7, జనవరి 2018, ఆదివారం

పుట్టింటోళ్ళు తరిమేసారు...

వేటూరి గారు రాసిన ఈ పాట లిరిక్స్ శ్రద్దగా వింటే ఇది ఐటమ్ సాంగ్ గా కన్నా కూడా కామెడీ సాంగ్ గా అనుకోవచ్చేమో అనిపిస్తుంటుంది. జయమాలిని డ్రస్ కూడా ఈ కాలం హీరోయిన్ల డ్రస్ కన్నా నయమే అనచ్చు..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా నాసామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా నాసామి
కట్టుకుంటే మూడే ముళ్ళురా

అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓరాణి
కట్టు కధలు చెప్పమాకులే

పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ

హా గడపదాటిననాడె కడప చేరాను
తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను..
వడ్డించుకుంటాను
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో...
అమ్మతోడు ఆదివారం నాడు
అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి
ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి
ముద్దుకైనా ముట్టుకోను
ముద్దుకైనా ముట్టుకోను

పుట్టింటోళ్ళు తరిమేసారు
అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు
టింగురంగా బంగారమ్మ

గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే అ.
నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అహహ....
అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

పుట్టింటోళ్ళు తరిమేసారు
హ.కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ
టింగురంగా బంగారమ్మ

సైన్మా :: వేటగాడు - 1979
దరువుల్ :: చక్రవర్తి
రాతల్ :: వేటూరి సుందర రామమూర్తి
గొంతుల్ :: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల

1, జనవరి 2018, సోమవారం

డోరు నంబర్ ఒకటీ డాషు..

Happy New Year Friends.. కొత్త సంవత్సరాన్ని ఒక మాంచి ఊపున్న పాటతో మొదలెడదాం.. ఎంజాయ్.. 

ఆడియో :: 


ఈడియో ::


లిరికియో :: 

హాల్లో హల్లో హల్లో.. 
మైక్ టెస్టింగ్ వన్ టూ
జంట నగరాలకు మంట పెట్టే
నాజూకు నడుమొంపు
నాట్య మయూరి.. ఛీఛీ..
నాటు మయూరి...
కుమారి నెమలి నెమలి నెమలి 
ఆటా పాట నేడే చూడండి
కాస్కో రాజా ఏస్కో బాజా

ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకెళ్తే సోఫాసెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను

ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొస్తే సొఫా సెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను

ఎప్పుడంటే అప్పుడొచ్చి షేక్ హ్యాండిచ్చేస్కో
ముద్దులిచ్చి మెళ్ళో డైమండ్ లాకేట్ ఏసేస్కో
ఎహె. ఆళ్ళూ ఈళ్ళు సూత్తేయేటి
టివి ల్లోనా ఎత్తెఏంటి
మజా మజా కాళ్ళ గజ్జ నాతో ఆడేస్కో

ఆహ ఎహె ఓహో అబ్బబ్బబ్బో

ఆ సిగ్గు సిగ్గు సిగ్గాతరక సిల్లి నెమల్లి.
సిచ్చుబుడ్డి పేలుస్తాది నరాలు గిల్లి
కర కర కారా సూపుల చిల్లి నెమల్లి
అగ్గి మంట పెట్టేస్తాది అత్తర్లు జల్లి

అబ్బబ్బబ్బా నీ గురించి నువ్వు మస్తు 
అర్డ్వటైజ్మెంట్ చేస్కుంటున్నావ్ గానీ
తర్వాత ముచ్చటేందో చెప్పు జరా

ఆ నేను గాని ఫేసుబుక్కు పోస్టింగ్ పెడితే 
టన్నుల్ టన్నుల్ లైకింగ్ లా ట్రాఫిక్ జామే 
నేను గానీ ట్విట్టర్లో అడుగే పెడితే 
కోట్ల కొద్దీ ఫాలోయింగ్ దూము ధామే
ఇనస్టాగ్రామ్ లో నా బొమ్మ పెడితే
సెల్ ఫోన్ ఫుల్ల్లోడ్ డౌన్లోఆడింగ్ ఏ
వాట్సాప్ లోన చాటింగ్ మొదలు పెడితే
ఏ కుర్రగాళ్ల బి పి లు ఆప్లోడింగ్ ఏ
అరేయ్ సోషల్ నెట్వర్క్ లోన
స్పెషల్ ఫిగర్ నేనె నంత
ఎపుడు చూడు నా పేరు డైలీ ట్రేండింగ్ ఏ

అబ్బ అబ్బ అబ్బ్బా అబ్బ్బాబాబా

ఆ సిగ్గ సిగ్గ సిగ్గాతరక సిల్లి నెమల్లి.
సిచ్చుబుడ్డి పేలుస్తాది నరాలు గిల్లి
కర కర కారా సూపుల చిల్లి నెమల్లి
అగ్గి మంట పెట్టేస్తాంది అత్తర్లు జల్లి

ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొస్తే సొఫా సెట్టు
ఆడ కూసోని ఏయిటింగ్ సెత్తే నేనొస్తాను

ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొత్తే సోఫాసెట్టు
ఆడ కూసోని నీతో మేము మీటింగ్ సేత్తామూ

ఆ డోరు నెంబర్ ఒకటి డాషు
యాభై ఆరు అడ్డ గీత
సున్నా రెండు సిల్కు నాగరు మూడో లైను
ఎర్ర గేటు కొబ్బరి సెట్టు
లోనకొత్తే సోఫాసెట్టు
ఆడ కూసోని నీతో మేము మీటింగ్ సేత్తామూ

సైన్మా :: ఊపిరి - 2016
మోతల్ :: గోపీ సుందర్ 
రాతల్  :: రామజోగయ్య శాస్త్రి 
గొంతుల్ :: గీతా మాధురి