25, జనవరి 2020, శనివారం

గంప నెత్తినెట్టుకోని...

మాల్గాడిశుభ పాడిన "చిక్ పక్ చిక్ భం" ఆల్బమ్ సూపర్ హిట్ అయిన రోజుల్లోదనుకుంటాను ఈ పాట. ఆ ఆల్బమ్ పాటలు రాసిన సాహితే ఈ పాట రాసింది కూడా. సెన్సార్ దాటిన వీడియోలో లిరిక్స్ కాస్త పర్లేదు కానీ ఆడియో లోవి మాత్రం స్ట్రిక్ట్లీ పెద్దలకు మాత్రమే. పాట ట్యూన్ అండ్ బీట్ మాత్రం మంచి హుషారుగా ఉంటుంది. 

ఈడియో :: 



లిరికియో :: 

గంప నెత్తినెట్టుకోని 
కట్ట మీద పోతాంటే 
గంప నెత్తినెట్టుకోని 
కట్ట మీద పోతాంటే 
లగ్గోమేనత్త కొడుకూ
నా కొంగు పట్టుకున్నడే 

బుట్ట సంకనెట్టుకోని 
తోట పక్కకెళ్తాంటే 
పైపైకొచ్చినాడే 
నా పైట గుంజుకున్నడే 

ఏం పిల్ల అన్నడే ముద్దులిమ్మన్నడే 
ఏం కొంటె పిల్లడే ఏం ముద్దుగున్నడే 
జోరుమీద ఉన్నడే తోడుగుండమన్నడే 
ఏం తీపి అన్నడే ఏం తిళ్ళు తిన్నడే 
గడ్డివాము సాటునెట్టి 
సెంప మీద సేతులెట్టి 
అబ్బవీడి జిమ్మదియ్య 
కస్సుమంటు కన్నెబుగ్గ కొరికినాడే 

గంప నెత్తినెట్టుకోని 
కట్ట మీద పోతాంటే 
లగ్గోమేనత్త కొడుకూ
నా కొంగు పట్టుకున్నడే 
బుట్ట సంకనెట్టుకోని 
తోట పక్కకెళ్తాంటే 
పైపైకొచ్చినాడే 
నా పైట గుంజుకున్నడే 

కళ్ళు ఉండి చూడలేని గుడ్లగూబలా 
కళ్ళ ముందు ఉన్నదేమి చూడలేడే 
ఇంటిలోనె కోరుకున్న పిల్ల ఉండగా
ఇంక దేనికోసమో వెతుకుతాడే 
తానమాడుతుంటె నేను 
తడిక సాటు నుంచి నన్ను 
తొంగి తొంగి సూసినాడే 
సీరగడుతు ఉంటే వాడు సెంగులాగి 
పైటకున్న మూరలెన్నొ కొలిసినాడే 
ఆగలేని పిల్లడే కౌగిలించుకున్నడే 
హద్దు పద్దులెరగడే ముద్దులెట్టుకున్నడే
ఆహ జంగిలాల పిల్లడే చెక్కిలంటుకున్నడే 
చక్కిలాల గుమ్మడే చక్కిలంటుకున్నడే 
కోడిపుంజు రెక్క విరిచి కోరికంత పక్కపరిచి 
బొండుమల్లె అందమంత 
అమ్మబాబొ పంబ రేగ గొట్టినాడే 

గంప నెత్తినెట్టుకోని 
కట్ట మీద పోతాంటే 
లగ్గోమేనత్త కొడుకూ
నా కొంగు పట్టుకున్నడే 
బుట్ట సంకనెట్టుకోని 
తోట పక్కకెళ్తాంటే 
పైపైకొచ్చినాడే 
నా పైట గుంజుకున్నడే 

జొన్నచేలో గోంగూర గిల్లుతాంటే 
కన్నుగీటి కన్నె సోకు గిల్లినాడే 
కంది సేలో గూడు మంచె ఎక్కుతాంటే 
ఎందుకో ఫక్కుమని నవ్వినాడే 
పాటి సేల మంచె మీద 
పచ్చగడ్డి ఎయ్యకుంటే
గుచ్చుకుంటదన్నాడే 
పాలు పొంగు వయసులోన
పరువమంత ఇయ్యకుంటె 
నొచ్చుకుంటనన్నాడే 
మాటలోన అప్పుడే మనసు దోచుకున్నడే
ఉడుముకంటె గట్టిగా నడుము సుట్టుకున్నడే 
పువ్వులాంటి పడుచునే పొదివి పట్టుకున్నడే 
మొగలిరేకు పొదలనే సెగలు రేపుతున్నడే  
మల్లెమొగ్గ మోజులన్నీ 
మళ్ళి మళ్ళి రాజుకుంటు 
చెమ్మచెక్కలేసుకుంటు 
ఏరువాక ఎన్నెలల్లె కమ్మినాడే 

గంప నెత్తినెట్టుకోని 
కట్ట మీద పోతాంటే 
లగ్గోమేనత్త కొడుకూ
నా కొంగు పట్టుకున్నడే 
బుట్ట సంకనెట్టుకోని 
తోట పక్కకెళ్తాంటే 
పైపైకొచ్చినాడే 
నా పైట గుంజుకున్నడే 

ఏం పిల్ల అన్నడే ముద్దులిమ్మన్నడే 
ఏం కొంటె పిల్లడే ఏం ముద్దుగున్నడే 
జోరుమీద ఉన్నడే తోడుగుండమన్నడే 
ఏం తీపి అన్నడే ఏం తిళ్ళు తిన్నడే 
గడ్డివాము సాటునెట్టి 
సెంప మీద సేతులెట్టి 
అబ్బవీడి జిమ్మదియ్య 
కస్సుమంటు కన్నెబుగ్గ కొరికినాడే 

సైన్మా :: లేడీబాస్ - 1995
దరువుల్ :: కీరవాణి 
రాతల్ :: సాహితి 
గొంతుల్ :: మాల్గాడి శుభ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.