ ఆయనంతటి వారు తీశారంటే ఆషామాషీగా అందరిలా ఉండకూడదు కదా... మరి ఎలా ఉంటుందంటారా... ఇదిగో ఇలా ఉంటుంది. విని చూసి ఆనందించండి. 

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీవెంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 

నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా

గుత్తపు రవిక వోయమ్మో..ఓ.. 
చెమట చిత్తడిలో తడిసి ఉండగా..ఆ..ఆ..ఆ..ఆ 
గుత్తపు రవిక వోయమ్మో..ఓ.. 
చెమట చిత్తడిలో తడిసి ఉండగా.. 
ఎంతసేపు... నీ తుంటరి చూపు 
ఎంతసేపు... నీ తుంటరి చూపు 
ఎంతసే...పు... నీ తుంటరి చూపు 
అంతలోనే తిరగాడుచుండగా.. 

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా

మోము మోమున ఆనించి.. 
ఏవో ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..ఆ 
మోము మోమున ఆనించి.. 
ఏవో ముద్దు ముచ్చుటలా..డ..బోవగా..ఆ..ఆ..అ 
మోము మోమున ఆనించి.. 
ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..అ 
గ్రక్కున కౌగిట చిక్కబట్టి 
గ్రక్కున కౌగిట చిక్కబటి 
నా..ఆ..ఆ చెక్కిలి మునిపంట నొక్కుచుండగా..ఆ 

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా..ఆ. 
తెలిసెరా..తెలిసెరా..తెలిసెరా..రా..ఆ..ఆ

సైన్మా :: ముత్యాలముగ్గు - 1975 
రాతల్ :: డా॥సి.నారాయణరెడ్డి
మోతల్ :: కె.వి.మహదేవన్
గొంతుల్ :: పి.సుశీల