సుచిత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సుచిత్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మాహిష్మతి లో సక్కుబాయ్ చాయ్..

ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకి ప్రసారమయ్యే ఢీ-10 లో ఢమరుకంలోని "వెల్కంటూ సక్కుబాయ్" పాటను బాహుబలి డైలాగ్స్ తో మిక్స్ చేసి వెరైటీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ పాట ఒరిజినల్ వీడియోతో పాటు అది కూడా చూసి ఎంజాయ్ చేయండి.

ఆడియో ::


ఢీ-10 వీడియో మాహిష్మతిలో సక్కుబాయ్ ::


లిరికియో ::

హే సక్కుబాయ్ జర దేదోనా గరంగరం చాయ్
హే సక్కుబాయ్ నువ్ చాయిస్తే ఆదోరకం హాయ్

చాయ్.. చాయ్.. చచచాయ్..
హే.. ఏస్కో నా ఘుమా ఘుమా చాయ్
యమ ఫేమస్సిది ఢిల్లీటూ దుబాయ్
హే.. తీస్కో నా సలసల చాయ్
భలే మోగిస్తది నరాల్లో సన్నాయ్
గుండె గుయ్యంటే అల్లం చాయ్
సుయ్యంటే బెల్లం చాయ్
కెవ్వంటే కరక్కాయ్ చాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్
సలవైతే కారా చాయ్
ముసుగెడితే ములక్కాడ చాయ్
నా బంగారు చేతుల్తో పింగాణి సాసర్లో
నీకోసం తెస్తానబ్బాయ్

వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్
వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్

హే సక్కుబాయ్ జర దేదోనా గరంగరం చాయ్
హే సక్కుబాయ్ నువ్ చాయిస్తే ఆదోరకం హాయ్

సొ.సొ.సొగసాకు తీసీ.. కాచా డికాషన్..
పరువాల మిల్కూ పెదవుల్లో షుగరూ
పక్కాగా కలిపేసి పెంచా ఎమోషన్..
నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్
తేయాకు లాంటీ నాజూకు తోనా
ఇరగదీశావే ప్రిపరేషన్
హే ఆంధ్ర నైజాం సీడెడ్ అంతా
చిల్లర పిల్లల ఫాలోయింగే
సక్కూ బాయ్ చాయంటేనే పడి సచ్చిపోతారూ
క్వార్టర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి
మేటర్ పెంచేశావే నీలో ఉందే తాజా ఉషారూ

వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్ ఓయ్..
వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్.. చేయ్.. చేయ్..

ఆ... ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు
శాంపిల్ చూశాడు సక్కుచాయ్ డోసు
కిక్కెక్కి చేశాడు రికార్డింగ్ డాన్సూ
చాల్లే ఎక్స్ట్రాసూ వాడో తేడా కేసూ
నీ జారే ఓణీసు చూశాడు బాసు
అంచేత చేశాడు గాల్లో జంపింగ్సూ
లారీతోనే తేడా సింగూ సక్కూ చాయ్ కి ఫ్యానైపోయి
ఇక్కడికిక్కడె నా ధాబాలో సెటిలైపోయాడూ
ఆ తింగరి స్టీరింగోడి లెక్కే వేరే తిక్కలపిల్ల
నీ ధాభాలో నులకమంచం
మెత్తగ ఉందని హత్తుకుపోయాడూ

వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్ ఆయ్..
వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్
చాయ్.. చాయ్.. చాయ్..
చాయ్ చాయ్.. చాయ్

సైన్మా :: ఢమరుకం - 2012
మోతల్ :: దేవీశ్రీప్రసాద్
రాతల్ :: రామజోగయ్య శాస్త్రి
గొంతుల్ :: సుచిత్ సురేషన్, మమతా శర్మ

ఒరిజినల్ ఈడియో ::