దేవీశ్రీప్రసాద్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేవీశ్రీప్రసాద్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2021, మంగళవారం

జల జల జలపాతం - ఈటీవీ

సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కన్నా వీళ్ళ కెమిస్ట్రీ ఫిజిక్సూ బయాలజీ అన్నీ టూమచ్ గా ఉన్నట్లున్నాయ్ కదా. అంతా బానే ఉంది కానీ ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా టీవీ చూసే సమయంలో ఈ పాట ప్రసారం చేయడం మాత్రం... హ్మ్.. ఎందుకులెండి.. ఏమైనా అంటే రిమోట్ లేదా అంటారు.. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఈ పోస్ట్ చివర ఉంది.

ఈడియో ::

17, ఫిబ్రవరి 2021, బుధవారం

రంభా ఊర్వశి మేనక..

మొన్న సంక్రాంతికి విడుదలైన మరో కమర్షియల్ సినిమా అల్లుడు అదుర్స్. దీనిలో బిగ్ బాస్ ఫోర్ ద్వారా ఫేమస్ అయిన గుజరాతీ భామ మోనల్ గజ్జర్ ఓ మెరుపు మెరిసిన ఐటం సాంగ్ ఇది. దేవీశ్రీ మ్యూజిక్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని మీరూ ఎంజాయ్ చేయండి. 

ఈడియో ::


17, ఫిబ్రవరి 2019, ఆదివారం

వంగతోట మలుపు కాడ..

దేవీశ్రీప్రసాద్ తన కెరీర్ తొలి రోజుల్లో కంపోజ్ చేసిన ఒక మస్త్ బీట్ సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఈ వీకెండ్ ముగించేసేయండి. 

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

వంగతోట మలుపూ కాడా... 
కొంగు బట్టీ లాగాడే...
సందు చూసీ సైగే చేసీ 
గోల చేశాడే హే... హే... హే...

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే 
సందు చూసి సైగే చేసి గోల చేశాడే 

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే 
సందు చూసి సైగే చేసి గోల చేశాడే 
చూట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే...

హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో
హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో.. హోయ్.. 

హేయ్...
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే

హే... వచ్చినీడు వచ్చినట్లే 
అరే గిచ్చిగిచ్చి చంపుతుంటే..
కుచ్చిళ్ళ లంకలో పొత్తిళ్ల వంకతో 
ఒళ్ళంత నొక్కినాడే... 

పచ్చి పచ్చి సిగ్గులెన్నో 
చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మా మూతికీ బుగ్గమ్మా బంతికి 
ముద్దెట్టి పోయేనాడే 

హే.అయ్య బాబోయ్ ఎక్కడోడే 
సక్కనోడే గాని తిక్కలోడు 
గోడెక్కి వస్తడు గోరు ముద్దులిస్తడు
గోపాలుడంటి వాడు గోల కృష్ణుడు 

వంగతోట ...వంగతోట... హే
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే... ఏ...

వంగాతోట... వంగా... వంగాతోట

హే... గోంగూర చేనికాడా 
లంగోటిగాడు కంగారు పెట్టినాడే 
వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా
వాటెయ్య వచ్చినాడే

గోంగూర సంత కాడా శృంగారపొడు 
మింగేట్టు చూసినాడే తూచేది తూచగా 
తుచాలు తప్పకా దోచేసి పోయ్యినాడే
అయ్య బాబోయ్ పిల్లగాడే 
గంప దించి నా కొంప ముంచినాడు
మ్యాట్నీకి రమ్మనీ నడిరేతిరాటనీ 
దీపాలు పెట్టగానే ఏసుకుంటడూ

వంగతోట... వంగతోట...హే... 
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే..
చూట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే...

హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో
హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో.. హోయ్.. 

సైన్మా :: అభి (2004)
గొంతుల్ :: మాలతీ
రాతల్ :: వేటూరి సుందరరామూర్తి
మోతల్ :: దేవి శ్రీ ప్రసాద్

1, జనవరి 2019, మంగళవారం

డియ్యాలో డియ్యాలా..

రసిక రాజాస్ అండ్ రాణీస్ అందరికీ హాపీ న్యూ ఇయర్.. నిన్న పార్టీ కుమ్మేశారా.. కొత్త సంవత్సరం మూడు స్టెప్పులు ఆరు దరువులతో దద్దరిల్లిపోవాలని కోరుకుంటూ హాపీ హాపీ న్యూ ఇయర్.. సుకుమార్ దేవీశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ఒక మాంచి ఊపున్న సాంగ్ తో సంవత్సరం మొదలెట్టేద్దాం..

ఆడియో :: 


ఈడియో :: 
     


లిరికియో :: 

ఆ ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి
పద్దెందో ఏట ఫైటేసుకుందంట 
డియ్యాలో డియ్యాల 
చిన్నవీది చక్కెల చిట్టమ్మగారి చిన్నకోడలు 
నలభయ్యో ఏట నీళ్ళోసుకుందంట 
డియ్యాలో డియ్యాల 
రంగుల రాజరావుగారి మూడో అమ్మాయి 
పక్కింటి పుల్లారావుగారి నాలుగో అబ్బాయితో 
జంపు జిలాని అంటా డియ్యాలో డియ్యల 

ఇంకా మన మెరకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ 
దుబాయి సత్యవతి ఆళ్ళాళ్ళ మొగుళ్ళని వదిలేసారంట 
డియ్యాలో డియ్యాల 
ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేనుగాని
ఆళ్ళనోటితో ఆళ్ళే చెప్పుకుంటారంటా 
డియ్యాలో డియ్యాల
మొదలెట్టవే మంగతాయారు 

అద్దురూపాయ్ ఇచ్చాడూ అద్దం కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
ఒక్కరూపాయ్ ఇచ్చాడూ స్టిక్కర్ కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
రెండు రూపాయ్ లిచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
మూడు రూపాయ్ లిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
పది రూపాయ్ లిచ్చి పాండ్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు 
నలబై రూపాయ్ లిచ్చి నకిలీ నక్లేస్స్ కొనుక్కోమన్నాడూ 
అన్ని కొనిచ్చి అలంకరించి ఐదు లక్షలకు బెరంపేట్టి 
అసలేమీ పసలేని ముసలోడికి నన్నమ్మేసాడూ

పిల్లా నీ బావనిస్తవా తోలుకేళ్ళి తెల్లారి తీసుకొస్తనూ 
య్యాలో డియ్యాలో 
యా పిల్లా నీ బావనిస్తవా ఏడికాస్త చల్లారబెట్టుకొస్తనూ 
య్యాలో డియ్యాలో 
అమ్మో నా బావనిస్తనా జూనియర్ షారుఖ్ ని జారనిస్తనా 
అమ్మో నా బావనిస్తనా ఇంకో కాజోల్ ని చావనిస్తనా 

మెరకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది 
గాజుల సిట్టెమ్మ మీముందుకు గలగలా వచ్చేత్తుందోయ్.. 

గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావ్ అంటాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
గాజుల ఉపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
పక్కింటోడికి పొలమారింద నువ్వే తలిసావంటాడూ 
డియ్యాలో డియ్యాల 
పోరిగింటోడికి జరమోచ్చిందా నీపై దిగులని అంటాడూ 
డియ్యాలో డియ్యాల 
దోమ కుట్టిందన్నానా ఆడా మగా అంటాడూ.. పోనీ 
చీమ కుట్టిందన్నానా చిన్నా పెద్దా అంటాడూ 
వాడికి వీడికి లింకులుపెట్టి ఉన్నవి లేనివి రంకులుకట్టి 
శీలానికి సంకెళ్ళేసీ సిలకే కొట్టని జాంపండయ్యానూ 

అయ్యో పాపం 

పిల్లా నీ బావనిస్తవా ఒక్కసారి చాటుకెళ్ళి లేటుగొస్తనూ 
య్యాలో డియ్యాలో 
పిల్లా నీ బావనిస్తవా నా మొగుడుకున్న డౌటులన్ని రైటు చేస్తనూ 
య్యాలో డియ్యాలో 
అమ్మో నా బావనిస్తనా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తనా 
అమ్మో నా బావనిస్తనా వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తనా

అరె జరగండి జరగండి జరగండి జరా 
దుసుకుంటొచ్చేత్తంది దుబాయి సత్యవతీ 

దుడ్డు కావాలన్నాడూ దుబాయ్ నన్నూ పంపాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
ప్రీజ్జి టీవీ కోంటానే పైసల్ పంపీమన్నాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
సోఫాసెట్ కోంటానే సొమ్ములు పంపీమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
డబుల్కాటు కోంటానే డబ్బులు పంపీమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
ఇయ్యన్ని పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడూ 
ఈస్ట్ ఫేసులో కొంటానే ఇంకా పంపీమన్నాడూ 
సాలిడ్ గా సెటిల్ అయ్యమంటూ బోలెడు ఆశతో ఫ్లైటే దిగితే 
ఈస్ట్ పేస్ ఇంటిలోనా డబులుకాటు బెడ్డుఫైనా 
సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను ..తుస్స్స్

పిల్లా నీ బావనిస్తవా అప్సెట్ సెట్ చేసి తీసుకొస్తనూ 
య్యాలో డియ్యాలో
పిల్లా నీ బావనిస్తవా దుబాయి సెంటు బుడ్డిలోన ముంచుకొస్తనూ
య్యాలో డియ్యాలో 
అరె అమ్మో నా బావనిస్తనా ఆయిల్ బావిలోన దూకనిస్తనా
అమ్మో నా బావనిస్తనా వీడి జిడ్డు నీకు అంటనిస్తనా 

ఓరివోరివోరిరి ఈ ముగ్గురు కథలైతే నాకు తెల్సుగానీ
ఇదెవరో కొత్తబండిరా బాబు రయ్ మని గుద్దుకుంటూ వచ్చేత్తాంది

ఇలియానాకే ఈర్ష్య పుట్టే నడుమేనాదని అన్నాడూ 
డియ్యాలో డియ్యాలా
ముమైత్ ఖాన్ కి దమాక్ తిరిగే ఉడుకే నాదని అన్నాడూ
డియ్యాలో డియ్యాల
శ్రేయకే చెమట్లు పుట్టే సోకే నాదని అన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
అనుష్కానే ఎనక్కి నేట్టే సరుకే నాదని అన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంటలేక్కి పోయాడూ 
అప్పు డౌనూ చూసాడు అప్పడం అయిపోయాడూ 

పేస్ చూసి …ఆఅ.. పేస్ చూసి.......
హే పేస్ చూసి ప్రీజైపోయి పార్టులు మొత్తం లూజైపోయి 
పాపకి నేను సరిపోనంటు పారిపోయాడూ
అబ్బో అంత గొప్ప పేసా జర మాక్కుడా చుపించారాదే 

పిల్లా నీ బావనిస్తవా కంటి చూపుతోనే సప్పరిస్తనూ
య్యాలో డియ్యాలో 
పిల్లా నీ బావనిస్తవా నోటీ మాటతోనే నంజుకుంటనూ 
య్యాలో డియ్యాలో 
ఓకే నా బావనిస్తనూ జూనియర్ షారూఖ్ నీ జంటచేస్తనూ
నీకే నా బావనిస్తనూ ఇంత అందగత్తెగాడు లేదంటానూ 

పిల్లా నీ బావనివ్వకూ నమ్ముకున్న తోడునేపుడు వీడనివ్వకూ 
య్యాలో డియ్యాలో 
పిల్లా నీ బావనివ్వకూ జీవితాన్ని మోడులాగా మారనివ్వకూ
య్యాలో డియ్యాలో 

సైన్మా :: 100% లవ్ -- 2011
మోతల్ :: దేవీశ్రీప్రసాద్ 
రాతల్ :: చంద్రబోస్
గొంతుల్ :: మురళి, ప్రియ హిమేష్

22, అక్టోబర్ 2018, సోమవారం

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు...

ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ సుకుమార్ సిన్మా, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇక అడ్డేముంది అందుకే ఓ ఆర్నెల్ల నుండీ ఊర్లో ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తుంది. అందుకే మన బ్లాగ్ రీఓపెనింగ్ ఈ పాటతో చేసేస్కుందారి. 

ఈడియో :: 


లిరికియో ::

రంగస్థల గ్రామ ప్రజలందరికి  విజ్ఞప్తి
మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి
జిగేలు రాణి వచ్చేసింది ఆడి పాడి అలరించేస్తది అంతే...
మీరందరు రెడీ గా ఉండండి
అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు

ఒరెఒరెఒరెఒరే...
ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో
మరి ఉండ్రా ఏంటి నువ్వత్తన్నావ్ అని తెలిసీ
పక్కురినుండి కూడా వచ్చాం.. ఎగేసుకుంటూ
ఇదిగో ఆ గళ్ళ సొక్కా జిగేల్ రాజా ఏంది
గుడ్లప్పగించి సూత్తన్నాడు నా వంకే
నువ్వేదో ఇత్తావని జిగేల్ రాణి
నువ్వేందయ్యా పూల సొక్కా
ఓ మీద మీద కొత్తన్నావో
ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ
అందరి దగ్గరకు నేనే వస్తా
ఆ అందరడిగింది ఇచ్చే పోతా.... అదీ

ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ
ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
కన్నైనా కొట్టవే జిగేలు రాణీ

ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే
ముద్దేమో మునసబుకి పెట్టెశానే
కన్నేమో కరణానికి కొట్టేశానే

ఒక్కసారి వాటేత్తావా జిగేలు రాణీ
కొత్త ప్రెసిడెంటు కది దాచుంచానే
మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణీ
మీ అయ్యతోని పోటీ నీకు వద్దంటానే
మరి నాకేమిత్తావే జిగేలు రాణే.ఏఏఏ..హోయ్
నువ్ కోరింది ఏదైనా ఇచ్చేస్తానే

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

నీ వయసూ సెప్పవే జిగేలు రాణీ
అది ఆరో క్లాసులో ఆపేశానే
నువు సదివెందెంతే జిగేలు రాణీ
మగాళ్ళా ఈకునెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ
సుబ్బిశెట్టి పంచి ఊడితే నవ్వేశానే
నన్ను బావా అనవే జిగేలు రాణీ
అది పోలీసోళ్ళకి రిజర్వేషనే
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణే..ఏఏ..హేయ్..
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఉన్నదడిగితే నేను లేదంటానా

ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ
ఏదడిగినా లేదంటావ్
నీ దగ్గర ఇంకేం ఉంది చెప్పూ
నీకేం కావాలో చెప్పూ

హేయ్....నువ్ పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ
దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ
నువు ఏసిన గాజులు ఇమ్మంటామూ
వాటి సప్పుడు వింటూ సచ్చిపోతమూ
అరె నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ
ఆ వాసన చూస్తూ బతుకంతా బ్రతికేత్తామూ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
ఎవడి పాట వాడు పాడండోయ్ రాజా

నా పాటా ఏలికున్న ఉంగరం
నా పాట తులం బంగారం
నా పాట సంతలో కొన్న కోడెద్దు
నా పాటా పులి గోరూ
వెండి పళ్ళెం.. ఎకరం మామిడి తోట
మా ఆవిడ తెచ్చిన కట్నం
కొత్తగా కట్టించుకున్న ఇల్లూ
నా పాట రైసు మిల్లూ
అహే ఇవన్ని కాదు కానీ
నా పాట క్యాషు లక్షా
అయిబాబోయ్ లచ్చే

సైన్మా :: రంగస్థలం - 2018
మోతల్ :: దేవి శ్రీ ప్రసాద్
రాతల్ :: చంద్రబోస్
గొంతుల్ :: రేలాకుమార్, గంటా వెంకట లక్ష్మీ

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కెవ్వ్ కేక నా సామిరంగా..

ఆడియో :: 


ఈడియో :: 


లిరికియో ::

ఏ.. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని
ఈదెంట నేనెళ్తుంటే కెవ్వ్ కేక నా ఈదంతా కెవ్వ్ కేక
పాపిటి బిళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని
ఊరంత నేనెళ్తుంటే కెవ్వ్ కేక నా ఊరంతా కెవ్వ్ కేక
ఎసరు లాగ మరుగుతుంది ఒంట్లో కారం
స్పెషల్ మీల్సు నీకుంటది నాతో బేరం
నా ఈడు కొత్తిమీర నా సోకు కోడికూర
నువు రాక రాక విందుకొస్తే కోక చాటు పెట్టిస్తా

కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా

ఆ.. నా అందం ఓ బ్యాంకు 
నువ్వు దూరి నా సోకు దొంగలాగ దోచావంటే
ఆ దోచేస్తే కెవ్వ్ కేక నీ సోకుమాడ కెవ్వ్ కేకా
నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే ఎలిగిస్తే
ఆ వెలిగిస్తే కెవ్వ్ కేక నీ దుంప తెగ కెవ్వ్ కేకా
నా టూరింగ్ టాకీసు రిబ్బను కట్టు కెవ్వ్ కేక
నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు కెవ్వ్ కేక
చూశారు ట్రయిలరు ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటి నిండ చిచ్చు రేగి పిచ్చెక్కి పెడతారు

కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా

హే కొత్త సిల్కు గుడ్డల్లె 
గల్ఫు సెంటు బుడ్డల్లె ఝలక్ లిచ్చు నీ జిలుగులే
అబ్బో కెవ్వ్ కేక ఓ రత్తాలు కెవ్వ్ కేకా
హే వేడి వేడి లడ్డల్లె 
డబుల్ కాట్ బెడ్డల్లే వాటమైన వడ్డింపులే
కెవ్వ్ కేక ఓ రత్తాలు కెవ్వ్ కేకా
హే జోరు మీద గుర్రాలు నీ ఊపులే కెవ్వ్ కేక
ఊరు వాడ పందేలు నీ సొంపులే కెవ్వ్ కెవ్వ్ కేక
నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ
ఓ గోలి సోడా తాగి నీతో గొల్లుమంటూ పెట్టిస్తా

కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే..క
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ 
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ 
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్

సైన్మ :: గబ్బర్ సింగ్ - 2012 
మోతల్ :: దేవీశ్రీప్రసాద్
రాతల్ :: సాహితి
గొంతుల్ :: మమతా శర్మ, ఖుషి మురళి

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మాహిష్మతి లో సక్కుబాయ్ చాయ్..

ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకి ప్రసారమయ్యే ఢీ-10 లో ఢమరుకంలోని "వెల్కంటూ సక్కుబాయ్" పాటను బాహుబలి డైలాగ్స్ తో మిక్స్ చేసి వెరైటీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ పాట ఒరిజినల్ వీడియోతో పాటు అది కూడా చూసి ఎంజాయ్ చేయండి.

ఆడియో ::


ఢీ-10 వీడియో మాహిష్మతిలో సక్కుబాయ్ ::


లిరికియో ::

హే సక్కుబాయ్ జర దేదోనా గరంగరం చాయ్
హే సక్కుబాయ్ నువ్ చాయిస్తే ఆదోరకం హాయ్

చాయ్.. చాయ్.. చచచాయ్..
హే.. ఏస్కో నా ఘుమా ఘుమా చాయ్
యమ ఫేమస్సిది ఢిల్లీటూ దుబాయ్
హే.. తీస్కో నా సలసల చాయ్
భలే మోగిస్తది నరాల్లో సన్నాయ్
గుండె గుయ్యంటే అల్లం చాయ్
సుయ్యంటే బెల్లం చాయ్
కెవ్వంటే కరక్కాయ్ చాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్
సలవైతే కారా చాయ్
ముసుగెడితే ములక్కాడ చాయ్
నా బంగారు చేతుల్తో పింగాణి సాసర్లో
నీకోసం తెస్తానబ్బాయ్

వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్
వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్

హే సక్కుబాయ్ జర దేదోనా గరంగరం చాయ్
హే సక్కుబాయ్ నువ్ చాయిస్తే ఆదోరకం హాయ్

సొ.సొ.సొగసాకు తీసీ.. కాచా డికాషన్..
పరువాల మిల్కూ పెదవుల్లో షుగరూ
పక్కాగా కలిపేసి పెంచా ఎమోషన్..
నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్
తేయాకు లాంటీ నాజూకు తోనా
ఇరగదీశావే ప్రిపరేషన్
హే ఆంధ్ర నైజాం సీడెడ్ అంతా
చిల్లర పిల్లల ఫాలోయింగే
సక్కూ బాయ్ చాయంటేనే పడి సచ్చిపోతారూ
క్వార్టర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి
మేటర్ పెంచేశావే నీలో ఉందే తాజా ఉషారూ

వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్ ఓయ్..
వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్.. చేయ్.. చేయ్..

ఆ... ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు
శాంపిల్ చూశాడు సక్కుచాయ్ డోసు
కిక్కెక్కి చేశాడు రికార్డింగ్ డాన్సూ
చాల్లే ఎక్స్ట్రాసూ వాడో తేడా కేసూ
నీ జారే ఓణీసు చూశాడు బాసు
అంచేత చేశాడు గాల్లో జంపింగ్సూ
లారీతోనే తేడా సింగూ సక్కూ చాయ్ కి ఫ్యానైపోయి
ఇక్కడికిక్కడె నా ధాబాలో సెటిలైపోయాడూ
ఆ తింగరి స్టీరింగోడి లెక్కే వేరే తిక్కలపిల్ల
నీ ధాభాలో నులకమంచం
మెత్తగ ఉందని హత్తుకుపోయాడూ

వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్ ఆయ్..
వెల్కంటూ సక్కుబాయ్ గరంచాయ్
తాగేసేయ్ మజాచేయ్
చాయ్.. చాయ్.. చాయ్..
చాయ్ చాయ్.. చాయ్

సైన్మా :: ఢమరుకం - 2012
మోతల్ :: దేవీశ్రీప్రసాద్
రాతల్ :: రామజోగయ్య శాస్త్రి
గొంతుల్ :: సుచిత్ సురేషన్, మమతా శర్మ

ఒరిజినల్ ఈడియో ::