2010స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2010స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఆగస్టు 2017, బుధవారం

ఈటీవీ - సై సై సయ్యారే...

ఒకప్పుడు "అంతరంగాలూ అనంత మానస చదరంగాలూ", "ఓ కళంకిత కళలకే అంకితా" అంటూ వ్యధాభరిత సీరియల్స్ కు కుటుంబకథా చిత్రాలకూ, టెలీఫిల్మ్స్ కు ప్రాముఖ్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమయేది ఈటీవీ. అయితే నాలుగేళ్ళ క్రితం జూలు విదిల్చి మారుతున్న అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ’జబర్దస్త్’ లాంటి ప్రోగ్రాములతో యువతని, ముఖ్యంగా మాస్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో విజయం సాధించి తామూ ఎందులోనూ తక్కువ కామని నిరూపించింది.
  
అంతే కాదు సాధారణంగా సభల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ మాట్లాడని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఒప్పించి మొదటిసారిగా "సౌందర్యలహరి" పేరిట ఆయన సినిమాల గురించిన కబుర్లను ఆయనతోనే చెప్పిస్తూ ఒక టెలివిజన్ సిరీస్ ని విజయవంతంగా నడిపింది. ఇపుడు అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి, రాఘవేంద్రరావు గారి చిత్రాల్లోని పాటలను ఇప్పటి కొరియోగ్రాఫర్స్ కి ఇస్తే ఎలా కంపోజ్ చేస్తారో పరీక్ష పెడుతూ ఒక సరికొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. అదే ’సైసైసయ్యారే’ అనే ప్రోగ్రామ్. 

రాఘవేంద్రరావు గారంటేనే సెన్సువాలిటీకి పెట్టిందిపేరు మరి ఆయన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఇందులోనివి ఐటం సాంగ్స్ కాకపోయినా కూడా ఈ బ్లాగ్ చూసే ఇంట్రస్ట్ ఉన్న రసికులకు ఖచ్చితంగా నచ్చుతుందనిపించి ఈ మొదటి ఎపిసోడ్ షేర్ చేస్తున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ అతిథిగా వచ్చిన దీనిలో "కూలీ నంబర్ వన్" చిత్రం లోని ’కలయా నిజమా’, "ముగ్గురు మొనగాళ్ళు" చిత్రం లోని ’రాజశేఖరా’, "బొంబాయి ప్రియుడు" చిత్రంలోని ’రాజ్ కపూరు సినిమాలోని’ పాటల ఒరిజినల్ చూపించి, ఆపై డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించారు. ఆసక్తి ఉన్న వారు చూసి ఎంజాయ్ చేయండి.

’ఈటీవీ’లో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముఫ్ఫై నిముషాలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.  

31, జులై 2016, ఆదివారం

మనోహరీ..మనోహరీ..

బాహుబలి సినిమా లోని ఈ పాట నా ఫేవరెట్స్ లో ఒకటి ఐటమ్ సాంగ్ ఐనా కూడా చైతన్యప్రసాద్ కమ్మటి తెలుగు పదాలతో చాలా అందంగా రాశారు. పూర్తిగా ఊహా ప్రపంచంలో విశృంఖలతకు అవకాశమున్నా రాజమౌళి కాస్ట్యూమ్స్ మొదలు చిత్రీకరణ వరకూ చాలా హుందాగా తెరకెక్కించాడు.

ఆడియో ::
http://mio.to/album/M.M.+Keeravaani,+Mounima/Baahubali+-+The+Beginning+(2015)

ఈడియో ::

లిరికియో ::

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తీయ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్ రా చేయ్ రా
మనోహరీ... మనోహరీ...

తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్ నా
నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా
నీ కండల కొండలపై నాకైదండలు వేసెయ్ నా
నా పయ్యెద సంపదలే ఇక నీ శయ్యగ చేసేయ్ నా
సుఖించగా రా...
మనోహరీ మనోహరీ

పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

సైన్మా :: బాహుబలి -- 2015
దరువుల్ :: ఎమ్ ఎమ్ కీరవాణి
రాతల్ :: చైతన్య ప్రసాద్
గొంతుల్ :: మోహన భోగరాజు, రేవంత్

12, జులై 2016, మంగళవారం

సినిమా సూపిత్త మామా..

రేసుగుర్రం సినిమాలో మాంచి సూపర్ హిట్ అయిన మాస్ పాట... వినేసి ఒక విజిలేస్కోండి..  

ఆడియో : 

http://naasongs.com/race-gurram.html

ఈడియో : 


మామా నువు గిట్ల గాబర గీబర
గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే…
నీకు నాకన్న మంచి అల్లుడు
దునియా మొత్తం యాడ తిరిగినా దొరకడే…

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా..

గల్ల పట్టి గుంజుతాంది దీని సూపే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..
హేయ్ డప్పుగొట్టి పిలువబట్టె ఈని తీరే..
నిప్పులెక్క కాల్చబట్టె ఈని పోరే..
కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే..

హేయ్ మామ దీన్ని సూడకుంటె
మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే..
అయ్య ఈని సూడగానె పొయ్యి
మీది పాల లెక్క దిల్ పొంగబట్టే
దీని బుంగ మూతి సూత్తె నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టే..

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా.. మామా

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా..
గల్ల పట్టి గుంజుతాంది దీని సూపే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..

ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో

మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే..
లవ్వు దర్వాజ నాకు తెరుసుకున్నదే..
ఓరయ్య గీ పొరగాడు నచ్చినంకనే..
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే..
పట్టు పట్టేసెనే.. కుట్టేసెనే..
పాగల్ గాడ్ని సేసెనే..

సుట్టూత బొంగరంల తిప్పబట్టెనే..
సిటారు కొమ్మ మీద కూకబెట్టెనే..
మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే..
సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టెనే..
దీని బుంగ మూతి సూత్తె నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టే..

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా.. మామా
సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా..
ఆ.. మామా.. ఆ.. మామా..

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా.. పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా.. పుంగి బజానా

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా.. పుంగి బజానా..

మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా

సైన్మ : రేసుగుర్రం - 2014
దరువు : ఎస్.ఎస్.తమన్
రాతలు : వరికుప్పల యాదగిరి
గొంతులు : సింహ, దివ్య, గంగ