22, ఆగస్టు 2016, సోమవారం

సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్..

రాఘవేంద్రరావు గారి సినిమాలలో మాములు పాటలే ఒకరేంజ్ లో ఉంటాయి ఇక ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. కానీ ఈ పాట చిత్రీకరణ కన్నా విశ్వనాథన్ గారు కంపోజ్ చేసిన ట్యూన్ నాకు చాలా ఇష్టం.

ఆడియో ::
http://gaana.com/song/simhabaludu

ఈడియో ::


లిరికియో ::

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..
తళుకు బెళుకు కనవేరా
పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె..
పడుచు గొడవ వినవేరా

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
హా..కన్ను కన్ను గీటుకుంటె సన్న సన్న మంటరేగే..
కలికి చిలుక ఇటు రావే..హాయ్ ...హాయ్...
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె..
వలపు పిలుపు విని పోవే

బానిసగా వచ్చావు.. నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు.. నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు

రేయి తెల్లారి చల్లారి పోతుందీ రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతుందీ రారా సుందరా
ఒకటున్నది నీలో.. ఒడుపున్నది నాలో..
అది వున్నది లేనిది తెలుసుకో..హా
మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో..
అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో.. 

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..
తళుకు బెళుకు కనవేరా
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె..
వలపు పిలుపు విని పోవే

ఈ ద్వీపానికి దీపానివి నువ్వు..
ఈ లంకకే నెలవంకవి నువ్వు హహహ హహ

మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే .. మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది .. వగరుందిలే.. సెగరేగిందిలే
వలపున్నది నాలో .. బలమున్నది నీలో ..
ఆ పట్టుని ఈ విడుపుని.. హా..కోరుకో...
సగమున్నది నాలో.. సగమున్నది నీలో ..
రెంటిని జంటగా మలచుకో..హాయ్

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..
తళుకు బెళుకు కనవేరా
వళ్ళు వళ్ళు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె..
వలపు పిలుపు విని పోవే
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
 
సైన్మా ::  సింహబలుడు - 1978
దరువుల్ ::  ఎం.ఎస్. విశ్వనాథన్
రాతల్ ::  వేటూరి
గొంతుల్ ::  బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి