18, నవంబర్ 2018, ఆదివారం

మబ్బే మసకేసిందిలే..

ఓ వ్యాసంలో ఖదీర్ గారు చెప్పినట్లు ఇది రాత్రి పాట, కోరిక పాట, తాపం పాట, నిప్పు రగిల్చే పాట, అప్పట్లో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన పాట. బాలుగారు ఆటాడుకున్నట్లుగా పాడిన పాట. మీ వీకెండ్ ని ఈ పాటతో ముగించండి. 

ఆడియో :: 


ఈడియో ::  


లిరికియో :: 

హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ అంత సిగ్గా

మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే

కురిసే సన్నని వాన సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వాన సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా 
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూలమంచం
వెచ్చగ వుందామూ మనమూ

హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగ ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే

పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించువేళా
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ మనదీ

హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే

నవ్వని పువ్వే నువ్వు 
నునువెచ్చని తేనెలు ఇవ్వు 
దాగదు మనసే ఆగదు వయసే 
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు 
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు 
ఇద్దరమొకటవనీ కానీ 

హే బుగ్గమీదా మొగ్గలన్నీ దూసుకోనీ 
రాతిరంతా జాగారమే చేసుకోనీ 
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే 
మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే

సైన్మ :: వయసు పిలిచింది -- 1978
రాతల్ :: వేటూరి
మోతల్ :: ఇళయరాజా
గొంతుల్ :: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.