సినారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నా పరువం నీకోసం...

అసలు సిసలైన మాస్ సినిమాలంటే అన్నగారి సినిమాలే మాస్ సాంగ్స్ అంటే ఆయన సినిమాలో సాంగ్సే. యుగంధర్ సినిమా లోని ఈ ఇళయరాజా గారి పాటను జానకి గారు భలే పాడారు. జయమాలిని అభిమానులకు వినడానికే కాదు చూడడానికి కూడా బావుంటుందనుకోండి. 
ఎంజాయ్ ద వీకెండ్ విత్ దిస్ వింటేజ్ సాంగ్. 

ఈడియో ::


7, ఆగస్టు 2019, బుధవారం

మావిడి తోపుల్లోనా (ఓలమ్మో ఓర్నాయనో)

ఒకప్పటి ఐటం సాంగ్స్ కూడా ఎంత మర్యాదగా రాసేవారో తెలుసుకోవాలంటే ఈ పాటే ఒక మంచి ఉదాహరణ. జీవితం సినిమా కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినారే గారి రచనను విని దరువు వేయని వారుండరనడం అతిశయోక్తి కాదేమో. ఈ పాట వీడియో ఎక్కడైన దొరికితె కామెంట్స్ లో చెప్పగలరు.

ఆడియో ఇన్ ఈడియో ::


20, సెప్టెంబర్ 2017, బుధవారం

ఎంతటి రసికుడవో తెలిసెరా...

మహా మహా బాపు గారికీ తప్పలేదు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం కానీ ఆయనంతటి వారు తీశారంటే ఆషామాషీగా అందరిలా ఉండకూడదు కదా... మరి ఎలా ఉంటుందంటారా... ఇదిగో ఇలా ఉంటుంది. విని చూసి ఆనందించండి. 

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీవెంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 

నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా

గుత్తపు రవిక వోయమ్మో..ఓ.. 
చెమట చిత్తడిలో తడిసి ఉండగా..ఆ..ఆ..ఆ..ఆ 
గుత్తపు రవిక వోయమ్మో..ఓ.. 
చెమట చిత్తడిలో తడిసి ఉండగా.. 
ఎంతసేపు... నీ తుంటరి చూపు 
ఎంతసేపు... నీ తుంటరి చూపు 
ఎంతసే...పు... నీ తుంటరి చూపు 
అంతలోనే తిరగాడుచుండగా.. 

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా

మోము మోమున ఆనించి.. 
ఏవో ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..ఆ 
మోము మోమున ఆనించి.. 
ఏవో ముద్దు ముచ్చుటలా..డ..బోవగా..ఆ..ఆ..అ 
మోము మోమున ఆనించి.. 
ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..అ 
గ్రక్కున కౌగిట చిక్కబట్టి 
గ్రక్కున కౌగిట చిక్కబటి 
నా..ఆ..ఆ చెక్కిలి మునిపంట నొక్కుచుండగా..ఆ 

ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా 
నీ వింతలు ఇంతలు ఇంతలై 
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ 
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా..ఆ. 
తెలిసెరా..తెలిసెరా..తెలిసెరా..రా..ఆ..ఆ

సైన్మా :: ముత్యాలముగ్గు - 1975 
రాతల్ :: డా॥సి.నారాయణరెడ్డి
మోతల్ :: కె.వి.మహదేవన్
గొంతుల్ :: పి.సుశీల 

9, ఆగస్టు 2016, మంగళవారం

మాయదారి సిన్నోడూ..

అప్పట్లో ఎందరో కుర్రకారుకి మనశ్శాంతి కరువయ్యేలా చేసిన జ్యోతిలక్ష్మి ఈ ఉదయం మరణించారుట. వారి ఆత్మకి శాంతి చేకురాలని కొరుకుంటూ.. ఈ హుషారైన పాట అభిమానుల కోసం. 

ఆడియో ::
http://gaana.com/album/amma-maata

ఈడియో ::


లిరికియో ::

మాయదారి సిన్నోడూ
మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు..
లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కాఁవమ్మ సెప్పవే.. రాఁవమ్మ సెప్పవే
రత్తమ్మ సెప్పవే.. అత్తమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..
సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..

సిగరుల్లో.. సిగురుల్లో..
సిగురుల్లో మాటేసి కన్నుగీటిండే
జివ్వున పానాలు తోడేసిండే..
ఎప్పుడ్రా మాఁవా అంటే..
సంకురాతిరి పొయ్యేదాకా..
మంచి గడియే లేదన్నాడే...

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే
పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..

ఊరి సెరువులో నే నీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే
ఊరి సెరువులో నేనీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే..

బుడుంగున...  బుడుంగున
బుడుంగున మీదికి తేలిండే
నా తడికొంగు పట్టుకుని లాగిండే
ఎప్పుడురా మాఁవా అంటే
శివరాతిరి ఎల్లేదాకా శుభలగ్గం లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే
కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే
కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే..

గబుక్కున.. గుబుక్కున..
గబుక్కున కళ్లు రెండు మూసిండే
రివ్వున వాటేసి నవ్వేసిండే
ఏందిరా మాఁవా అంటే
కోడికూసీ కూయంగానే తాళి కడతానన్నాడే..

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే
పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
కోడి కూసి కూయంగానే తాళి కడతానన్నాడే
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

సైన్మా :: అమ్మ మాట -- 1972
దరువుల్ :: రమేశ్ నాయుడు
రాతల్ :: సినారె
గొంతుల్ :: ఎల్.ఆర్. ఈశ్వరి