సిల్క్ స్మిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సిల్క్ స్మిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

అటు అమలాపురం..

జిగేలు రాణులని ఇప్పుడు పిలుస్తున్నారేమో కానీ ఆకాలం నుండీ సదరు జిగేలు రాణులు సమాజ సేవ చేస్తూనే ఉన్నారటండీ.. ఎలా అంటారా ఇదిగో ఇక్కడ జబర్దస్త్ రాఘవ స్కిట్ లో వివరిస్తున్నాడు మీరూ చూసి నవ్వుకోండి. మరి అలా అడిగినా అడగకపోయినా వివరంగా అడ్రస్ చెప్పిన జిగేలు రాణిలకే జిగేలురాణి లాంటి సిల్క్ స్మిత పాటతో ఈ వీకెండ్ సంబరాలు మొదలెట్టేయండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ
దాటేందుకూ…బోటున్నదీ…
రా సంతకీ… తస్సాదియ్యా 

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

కోనసీమలో…కూరగాయలూ…
గోదారిలో… కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మకానికీ
రెడీ రెడీ రయ్యో...

తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమేర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా
కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా
సిన్మా -->(( సుబ్బులు పిల్లను నేనే తెలుసా 
గంప దింపుకుని సరుకు చూసుకో
సుబ్బులు పిల్లను నేనే తెలుసా 

గంప దింపుకుని సరుకు చూసుకో))<--
క్యాసెట్ -->((సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో 
సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో))<-- 
బేరమాడుకో…తస్సాదియ్యా 

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ...

తప్పుడు కథల అప్పలరాజూ...
జటకా ఎక్కు కోటిపల్లిలో...
కాకినాడకో మామిడాడకో
రూటు మార్చకయ్యో...

తోటకూర గోంగూర బచ్చలికూర
కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పెద్దాపురము సంత చేరి 
నా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా 
ఎంతో నాణ్యవైనదయ్యో
చీటిమాటికీ బేరమాడకూ
సిన్మా -->(( ఇదిగో పీతా అదుగో రొయ్యా.. 
చీటిమాటికీ బేరమాడకూ
ఇదిగో పీతా అదుగో రొయ్యా
ఎంచి చూసుకో... తస్సాదియ్యా...))<-- 
క్యాసెట్ -->((హోలుసేలుగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే రేటూ.. 
హోలుసేలుగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే రేటూ..
రైటు చేసుకో… తస్సాదియ్యా…))<--

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

సైన్మా :: ఖైదీ నంబర్ 786 - 1988
మోతల్ :: రాజ్ - కోటి 
రాతల్ :: భువన చంద్ర 
గొంతుల్ :: జానకి 

29, అక్టోబర్ 2018, సోమవారం

ఏమనంటీనబయో..

కిష్కింద కాండ అనే కామెడీ సినిమా కోసం కీరవాణి గారు జానపద బాణీలో స్వరపరచిన ఓ మాస్ సాంగ్ ఇది. అక్కడ సిల్క్ స్మిత ఉండడం వల్ల ప్లస్ పిక్చరైజేషన్ వల్ల దీనిని ఐటమ్ సాంగ్ అనచ్చేమో కానీ ఈ ట్యూన్ రూటే సెపరేటు.. నేను చెప్పడం ఎందుకు మీరే వినండి..

ఆడియో ::

ఈడియో ::


లిరికియో ::

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

సోయగాల మావయ్యో
సోకుమాడా రావయ్యో
సందెకాడే సక్కావచ్చీ
తోటలోకి దూరయ్యో
తేనెటీగై జాడే పట్టీ
అందమంతా జుర్రయ్యో
ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్...

ఏయ్ అనవాల కొండా ఎనకా
ఆరంకణాల మేడా
ఆ మేడ సాటుకి రారో
ఒక మాటలాడి పోదువు
కంది సేలా నడవా
నాకుంది కుదుల మంచె
ఆ మంచె మీదికి రారో
ఒక ముచ్చటాడిపోదువు
ఒక ముచ్చటాడి పోదువు

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

ఎక్కకుంటే తప్పయ్యో
మల్లెపూల తెప్పయ్యో
ఏగుసుక్కా పొడిసేలోగా
ఏరుదాటి పోవయ్యో
ఎల్లకిల్లా పడితే గానీ
తెల్లవారీ పోదయ్యో

ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్... హహహహ్..
కట్ట కింద కొర్రా
అదీ కొయ్యబోతే లేతా
నా సాయముంటానంటే
సాయంత్రమొస్తానబయో
గట్టుకిందా గనిమా
ఆ గనిమ పక్కన మడవ 
ఆ మడవ నీళ్ళు గడతా
నా మాట మరవకురబయో
నా మాట మరవకురబయో

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

ఏమనంటీనబ్బయ్యో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయ్యో 

సైన్మా :: కిష్కింద కాండ - 
దరువుల్ :: కీరవాణి 
రాతల్ :: సాహితి/జొన్నవిత్తుల
గొంతుల్ :: రాధిక 

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

ఎంతసేపైన ఎదురు చూపేన..

ప్రస్తుతం మాములు పాటలు కూడా ఐటమ్ సాంగ్స్ లెవల్ లో తీస్తున్న రామ్ గోపాల్ వర్మ వచ్చిన కొత్తలో నైంటీస్ లో తీసిన ఓ మెలోడియస్ ఐటమ్ సాంగ్ తో మీ ఆదివారాన్ని ఆనందంగా ప్రారంభించండి. 

ఆడియో ::


ఈడియో :: 


లిరికియో ::

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

పపర పాపపౌ పపర పాపాపా
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  

ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా హా 
అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వేయిమందున్నా ఓహో 
ఒక్కదాన్నే వేగి పోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఏలుకోడేవె నా రాజు చప్పునా హ హా

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జూజూజూ.. ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

హా తోడులేని ఆడవాళ్ళంటే లాల.. 
కోడేగాళ్ళ చూడలేరంతే 
లాలాల లాల లాల లాలాల 
తోడేళ్ళే తరుముతూ ఉంటే 
తప్పు కోను త్రోవలేకుందే
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదీ
ఏవి లాభం గాలితో చెప్పుకుంటే

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

సైన్మా :: అంతం - 1992
మోతల్ :: ఆర్.డి.బర్మన్ 
రాతల్ :: సిరివెన్నెల 
గొంతుల్ :: చిత్ర 

4, సెప్టెంబర్ 2017, సోమవారం

బావలు సయ్యా..

అజ్ఞాత గారి కోరిక మేరకు ఈ హుషారైన పాటతో వీక్ ను ప్రారంభించండి..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

బావలూ బావలూ బావలూ
సయ్యా.. సై సై..
నయ్ నయ్
వెయ్ వెయ్
నువ్వూ ముయ్ ముయ్

బావలు సయ్యా
హాయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా
హొయ్ మరదలు సయ్యా
సై రింబోలా రింబోలా రింబోలా 
హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా

బావలు సయ్యా
హాయ్ మరదలు సయ్యా
సై బావలు సయ్యా
హొయ్ మరదలు సయ్యా
సై రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా

హాఅ..ఆఅ.ఆఆ..ఆహాఅ..ఆఆ...
ఆహా..అ..ఆఆఆ.
డింగరడింగా డింగరడింగా డింగరడింగా..

ఆ.. నేనే మీరై ఉందురుగా మీరు ఉందురుగా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఉందుమే పిల్లా మేముందుమే పిల్లా
ఆ.. వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా
చేరమే పిల్ల మేం చేరమే పిల్ల ఆ..
చేరమే పిల్ల మేం చేరమే పిల్ల
కూరిమితో కులుకులతో దండ వేస్తా రారా
కూరిమితో కులుకులతో దండ వేస్తా రారా
అహోయ్...
అందగాడా సందకాడ రారా
వచ్చీ..
వచ్చి నీవు ముద్దులాడిపోరా
ఆఅ..
రాటు తేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా
రాటు తేలిన..
అహ
రాటు తేలిన ..
ఒహోయ్..
రాటు తేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా

బావలు బావలు బావలు బావలూ
హోయ్ బావలు బావలు బావలు బావలూ
బావలు సయ్యా
హొయ్ మరదలు సయ్యా
సై రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్

డింగరడింగా డింగరడింగా డింగరడింగా..

హా.. నోటు రేటు తేలిస్తే నాకిస్తే
ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఏమిస్తావ్ మాకేమిస్తావ్
ఆ.. ఆడి పాడి చూపిస్తా మురిపిస్తా
మురిపించెయ్ మైమరపించెయ్
మురిపించెయ్ మైమరపించెయ్
మాటలకే లోబడని పేట జాణను నేను
ఆ..మాటలకే లోబడని పేట జాణను నేను
చిల్లరుంటే అల్లరంత మీకే
ఇచ్చినోడే నచ్చుతాడు నాకు
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్స్ బాంబు నేను
పైట జారిన...
అమ్మో..
పైట జారిన...
అబ్బో..
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్స్ బాంబు నేను

బావలు బావలు బావలు బావలూ
హై బావలు బావలు బావలు బావలూ
హా.. బావలు సయ్యా
సై మరదలు సయ్యా
సై బావలు సయ్యా
సై మరదలు సయ్యా
సై రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్
రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్
హా రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్

సైన్మా :: బావ బావమరిది - 1993
దరువుల్ :: రాజ్-కోటి
రాతల్ ::
గొంతుల్ :: రాధిక

22, ఆగస్టు 2017, మంగళవారం

నీ మీద నాకు ఇదయ్యో..

మోస్ట్ మెలోడియస్ ఐటంసాంగ్.. చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా.. ఎంజాయ్..

ఆడియో :: 

ఈడియో ::


లిరికియో ::

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
గిజిగాడి గిచ్చుళ్ళాయే.. చలిగాలి చిచ్చాయే
చేయించు తొలి మర్యాద.. యా యా యా యా

నీ మీద నాకు అదమ్మో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో
నీ కళ్ళు కవ్విస్తుంటే.. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా.. యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

నీ వంటి మగమహరాజే మగడే ఐతే
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి
నీ వంటి భామామణులు దొరికే వరకే
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి
నీ వీర శృంగారాలే..ఏ..ఏ..
నీ వీర శృంగారాలే చూపించవా
ఒకసారి ఒడి చేరి

నీ మీద నాకు అదమ్మో
అందం నే దాచలేను పదయ్యో

నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే

నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్దమందారాలే..ఏ..ఏ..
నీ ముద్దమందారాలే ముద్దాడనా
ప్రతి రేయి జత చేరి..

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
నీ కళ్ళు కవ్విస్తుంటే.. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా.. యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

సైన్మా ::  రాక్షసుడు - 1986
దరువుల్ :: ఇళయరాజా
రాతల్ :: వేటూరి
గొంతుల్ :: బాలు, జానకి