వేటూరి గారు రాసిన ఈ పాట లిరిక్స్ శ్రద్దగా వింటే ఇది ఐటమ్ సాంగ్ గా కన్నా కూడా కామెడీ సాంగ్ గా అనుకోవచ్చేమో అనిపిస్తుంటుంది. జయమాలిని డ్రస్ కూడా ఈ కాలం హీరోయిన్ల డ్రస్ కన్నా నయమే అనచ్చు..
ఆడియో ::
ఈడియో ::
లిరికియో ::
పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా నాసామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా నాసామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓరాణి
కట్టు కధలు చెప్పమాకులే
పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ
హా గడపదాటిననాడె కడప చేరాను
తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను..
వడ్డించుకుంటాను
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో...
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి
ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి
ముద్దుకైనా ముట్టుకోను
ముద్దుకైనా ముట్టుకోను
పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ
గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే అ.
నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అహహ....
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
పుట్టింటోళ్ళు తరిమేసారు
హ.కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
సైన్మా :: వేటగాడు - 1979
దరువుల్ :: చక్రవర్తి
రాతల్ :: వేటూరి సుందర రామమూర్తి
గొంతుల్ :: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల