సిరివెన్నెల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సిరివెన్నెల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2019, సోమవారం

చల్ ఛయ్య ఛయ్య..

హాయిగా రిలాక్స్ అయ్యే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారాలు ఎంత కఠినమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కదా. అలాంటి సోమవారాలు మొదలు పెట్టడానికి మనకో మాంచి హుషారైన పాట తోడుంటే ఆ కిక్కే వేరు అనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఎంచక్కా ఈ పాట వింటూ చూస్తూ స్టెప్పులేసుకుంటూ హుషారుగా మీ రోజు మొదలెట్టేయండి. 

ఈడియో ::


24, సెప్టెంబర్ 2017, ఆదివారం

ఎంతసేపైన ఎదురు చూపేన..

ప్రస్తుతం మాములు పాటలు కూడా ఐటమ్ సాంగ్స్ లెవల్ లో తీస్తున్న రామ్ గోపాల్ వర్మ వచ్చిన కొత్తలో నైంటీస్ లో తీసిన ఓ మెలోడియస్ ఐటమ్ సాంగ్ తో మీ ఆదివారాన్ని ఆనందంగా ప్రారంభించండి. 

ఆడియో ::


ఈడియో :: 


లిరికియో ::

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

పపర పాపపౌ పపర పాపాపా
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  
పపర పాపపౌ పపర పాపాపా 
పపర పాపాపా పాపా పపర పాపాపాపాపా  

ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా హా 
అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వేయిమందున్నా ఓహో 
ఒక్కదాన్నే వేగి పోతున్నా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా ఎట్టాగె ఎదురీదనా
ఏలుకోడేవె నా రాజు చప్పునా హ హా

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జూజూజూ.. ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

హా తోడులేని ఆడవాళ్ళంటే లాల.. 
కోడేగాళ్ళ చూడలేరంతే 
లాలాల లాల లాల లాలాల 
తోడేళ్ళే తరుముతూ ఉంటే 
తప్పు కోను త్రోవలేకుందే
ఓ ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదే
ఊరంత ఉబలాటమూ నా వెంటనే ఉన్నదీ
ఏవి లాభం గాలితో చెప్పుకుంటే

ఎంతసేపైన ఎదురు చూపేన నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

సైన్మా :: అంతం - 1992
మోతల్ :: ఆర్.డి.బర్మన్ 
రాతల్ :: సిరివెన్నెల 
గొంతుల్ :: చిత్ర 

17, జులై 2016, ఆదివారం

హత్తెరీ ఎంత హుషారే..

సిరివెన్నెల గారితో ఐటమ్ సాంగ్ రాయించాలనే ఆలోచన అసలు క్రిష్ కి ఎలా వచ్చిందో కానీ.. ఆయన ఈ పాటను కూడా ఎంత అందంగా రాశారో.. ఇక ఆ మ్యూజిక్ కి అయితే తెలియకుండానే డాన్స్ వేసేస్తాం..

ఆడియో ::
http://play.raaga.com/telugu/album/Gamyam-songs-A0001236

ఈడియో ::


లిరికియో ::

హత్తెరీ ఎంత హుషారే చింతామణి
ఎల్లలు మీరే చిందాపనీ
విందడిగారే అందాలని
ముందుకురారే అందాలని

కొమ్మలో గమ్మున ఉంటే కంటపడవే నిధులు
కమ్మగా ఘం ఘం అంటూ కబురెడితే నీ సుధలు
దిరిసెన పువ్వా దర్శనమివ్వా అనవా తుమ్మెదలూ
పాపలా నిదరోమంటే వింటదా ఈడసలు
ఏపుగా ఎదుగుతు ఉంటే ఒంటిలో మిసమిసలు
ఎగబడతారే పొగబెడతారే తెగబడి తుంటరులు
స్వేచ్ఛగా ఎగురుతు ఉంటే పసివన్నెల జెండా
భక్తిగా వందనమనరా ఊరు వాడంతా
పచ్చిగా గుచ్చుకుంటే సూదంటి చూపులిట్టా
పైటిలా నిలబడుతుందా చెక్కు చెదరకుండా

హత్తెరీ ఎంత హుషారే చింతామణి
ఎల్లలు మీరే చిందాపనీ
విందడిగారే అందాలని
ముందుకురారే అందాలని

అరె అరె అరె అరె..
పిందెలా ఉన్నది కానీ పండెరో కళలన్నీ
ఎందరో తెలియదు కానీ పిండెరో వలపన్ని
చంబల్ రాణీ సొంపులలోని సంపదలెన్నెన్నీ..
నిందలో నిజమో కానీ ఎందుకా కథలన్నీ
మందిలో దొరలే కానీ దొంగలసరెవ్వరని
గుండెలలోని గూడుపుఠాణి అడిగేదెవ్వరనీ
కుందనపు బొమ్మై ఆలి నట్టింట్లో ఉన్నా
నిన్నొదిలి పోలేరమ్మా ఓ పోలేరమ్మ
చేతిలో అమృతముంటే చేదేలేవయ్యా
సంతలో అమ్మే అంబలి బాగుంటుందయ్య

హత్తెరీ ఎంత హుషారే చింతామణి
ఎల్లలు మీరే చిందాపనీ
విందడిగారే అందాలని
ముందుకురారే అందాలని

సైన్మా :: గమ్యం - 2008
దరువులు :: ఈ.ఎస్ మూర్తి
రాతలు :: సిరివెన్నెల 
గొంతులు :: గాయత్రి, ఈ.ఎస్.మూర్తి