ఈ సంక్రాంతికి విడుదలైన మరో సినిమా రెడ్ లోని ఈ మస్త్ ఐటమ్ సాంగ్ కి కూడా జానీ మాస్టరే కొరియోగ్రఫీ. ఈయన ఈ పాటల స్పెషలిస్ట్ అయిపోతున్నట్లున్నారు. లవ్లీ హెబ్బాపటేల్ అండ్ ఎనర్జిటిక్ రామ్ లతో మీరూ పాదం కలిపేయండి.
ఈడియో ::
ఆడియో ::
లిరికియో ::
ఎక్కడీ దానవే సక్కని కోమలి
ఒక్కదానివున్నావేందే వస్తవా భీమిలి
గంపెడు ఆశతో దాటినా వాకిలి
మోసం చేస్తే మీ మొగాళ్ళంతా
ఇడిసినా ఫ్యామిలీ
ఆ సెప్పూకుంటే బాధ
అరె తీరీపోద్దే చంచిత
సెట్టంత మావోడున్నాడు
సెట్ చేత్తడూ నీ కథ
ఏడి ఎక్కడున్నాడు
నా కళ్ళకు కన్పించమను
మీ హీరోని.. కూ..సింత
పన్నెండు డబ్బాల ప్యాసెంజరూ బండెక్కి
పదకొండూ గంటలకు పోదాం అన్నడు బొంబాయికి
పది మంది సుస్చారని సాటుగ వచ్చా టేషనుకీ
తొమ్మిదో నెంబర్ మీదికి రైలొచ్చే రొవ్వంతటికి
సల్లాటి ఏసీ బోగిల సూపిచ్చాడే ఒకటికి
హ ఎత్తుటి దుప్పటీ ఏసీ దూరిండమ్మీ మాపటికి
కూ ఛుక్ ఛుక్ కూతలు తప్ప
మోతలు లేవే రాతిరికి
ఇంజిన్ మొత్తం హీటెక్కించి
జంపయ్యిండే పొద్దటికి
అయ్ డించక్ డించక్ డింకా
అడ ఈడ దూకకె జింక
డించక్ డించక్ డింకా
మా బీచికి రావే ఇంకా
అరె డించక్ డించక్ డింకా
తగలెట్టేస్తా నీ లంకా
డించక్ డించక్ డింకా
తీగ లాగితే కదిలె డొంక
గుంజుతుంటే చైను గురునాథం పిలిచే నన్ను
కట్టే చేస్తే సీను చెన్నైలో తేలాను
రంజూగుందే స్టోరీ ఏటయ్యిందే ఈ సారి
కంచిపట్టు శారీ నలిగిందా లేదా జారీ
ఇంగిలీషు సినిమా సూద్దాం ఇంగవా అన్నాడు
ఎంగిలీ ముద్దూలంటే నేర్పిస్తానన్నాడు
రొంబ రొంబ సంతోషమా నాటి నాంచారు
పంబరేగి పోయిందేమో నైటు హుషారు
లుంగీ డాన్సు చేద్దామంటూ పొంగించాడే ఓ బీరు
తొంగున్నాడు గుర్రుపెట్టి మెక్కి ఇడ్లీ సాంబారూఊఊ
అయ్ డించక్ డించక్ డింకా
అడ ఈడ దూకకె జింక
డించక్ డించక్ డింకా
మా బీచికి రావే ఇంకా
అరె డించక్ డించక్ డింకా
తగలెట్టేస్తా నీ లంకా
డించక్ డించక్ డింకా
తీగ లాగితే కదిలె డొంక
తిప్పి సందు సందూ నా వల్లా కాదని చందు
చార్మినారు ముందు తాగించిండే మందు
జాగాలన్నీ చుట్టీ మా వైజాగొచ్చావా చిట్టి
బాగుంటాదే సిట్టీ చూస్తావా చెమటే పట్టీ
లైటు హౌసు లాగ ఉంది బాసు కటౌటూ
రూటు పట్టి రౌండేసొద్దాం పట్నం సూపెట్టూ
చెండూ లాగ మెత్తగా ఉందే పాప నీ ఒళ్ళు
గ్రౌండులో దిగావంటే తిరుగుతాయే కళ్ళు
ఎత్తు పల్లం ఎక్కీదిగీ వచ్చిందయ్యో ఈ రైలు
సత్తా జూసీ ఈన్నే ఉంటా ఇచ్చావంటే సిగ్నళ్ళూ..ఊఊ
అయ్ డించక్ డించక్ డింకా
అడ ఈడ దూకకె జింక
డించక్ డించక్ డింకా
మా బీచికి రావే ఇంకా
అరె డించక్ డించక్ డింకా
తగలెట్టేస్తా నీ లంకా
డించక్ డించక్ డింకా
తీగ లాగితే కదిలె డొంక
సైన్మా :: రెడ్ - 2021
దరువుల్ :: మణిశర్మ
రాతల్ :: కాసర్ల శ్యామ్
గొంతుల్ :: కీర్తన శర్మ, సాకేత్
గెంతుల్ :: జానీ మాస్టర్
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.