6, నవంబర్ 2018, మంగళవారం

నా నవ్వే దీపావళీ..

వన్నెల విసనకర్రలాంటి చిన్నదాని వెన్నెల నవ్వుల వెలుగుల ముందు దీపావళి దివ్వెల వెలుగులు ఏపాటివి చెప్పండి. అందుకే ఈమె నా నవ్వే దీపావళి అని అంత ధీమాగా పాడగలిగింది. ట్యూన్ క్లాస్ అయినా ఈ పాటలో మిగిలినవన్నీ మాసే.. చూసీ వినీ ఆనందించేయండి.

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం నా వయసే
అతిమధురం నా మనసే

నా నవ్వే నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా
అందాలన్నీ పూచెను నేడే
ఆశల కోటా వెలిసెను నేడే
స్నేహం నాది దాహం నీది
కొసరే రేయీ నాదే నీదే
ఆడీ పాడీ నువ్వే రా

నా నవ్వే నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం నా వయసే
అతిమధురం నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

లలలాల లాల లాలలాలలాలా
లాలలా లాలలాలాలాలాలల

కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు పలికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కథలు పలికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం
పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడీ పాడీ నువ్వే రా

నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ
అరవిందం.. నా వయసే
అతిమధురం.. నా మనసే
నా నవ్వే దీపావళీ హోయ్
నా పలుకే గీతాంజలీ

సైన్మా : నాయకుడు (1987)
దరువుల్ : ఇళయరాజా
రాతల్ : రాజశ్రీ
గొంతుల్ : జమునా రాణి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.