7, ఆగస్టు 2019, బుధవారం

మావిడి తోపుల్లోనా (ఓలమ్మో ఓర్నాయనో)

ఒకప్పటి ఐటం సాంగ్స్ కూడా ఎంత మర్యాదగా రాసేవారో తెలుసుకోవాలంటే ఈ పాటే ఒక మంచి ఉదాహరణ. జీవితం సినిమా కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినారే గారి రచనను విని దరువు వేయని వారుండరనడం అతిశయోక్తి కాదేమో. ఈ పాట వీడియో ఎక్కడైన దొరికితె కామెంట్స్ లో చెప్పగలరు.

ఆడియో ఇన్ ఈడియో ::



లిరికియో ::

మావిడి తోపుల్లోనా మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ చీకటేల పట్టేసి

మావిడి తోపుల్లోనా మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ చీకటేల పట్టేసి

చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి
చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి
చూపించి..

మాయ చేసి పోతివిరో నాగులూ
నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

నిన్నే కావాలని ఎన్నుకొంటిని
నీ చుట్టూ నా మనసే అల్లుకొంటిని
రేకెత్తే నా సొగసే నీకు ముడుపు కడితిని
ఇన్నీ చేసినదాన్నీ ఏమెరగని చినదాన్నీ
ఇన్నీ చేసినదాన్నీ ఏమెరగని చినదాన్నీ
ఉమ్..ఉమ్..

మాయ చేసి పొతివిరో నాగులూ
నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

నట్టింట ఒంటరిగా కాచుకొంటిని
నడిరాతిరి ఉసురుసురంటూ వేచి ఉంటిని
ఆకు చప్పుడైనా నీ అడుగులే అనుకొంటిని
నిన్నే నమ్మినదాన్నీ నీకే నచ్చినదాన్నీ
నిన్నే నమ్మినదాన్నీ నీకే నచ్చిన దాన్నీ

కాదు మరి..

మాయచేసి పోతివిరో నాగులూ
నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

తొలినాటి తొందరలు ఏమాయెరా
ఆ బులిపాలు మురిపాలు కరువాయెరా
నిద్దర పోతూ ఉన్నా ఆ ముద్దులే గురుతాయెరా
చిగురాకు లాంటిదాన్నీ వగలేవి లేనిదాన్నీ
చిగురాకు లాంటిదాన్నీ వగలేవి లేని దాన్నీ
ఉమ్.. పాపం..

మాయ చేసి పోతివిరో నాగులూ
నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

సైన్మా :: జీవితం - 1973
దరువుల్ :: రమేశ్ నాయుడు
రాతల్ :: సినారె
గొంతుల్ :: ఎల్.ఆర్. ఈశ్వరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.