29, అక్టోబర్ 2018, సోమవారం

ఏమనంటీనబయో..

కిష్కింద కాండ అనే కామెడీ సినిమా కోసం కీరవాణి గారు జానపద బాణీలో స్వరపరచిన ఓ మాస్ సాంగ్ ఇది. అక్కడ సిల్క్ స్మిత ఉండడం వల్ల ప్లస్ పిక్చరైజేషన్ వల్ల దీనిని ఐటమ్ సాంగ్ అనచ్చేమో కానీ ఈ ట్యూన్ రూటే సెపరేటు.. నేను చెప్పడం ఎందుకు మీరే వినండి..

ఆడియో ::

ఈడియో ::


లిరికియో ::

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

సోయగాల మావయ్యో
సోకుమాడా రావయ్యో
సందెకాడే సక్కావచ్చీ
తోటలోకి దూరయ్యో
తేనెటీగై జాడే పట్టీ
అందమంతా జుర్రయ్యో
ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్...

ఏయ్ అనవాల కొండా ఎనకా
ఆరంకణాల మేడా
ఆ మేడ సాటుకి రారో
ఒక మాటలాడి పోదువు
కంది సేలా నడవా
నాకుంది కుదుల మంచె
ఆ మంచె మీదికి రారో
ఒక ముచ్చటాడిపోదువు
ఒక ముచ్చటాడి పోదువు

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

ఎక్కకుంటే తప్పయ్యో
మల్లెపూల తెప్పయ్యో
ఏగుసుక్కా పొడిసేలోగా
ఏరుదాటి పోవయ్యో
ఎల్లకిల్లా పడితే గానీ
తెల్లవారీ పోదయ్యో

ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్ష్... హహహహ్..
కట్ట కింద కొర్రా
అదీ కొయ్యబోతే లేతా
నా సాయముంటానంటే
సాయంత్రమొస్తానబయో
గట్టుకిందా గనిమా
ఆ గనిమ పక్కన మడవ 
ఆ మడవ నీళ్ళు గడతా
నా మాట మరవకురబయో
నా మాట మరవకురబయో

ఏమనంటీనబయో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయో

ఏమనంటీనబ్బయ్యో
నేనేమనంటీనబయో
నా దోర వయసు పోరే
జర తీర్చమంటీనబయ్యో 

సైన్మా :: కిష్కింద కాండ - 
దరువుల్ :: కీరవాణి 
రాతల్ :: సాహితి/జొన్నవిత్తుల
గొంతుల్ :: రాధిక 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.