31, జులై 2016, ఆదివారం

మనోహరీ..మనోహరీ..

బాహుబలి సినిమా లోని ఈ పాట నా ఫేవరెట్స్ లో ఒకటి ఐటమ్ సాంగ్ ఐనా కూడా చైతన్యప్రసాద్ కమ్మటి తెలుగు పదాలతో చాలా అందంగా రాశారు. పూర్తిగా ఊహా ప్రపంచంలో విశృంఖలతకు అవకాశమున్నా రాజమౌళి కాస్ట్యూమ్స్ మొదలు చిత్రీకరణ వరకూ చాలా హుందాగా తెరకెక్కించాడు.

ఆడియో ::
http://mio.to/album/M.M.+Keeravaani,+Mounima/Baahubali+-+The+Beginning+(2015)

ఈడియో ::

లిరికియో ::

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా
తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తియ్ రా తీయ్ రా
ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్ రా చేయ్ రా
మనోహరీ... మనోహరీ...

తేనెలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా
మాటలన్నీ మత్తుగున్నవే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నదే
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

చేప కన్నుల్లోని కైపులు నీకిచ్చెయ్ నా
నాటు కొడవల్లాంటి నడుమె దాసి ఇచ్చెయ్ నా
నీ కండల కొండలపై నాకైదండలు వేసెయ్ నా
నా పయ్యెద సంపదలే ఇక నీ శయ్యగ చేసేయ్ నా
సుఖించగా రా...
మనోహరీ మనోహరీ

పువ్వులన్నీ చుట్టుముట్టి తేనె జల్లుతుంటే
కొట్టుకుంది గుండె తుమ్మెదై
ఒళ్లంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా
కొరుక్కుపో నీ తనివితీరా తీరా

సైన్మా :: బాహుబలి -- 2015
దరువుల్ :: ఎమ్ ఎమ్ కీరవాణి
రాతల్ :: చైతన్య ప్రసాద్
గొంతుల్ :: మోహన భోగరాజు, రేవంత్