3, నవంబర్ 2018, శనివారం

ఈ మూడు మూరలున్న..

వీకెండ్ ఓ స్టైలిష్ సాంగ్ తో మొదలు పెట్టేయండి...

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఆనాటి దేవదాసు
నాకు పెద్ద ఫ్యాను బాసూ
మజ్నూలు ఎంత మందో
లెక్క లేనే లేరు దాసు
నా ఒంటి వాస్తు చూస్తే
పలుకుతుంది పెద్ద కాసు
ఈ ఊరి పోరగాళ్ళు
తడుముతారు ప్రతీ ప్లేసూ

నా మీద పడకురా నే కన్నె సరకురా
నువ్వు అట్టా ఇట్టా చేస్తే కొంపే కొల్లేరు లేరా
కళ్లార చూసుకో సెంటేదో రాసుకో
కల్లోకె వస్తె నేను ముద్దే చేసుకోరా

ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి ఓ స్సారి
మీరిట్ట చుట్టుముడితే అందమంతా కరిగిపోద్ది
కొవ్వొత్తి వెలుగు మాదిరీ స్సారీ
తాకట్టు పెట్టుకోరా నన్నిట్టా పట్టుకోరా
గిరాకీ ఉన్న సరుకు నేనేరా

ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి

పుణ్యానికొచ్చినట్టు
బెల్లాన్ని కొరికినట్టు పట్టారు ఓ పట్టు
ఆమ్మో ఆమ్మో ఓలమ్మో

ఆ సిల్కు చెల్లి నువ్వు
ముద్దొచ్చే బుల్లి నువ్వు
ఆ తేనె పట్టుకన్న తీపి తీపి పిల్ల నువ్వు

ఆ తొందరేల ఈ సంధ్యవేళ
ఛీ ఛీ ఛీ పాడు ఈ గోల

ఇచ్చాను అణాకాని
చదివాను జాతకాన్ని
పెట్టించు దాచుకున్న
పరువాలు ఉన్నవన్నీ

నా మీద పడకురా
నే కన్నె సరకురా
నువ్వు అట్టా ఇట్టా చేస్తే
కొంపే కొల్లేరు లేరా

నా వల్ల కాదులే ఎట్టాగో ఉందిలే
గులాబీ పూలకొట్టే ఒళ్లోకొచ్చినట్టే

ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి ఓ స్సారి
మీరిట్ట చుట్టుముడితే అందమంతా కరిగిపోద్ది
కొవ్వొత్తి వెలుగు మాదిరీ స్సారీ

తాకట్టు పెట్టుకోరా నన్నిట్ట పట్టుకోరా
గిరాకీ ఉన్న సరుకు నేనేరా
ఈ మూడు మూరలున్న చీర కట్టు జారిపోద్ది
బిగించి పట్టుకోండి

సైన్మ :: దోచెయ్ - 2015
దరువుల్ :: సన్నీ ఎం.ఆర్
రాతల్ :: కృష్ణ చైతన్య
గొంతుల్ :: షల్మలి ఖొల్గడే, సన్నీ

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.