ఇళయరాజా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇళయరాజా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

నా పరువం నీకోసం...

అసలు సిసలైన మాస్ సినిమాలంటే అన్నగారి సినిమాలే మాస్ సాంగ్స్ అంటే ఆయన సినిమాలో సాంగ్సే. యుగంధర్ సినిమా లోని ఈ ఇళయరాజా గారి పాటను జానకి గారు భలే పాడారు. జయమాలిని అభిమానులకు వినడానికే కాదు చూడడానికి కూడా బావుంటుందనుకోండి. 
ఎంజాయ్ ద వీకెండ్ విత్ దిస్ వింటేజ్ సాంగ్. 

ఈడియో ::


30, నవంబర్ 2018, శుక్రవారం

పిలిచే కుహు కుహు..

ఈ పాట ఈ బ్లాగ్ లో ఏ కేటగిరీలోకి వస్తుందబ్బా అని అట్టే ఆలోచించకుండా జానకి గారి గొంతులోని నిషాని గుండెనిండా నింపేసుకుని వీకెండ్ మొదలెట్టేయండి మజా మజాగా..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

ఓఓఓ.... ఓఓఓ...
పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే
పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

ఒళ్ళే ఉయ్యాలగ ఊగిందిలే
ఒళ్ళో తాపాలను రేపిందిలే
ఓఓఓఓ.... ఓఓఓఓఓ....

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

చురుక్కుమంటు కొరుక్కుతింటు
చురచురామనే సూరీడు
కలుక్కుమంటు తళుక్కుమంటు
ససేమిరా అనే నా ఈడు
అదేమిటో గానీ తడే తమాషా
చలెందుకో గానీ బలే కులాసా
ఓహో... ఓఓఓ...
వయ్యరాలే ఓణీలేసే

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

పదాల తాళం పెదాల రాగం
తనువులో లయే ఝుమ్మంది
కిలాడి ప్రాయం చలాకి గేయం
పద పసాసరి లెమ్మందీ
అదేమిటో గాని చలే నిజంలా
మనస్సుతో పేచి మజా మజాగా
ఓహో... ఓఓఓ...
గాలే నాలో ఈలే వేసె

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే
ఒళ్ళే ఉయ్యలగ ఊగిందిలే
ఒళ్ళో తాపాలను రేపిందిలే
ఓఓఓ...

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

సైన్మా :: కిల్లర్ -
మోతల్ :: ఇళయరాజా
రాతల్ :: వేటూరి 
గొంతుల్ :: జానకి

23, నవంబర్ 2018, శుక్రవారం

నచ్చిన ఫుడ్డూ వెచ్చని బెడ్డూ..

ఈ పాట పాడాక తన స్వరానికి ఓ రెండు రోజులు పూర్తిగా రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందని వేరే ఏ పాటలు పాడలేకపోయానని బాలుగారే ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తు. ప్రయోగాలు చేయాలన్నా చేయించుకోవాలన్నా కమల్ తర్వాతే కదా. ఇళయరాజా బాణీకి వేటూరి గారి పదాలు గిలిగింతలు పెడతాయ్. ఆ సరదా ఏంటో చూసేసి అసలే చలికాలం కదా మరి నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డుతో వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.

ఆడియో ::


ఈడియో :: 


లిరికియో :: 

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు

వినరో పిటపిట లాడే పిట్టల కొక్కొరొకో
పదరో చిటపట లాడే ఈడుకు దిక్కిదిగో
కసితో కుతకుత ఉడికే కళ్ళకు విందిదిగో
ఎదలో కితకిత పెట్టే కన్నెల చిందిదిగో
చెక్కిలి నొక్కుల చిక్కులలో 
చిక్కని మక్కువ చిక్కులురో
చక్కిలిగింతల తొక్కిడిలో 
ఉక్కిరి బిక్కిరి తప్పదురో
అక్కరతీర్చే అంగడిలో 
అందాల అందాలు అందాలి పదరా

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని....

సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో
జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో
త్వరగా కలబడి ఖానా పీనా కానీరో
మరిగే కలతకు జాణల దాణా కానుకరో
తుళ్ళెను అందం కళ్ళెదురా
ఒల్లని పందెం చెల్లదురా
మల్లెల గంధం చల్లునురా
అల్లరిబంధం అల్లుడురా
అత్తరు సోకే కత్తెరరా 
మొత్తంగ మెత్తంగ కోస్తుంది కదరా

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు
వెయ్యర సై అంటు నడుం చుట్టూ ఉడుం పట్టు
చిందెయ్యర రై అంటూ పదం వింటు పదా అంటు

నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్దం రా ఫ్రెండు
తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు

సైన్మ :: ఇంద్రుడు చంద్రుడు -- 1989
దరువుల్ :: ఇళయరాజా
రాతల్ :: వేటూరి సుందరరామ మూర్తి
గొంతుల్ :: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

18, నవంబర్ 2018, ఆదివారం

మబ్బే మసకేసిందిలే..

ఓ వ్యాసంలో ఖదీర్ గారు చెప్పినట్లు ఇది రాత్రి పాట, కోరిక పాట, తాపం పాట, నిప్పు రగిల్చే పాట, అప్పట్లో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన పాట. బాలుగారు ఆటాడుకున్నట్లుగా పాడిన పాట. మీ వీకెండ్ ని ఈ పాటతో ముగించండి. 

ఆడియో :: 


ఈడియో ::  


లిరికియో :: 

హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ అంత సిగ్గా

మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే

కురిసే సన్నని వాన సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వాన సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా 
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూలమంచం
వెచ్చగ వుందామూ మనమూ

హే పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగ ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే

పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించువేళా
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ మనదీ

హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే

నవ్వని పువ్వే నువ్వు 
నునువెచ్చని తేనెలు ఇవ్వు 
దాగదు మనసే ఆగదు వయసే 
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు 
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు 
ఇద్దరమొకటవనీ కానీ 

హే బుగ్గమీదా మొగ్గలన్నీ దూసుకోనీ 
రాతిరంతా జాగారమే చేసుకోనీ 
మబ్బే మసకేసిందిలే 
పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే 
మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే

సైన్మ :: వయసు పిలిచింది -- 1978
రాతల్ :: వేటూరి
మోతల్ :: ఇళయరాజా
గొంతుల్ :: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

6, నవంబర్ 2018, మంగళవారం

నా నవ్వే దీపావళీ..

వన్నెల విసనకర్రలాంటి చిన్నదాని వెన్నెల నవ్వుల వెలుగుల ముందు దీపావళి దివ్వెల వెలుగులు ఏపాటివి చెప్పండి. అందుకే ఈమె నా నవ్వే దీపావళి అని అంత ధీమాగా పాడగలిగింది. ట్యూన్ క్లాస్ అయినా ఈ పాటలో మిగిలినవన్నీ మాసే.. చూసీ వినీ ఆనందించేయండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం నా వయసే
అతిమధురం నా మనసే

నా నవ్వే నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
అందాలన్నీ పూచెను నేడే
ఆశల కోటా వెలిసెను నేడే
స్నేహం నాది దాహం నీది
కొసరే రేయీ నాదే నీదే
ఆడీ పాడీ నువ్వే రా

నా నవ్వే నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం నా వయసే
అతిమధురం నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

లలలాల లాల లాలలాలలాలా
లాలలా లాలలాలాలాలాలల

కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు పలికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు పలికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం
పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడీ పాడీ నువ్వే రా

నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

సైన్మా : నాయకుడు (1987)
దరువుల్ : ఇళయరాజా
రాతల్ : రాజశ్రీ
గొంతుల్ : జమునా రాణి

22, ఆగస్టు 2017, మంగళవారం

నీ మీద నాకు ఇదయ్యో..

మోస్ట్ మెలోడియస్ ఐటంసాంగ్.. చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా.. ఎంజాయ్..

ఆడియో :: 

ఈడియో ::


లిరికియో ::

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
గిజిగాడి గిచ్చుళ్ళాయే.. చలిగాలి చిచ్చాయే
చేయించు తొలి మర్యాద.. యా యా యా యా

నీ మీద నాకు అదమ్మో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో
నీ కళ్ళు కవ్విస్తుంటే.. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా.. యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

నీ వంటి మగమహరాజే మగడే ఐతే
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి
నీ వంటి భామామణులు దొరికే వరకే
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి
నీ వీర శృంగారాలే..ఏ..ఏ..
నీ వీర శృంగారాలే చూపించవా
ఒకసారి ఒడి చేరి

నీ మీద నాకు అదమ్మో
అందం నే దాచలేను పదయ్యో

నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే

నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్దమందారాలే..ఏ..ఏ..
నీ ముద్దమందారాలే ముద్దాడనా
ప్రతి రేయి జత చేరి..

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
నీ కళ్ళు కవ్విస్తుంటే.. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా.. యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

సైన్మా ::  రాక్షసుడు - 1986
దరువుల్ :: ఇళయరాజా
రాతల్ :: వేటూరి
గొంతుల్ :: బాలు, జానకి