మోహన్ బాబు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మోహన్ బాబు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

అటు అమలాపురం..

జిగేలు రాణులని ఇప్పుడు పిలుస్తున్నారేమో కానీ ఆకాలం నుండీ సదరు జిగేలు రాణులు సమాజ సేవ చేస్తూనే ఉన్నారటండీ.. ఎలా అంటారా ఇదిగో ఇక్కడ జబర్దస్త్ రాఘవ స్కిట్ లో వివరిస్తున్నాడు మీరూ చూసి నవ్వుకోండి. మరి అలా అడిగినా అడగకపోయినా వివరంగా అడ్రస్ చెప్పిన జిగేలు రాణిలకే జిగేలురాణి లాంటి సిల్క్ స్మిత పాటతో ఈ వీకెండ్ సంబరాలు మొదలెట్టేయండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ
దాటేందుకూ…బోటున్నదీ…
రా సంతకీ… తస్సాదియ్యా 

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

కోనసీమలో…కూరగాయలూ…
గోదారిలో… కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మకానికీ
రెడీ రెడీ రయ్యో...

తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమేర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా
కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా
సిన్మా -->(( సుబ్బులు పిల్లను నేనే తెలుసా 
గంప దింపుకుని సరుకు చూసుకో
సుబ్బులు పిల్లను నేనే తెలుసా 

గంప దింపుకుని సరుకు చూసుకో))<--
క్యాసెట్ -->((సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో 
సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో))<-- 
బేరమాడుకో…తస్సాదియ్యా 

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ...

తప్పుడు కథల అప్పలరాజూ...
జటకా ఎక్కు కోటిపల్లిలో...
కాకినాడకో మామిడాడకో
రూటు మార్చకయ్యో...

తోటకూర గోంగూర బచ్చలికూర
కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పెద్దాపురము సంత చేరి 
నా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా 
ఎంతో నాణ్యవైనదయ్యో
చీటిమాటికీ బేరమాడకూ
సిన్మా -->(( ఇదిగో పీతా అదుగో రొయ్యా.. 
చీటిమాటికీ బేరమాడకూ
ఇదిగో పీతా అదుగో రొయ్యా
ఎంచి చూసుకో... తస్సాదియ్యా...))<-- 
క్యాసెట్ -->((హోలుసేలుగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే రేటూ.. 
హోలుసేలుగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే రేటూ..
రైటు చేసుకో… తస్సాదియ్యా…))<--

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

సైన్మా :: ఖైదీ నంబర్ 786 - 1988
మోతల్ :: రాజ్ - కోటి 
రాతల్ :: భువన చంద్ర 
గొంతుల్ :: జానకి