12, ఆగస్టు 2019, సోమవారం

చల్ ఛయ్య ఛయ్య..

హాయిగా రిలాక్స్ అయ్యే వీకెండ్ తర్వాత వచ్చే సోమవారాలు ఎంత కఠినమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు కదా. అలాంటి సోమవారాలు మొదలు పెట్టడానికి మనకో మాంచి హుషారైన పాట తోడుంటే ఆ కిక్కే వేరు అనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలశ్యం ఎంచక్కా ఈ పాట వింటూ చూస్తూ స్టెప్పులేసుకుంటూ హుషారుగా మీ రోజు మొదలెట్టేయండి. 

ఈడియో ::


7, ఆగస్టు 2019, బుధవారం

మావిడి తోపుల్లోనా (ఓలమ్మో ఓర్నాయనో)

ఒకప్పటి ఐటం సాంగ్స్ కూడా ఎంత మర్యాదగా రాసేవారో తెలుసుకోవాలంటే ఈ పాటే ఒక మంచి ఉదాహరణ. జీవితం సినిమా కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ సినారే గారి రచనను విని దరువు వేయని వారుండరనడం అతిశయోక్తి కాదేమో. ఈ పాట వీడియో ఎక్కడైన దొరికితె కామెంట్స్ లో చెప్పగలరు.

ఆడియో ఇన్ ఈడియో ::


17, ఫిబ్రవరి 2019, ఆదివారం

వంగతోట మలుపు కాడ..

దేవీశ్రీప్రసాద్ తన కెరీర్ తొలి రోజుల్లో కంపోజ్ చేసిన ఒక మస్త్ బీట్ సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఈ వీకెండ్ ముగించేసేయండి. 

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

వంగతోట మలుపూ కాడా... 
కొంగు బట్టీ లాగాడే...
సందు చూసీ సైగే చేసీ 
గోల చేశాడే హే... హే... హే...

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే 
సందు చూసి సైగే చేసి గోల చేశాడే 

వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే 
సందు చూసి సైగే చేసి గోల చేశాడే 
చూట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే...

హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో
హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో.. హోయ్.. 

హేయ్...
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే

హే... వచ్చినీడు వచ్చినట్లే 
అరే గిచ్చిగిచ్చి చంపుతుంటే..
కుచ్చిళ్ళ లంకలో పొత్తిళ్ల వంకతో 
ఒళ్ళంత నొక్కినాడే... 

పచ్చి పచ్చి సిగ్గులెన్నో 
చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మా మూతికీ బుగ్గమ్మా బంతికి 
ముద్దెట్టి పోయేనాడే 

హే.అయ్య బాబోయ్ ఎక్కడోడే 
సక్కనోడే గాని తిక్కలోడు 
గోడెక్కి వస్తడు గోరు ముద్దులిస్తడు
గోపాలుడంటి వాడు గోల కృష్ణుడు 

వంగతోట ...వంగతోట... హే
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే... ఏ...

వంగాతోట... వంగా... వంగాతోట

హే... గోంగూర చేనికాడా 
లంగోటిగాడు కంగారు పెట్టినాడే 
వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా
వాటెయ్య వచ్చినాడే

గోంగూర సంత కాడా శృంగారపొడు 
మింగేట్టు చూసినాడే తూచేది తూచగా 
తుచాలు తప్పకా దోచేసి పోయ్యినాడే
అయ్య బాబోయ్ పిల్లగాడే 
గంప దించి నా కొంప ముంచినాడు
మ్యాట్నీకి రమ్మనీ నడిరేతిరాటనీ 
దీపాలు పెట్టగానే ఏసుకుంటడూ

వంగతోట... వంగతోట...హే... 
వంగతోట మలుపూ కాడా కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే..
చూట్టు కొలత చూస్తానంటూ గుట్టు కాస్తా దోచాడే
బక్క పలచ నడుమే తడిమి బంతులాడాడే
అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే...

హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో
హాయ్యో రామా... హాయ్యో రామా... 
హాయ్యో రామా... హయ్యెయ్యో.. హోయ్.. 

సైన్మా :: అభి (2004)
గొంతుల్ :: మాలతీ
రాతల్ :: వేటూరి సుందరరామూర్తి
మోతల్ :: దేవి శ్రీ ప్రసాద్

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

అటు అమలాపురం..

జిగేలు రాణులని ఇప్పుడు పిలుస్తున్నారేమో కానీ ఆకాలం నుండీ సదరు జిగేలు రాణులు సమాజ సేవ చేస్తూనే ఉన్నారటండీ.. ఎలా అంటారా ఇదిగో ఇక్కడ జబర్దస్త్ రాఘవ స్కిట్ లో వివరిస్తున్నాడు మీరూ చూసి నవ్వుకోండి. మరి అలా అడిగినా అడగకపోయినా వివరంగా అడ్రస్ చెప్పిన జిగేలు రాణిలకే జిగేలురాణి లాంటి సిల్క్ స్మిత పాటతో ఈ వీకెండ్ సంబరాలు మొదలెట్టేయండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ
దాటేందుకూ…బోటున్నదీ…
రా సంతకీ… తస్సాదియ్యా 

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

కోనసీమలో…కూరగాయలూ…
గోదారిలో… కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మకానికీ
రెడీ రెడీ రయ్యో...

తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమేర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా
కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా
సిన్మా -->(( సుబ్బులు పిల్లను నేనే తెలుసా 
గంప దింపుకుని సరుకు చూసుకో
సుబ్బులు పిల్లను నేనే తెలుసా 

గంప దింపుకుని సరుకు చూసుకో))<--
క్యాసెట్ -->((సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో 
సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో))<-- 
బేరమాడుకో…తస్సాదియ్యా 

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ...

తప్పుడు కథల అప్పలరాజూ...
జటకా ఎక్కు కోటిపల్లిలో...
కాకినాడకో మామిడాడకో
రూటు మార్చకయ్యో...

తోటకూర గోంగూర బచ్చలికూర
కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ

పెద్దాపురము సంత చేరి 
నా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా 
ఎంతో నాణ్యవైనదయ్యో
చీటిమాటికీ బేరమాడకూ
సిన్మా -->(( ఇదిగో పీతా అదుగో రొయ్యా.. 
చీటిమాటికీ బేరమాడకూ
ఇదిగో పీతా అదుగో రొయ్యా
ఎంచి చూసుకో... తస్సాదియ్యా...))<-- 
క్యాసెట్ -->((హోలుసేలుగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే రేటూ.. 
హోలుసేలుగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే రేటూ..
రైటు చేసుకో… తస్సాదియ్యా…))<--

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ

సైన్మా :: ఖైదీ నంబర్ 786 - 1988
మోతల్ :: రాజ్ - కోటి 
రాతల్ :: భువన చంద్ర 
గొంతుల్ :: జానకి 

18, జనవరి 2019, శుక్రవారం

అన్నం పెట్టమంది...

దీన్ని ఐటమ్ ఆర్ మాస్ సాంగ్ అనేకన్నా కామెడీ సాంగ్ అనచ్చేమో... కాకపోతే రిలీజైన అప్పట్లో కిళ్ళీ కొట్లలోనూ, కాఫీ హోటళ్ళలోనూ మారుమోగి పోయేది... ఆ సంగతేంటో మీరూ చూసి ఎంజాయ్ చేస్తూ వీకెండ్ మొదలెట్టండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

బావా మరే...
అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

కూర వేసి పెట్టనా
మజ్జిగేసి పెట్టనా
కూర వేసి పెట్టనా
మజ్జిగేసి పెట్టనా
పీట వేసి పెట్టనా
బల్లమీద పెట్టనా
ఎక్కడ పెట్టను బావో
ఏమేసి పెట్టను బావా

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

అలిసి అలిసి వస్తాడూ
చమట పట్టి ఉంటాడూ
పంపు తిప్పి నీళ్ళు వదిలి
లక్సు పెట్టి వీపు రుద్ది

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

తడిసి తడిసి ఉంటాడూ
తుడుచుకోను అంటాడూ
ఒళ్ళు తుడిచి పౌడరేసి
బట్టలేసి సెంటు పూసీ

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

ఆవురావురంటాడూ
ఆకలైనా అడగడూ
ఆశతీర ఆకువేసి
కోరుకున్న కూరలేసి

అన్నం పెట్టమంది అమ్మ
ఏమే బావకి
అన్నం పెట్టమంది అమ్మ

ఆదమరచి ఉంటాడు
తమలపాకులంటాడూ
చిలకచుట్టి నోటపెట్టి
దిండు వేసి పండబెట్టి

నన్న నన్ననానా నన్నా.. 
పప్ప పప్పపాపా పప్పా..
ఊహూ..హూహుఃఊహు.. 

సైన్మా :: రాముడు కాదు కృష్ణుడు -- 1983
మోతల్ :: చక్రవర్తి
రాతల్ :: దాసరి 
గొంతుల్ :: జానకి 


1, జనవరి 2019, మంగళవారం

డియ్యాలో డియ్యాలా..

రసిక రాజాస్ అండ్ రాణీస్ అందరికీ హాపీ న్యూ ఇయర్.. నిన్న పార్టీ కుమ్మేశారా.. కొత్త సంవత్సరం మూడు స్టెప్పులు ఆరు దరువులతో దద్దరిల్లిపోవాలని కోరుకుంటూ హాపీ హాపీ న్యూ ఇయర్.. సుకుమార్ దేవీశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ఒక మాంచి ఊపున్న సాంగ్ తో సంవత్సరం మొదలెట్టేద్దాం..

ఆడియో :: 


ఈడియో :: 
     


లిరికియో :: 

ఆ ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి
పద్దెందో ఏట ఫైటేసుకుందంట 
డియ్యాలో డియ్యాల 
చిన్నవీది చక్కెల చిట్టమ్మగారి చిన్నకోడలు 
నలభయ్యో ఏట నీళ్ళోసుకుందంట 
డియ్యాలో డియ్యాల 
రంగుల రాజరావుగారి మూడో అమ్మాయి 
పక్కింటి పుల్లారావుగారి నాలుగో అబ్బాయితో 
జంపు జిలాని అంటా డియ్యాలో డియ్యల 

ఇంకా మన మెరకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ 
దుబాయి సత్యవతి ఆళ్ళాళ్ళ మొగుళ్ళని వదిలేసారంట 
డియ్యాలో డియ్యాల 
ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేనుగాని
ఆళ్ళనోటితో ఆళ్ళే చెప్పుకుంటారంటా 
డియ్యాలో డియ్యాల
మొదలెట్టవే మంగతాయారు 

అద్దురూపాయ్ ఇచ్చాడూ అద్దం కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
ఒక్కరూపాయ్ ఇచ్చాడూ స్టిక్కర్ కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
రెండు రూపాయ్ లిచ్చాడు రిబ్బన్ కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
మూడు రూపాయ్ లిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
పది రూపాయ్ లిచ్చి పాండ్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు 
నలబై రూపాయ్ లిచ్చి నకిలీ నక్లేస్స్ కొనుక్కోమన్నాడూ 
అన్ని కొనిచ్చి అలంకరించి ఐదు లక్షలకు బెరంపేట్టి 
అసలేమీ పసలేని ముసలోడికి నన్నమ్మేసాడూ

పిల్లా నీ బావనిస్తవా తోలుకేళ్ళి తెల్లారి తీసుకొస్తనూ 
య్యాలో డియ్యాలో 
యా పిల్లా నీ బావనిస్తవా ఏడికాస్త చల్లారబెట్టుకొస్తనూ 
య్యాలో డియ్యాలో 
అమ్మో నా బావనిస్తనా జూనియర్ షారుఖ్ ని జారనిస్తనా 
అమ్మో నా బావనిస్తనా ఇంకో కాజోల్ ని చావనిస్తనా 

మెరకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది 
గాజుల సిట్టెమ్మ మీముందుకు గలగలా వచ్చేత్తుందోయ్.. 

గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావ్ అంటాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
గాజుల ఉపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
పక్కింటోడికి పొలమారింద నువ్వే తలిసావంటాడూ 
డియ్యాలో డియ్యాల 
పోరిగింటోడికి జరమోచ్చిందా నీపై దిగులని అంటాడూ 
డియ్యాలో డియ్యాల 
దోమ కుట్టిందన్నానా ఆడా మగా అంటాడూ.. పోనీ 
చీమ కుట్టిందన్నానా చిన్నా పెద్దా అంటాడూ 
వాడికి వీడికి లింకులుపెట్టి ఉన్నవి లేనివి రంకులుకట్టి 
శీలానికి సంకెళ్ళేసీ సిలకే కొట్టని జాంపండయ్యానూ 

అయ్యో పాపం 

పిల్లా నీ బావనిస్తవా ఒక్కసారి చాటుకెళ్ళి లేటుగొస్తనూ 
య్యాలో డియ్యాలో 
పిల్లా నీ బావనిస్తవా నా మొగుడుకున్న డౌటులన్ని రైటు చేస్తనూ 
య్యాలో డియ్యాలో 
అమ్మో నా బావనిస్తనా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తనా 
అమ్మో నా బావనిస్తనా వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తనా

అరె జరగండి జరగండి జరగండి జరా 
దుసుకుంటొచ్చేత్తంది దుబాయి సత్యవతీ 

దుడ్డు కావాలన్నాడూ దుబాయ్ నన్నూ పంపాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
ప్రీజ్జి టీవీ కోంటానే పైసల్ పంపీమన్నాడూ 
డియ్యాలో డియ్యాల డియ్య డియ్య డియ్యాల 
సోఫాసెట్ కోంటానే సొమ్ములు పంపీమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
డబుల్కాటు కోంటానే డబ్బులు పంపీమన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
ఇయ్యన్ని పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడూ 
ఈస్ట్ ఫేసులో కొంటానే ఇంకా పంపీమన్నాడూ 
సాలిడ్ గా సెటిల్ అయ్యమంటూ బోలెడు ఆశతో ఫ్లైటే దిగితే 
ఈస్ట్ పేస్ ఇంటిలోనా డబులుకాటు బెడ్డుఫైనా 
సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను ..తుస్స్స్

పిల్లా నీ బావనిస్తవా అప్సెట్ సెట్ చేసి తీసుకొస్తనూ 
య్యాలో డియ్యాలో
పిల్లా నీ బావనిస్తవా దుబాయి సెంటు బుడ్డిలోన ముంచుకొస్తనూ
య్యాలో డియ్యాలో 
అరె అమ్మో నా బావనిస్తనా ఆయిల్ బావిలోన దూకనిస్తనా
అమ్మో నా బావనిస్తనా వీడి జిడ్డు నీకు అంటనిస్తనా 

ఓరివోరివోరిరి ఈ ముగ్గురు కథలైతే నాకు తెల్సుగానీ
ఇదెవరో కొత్తబండిరా బాబు రయ్ మని గుద్దుకుంటూ వచ్చేత్తాంది

ఇలియానాకే ఈర్ష్య పుట్టే నడుమేనాదని అన్నాడూ 
డియ్యాలో డియ్యాలా
ముమైత్ ఖాన్ కి దమాక్ తిరిగే ఉడుకే నాదని అన్నాడూ
డియ్యాలో డియ్యాల
శ్రేయకే చెమట్లు పుట్టే సోకే నాదని అన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
అనుష్కానే ఎనక్కి నేట్టే సరుకే నాదని అన్నాడూ 
డియ్యాలో డియ్యాల 
ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంటలేక్కి పోయాడూ 
అప్పు డౌనూ చూసాడు అప్పడం అయిపోయాడూ 

పేస్ చూసి …ఆఅ.. పేస్ చూసి.......
హే పేస్ చూసి ప్రీజైపోయి పార్టులు మొత్తం లూజైపోయి 
పాపకి నేను సరిపోనంటు పారిపోయాడూ
అబ్బో అంత గొప్ప పేసా జర మాక్కుడా చుపించారాదే 

పిల్లా నీ బావనిస్తవా కంటి చూపుతోనే సప్పరిస్తనూ
య్యాలో డియ్యాలో 
పిల్లా నీ బావనిస్తవా నోటీ మాటతోనే నంజుకుంటనూ 
య్యాలో డియ్యాలో 
ఓకే నా బావనిస్తనూ జూనియర్ షారూఖ్ నీ జంటచేస్తనూ
నీకే నా బావనిస్తనూ ఇంత అందగత్తెగాడు లేదంటానూ 

పిల్లా నీ బావనివ్వకూ నమ్ముకున్న తోడునేపుడు వీడనివ్వకూ 
య్యాలో డియ్యాలో 
పిల్లా నీ బావనివ్వకూ జీవితాన్ని మోడులాగా మారనివ్వకూ
య్యాలో డియ్యాలో 

సైన్మా :: 100% లవ్ -- 2011
మోతల్ :: దేవీశ్రీప్రసాద్ 
రాతల్ :: చంద్రబోస్
గొంతుల్ :: మురళి, ప్రియ హిమేష్