ఒక అజ్ఞాత గారి రిక్వెస్ట్ మేరకు "రారోయి మా యింటికి" పాట ఎంజాయ్ చేయండి.
ఆడియో ::
ఈడియో ::
లిరికియో ::
రారోయి మా ఇంటికి
"మ్మ్"
రారోయి మా ఇంటికి మావో
మాటున్నది మంచి మాటున్నది
"హాహ్హా"
మాటున్నది మంచి మాటున్నది
"ఆఁ"
నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది
"ఆహా"
నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది
"ఆహా"
నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది
"అహ్హహ్హహ్హ.. భలే భలే"..
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి
"మ్మ్"..
మావో మాటున్నది మంచి మాటున్నది
ఆకలైతే సన్నబియ్యం కూడున్నది
"మ్మ్"
నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది
"బావుంది బావుంది"
అందులోకి అరకోడి కూరున్నది
"అహహ్హ అవ్వల్రైట్ యెర్రీ గుడ్"
అందులోకి అరకోడి కూరున్నది
"ఆఁ"
ఆపైన రొయ్యప్పొట్టు చారున్నది
"అహహ్హా.. అబ్బో అబ్బో"
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి
"అంతేగా"
మావో మాటున్నది మంచి మాటున్నది
రంజైన మీగడ పెరుగున్నది
"బుర్ వీ... చీ చీ చీ చీ"
నంజుకొను ఆవకాయ ముక్కున్నది
"ఆహ్.. డోంట్ వాంట్"
రోగమొస్తె ఘాటైన మందున్నది
"అహ్.. అహహ అహ్హ"
రోగమొస్తె ఘాటైన మందున్నది
"ఆ"
నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది
"అహ్హహహహహహ ఊ ఓహొహొహొహొ"
సైన్మా :: దొంగరాముడు - 1955
దరువుల్ :: పెండ్యాల
రాతల్ :: సముద్రాల (సీనియర్)
గొంతుల్ :: జిక్కి, ఆర్. నాగేశ్వరరావు