23, ఆగస్టు 2017, బుధవారం

ఈటీవీ - సై సై సయ్యారే...

ఒకప్పుడు "అంతరంగాలూ అనంత మానస చదరంగాలూ", "ఓ కళంకిత కళలకే అంకితా" అంటూ వ్యధాభరిత సీరియల్స్ కు కుటుంబకథా చిత్రాలకూ, టెలీఫిల్మ్స్ కు ప్రాముఖ్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమయేది ఈటీవీ. అయితే నాలుగేళ్ళ క్రితం జూలు విదిల్చి మారుతున్న అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ’జబర్దస్త్’ లాంటి ప్రోగ్రాములతో యువతని, ముఖ్యంగా మాస్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో విజయం సాధించి తామూ ఎందులోనూ తక్కువ కామని నిరూపించింది.
  
అంతే కాదు సాధారణంగా సభల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ మాట్లాడని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఒప్పించి మొదటిసారిగా "సౌందర్యలహరి" పేరిట ఆయన సినిమాల గురించిన కబుర్లను ఆయనతోనే చెప్పిస్తూ ఒక టెలివిజన్ సిరీస్ ని విజయవంతంగా నడిపింది. ఇపుడు అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి, రాఘవేంద్రరావు గారి చిత్రాల్లోని పాటలను ఇప్పటి కొరియోగ్రాఫర్స్ కి ఇస్తే ఎలా కంపోజ్ చేస్తారో పరీక్ష పెడుతూ ఒక సరికొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. అదే ’సైసైసయ్యారే’ అనే ప్రోగ్రామ్. 

రాఘవేంద్రరావు గారంటేనే సెన్సువాలిటీకి పెట్టిందిపేరు మరి ఆయన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఇందులోనివి ఐటం సాంగ్స్ కాకపోయినా కూడా ఈ బ్లాగ్ చూసే ఇంట్రస్ట్ ఉన్న రసికులకు ఖచ్చితంగా నచ్చుతుందనిపించి ఈ మొదటి ఎపిసోడ్ షేర్ చేస్తున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ అతిథిగా వచ్చిన దీనిలో "కూలీ నంబర్ వన్" చిత్రం లోని ’కలయా నిజమా’, "ముగ్గురు మొనగాళ్ళు" చిత్రం లోని ’రాజశేఖరా’, "బొంబాయి ప్రియుడు" చిత్రంలోని ’రాజ్ కపూరు సినిమాలోని’ పాటల ఒరిజినల్ చూపించి, ఆపై డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించారు. ఆసక్తి ఉన్న వారు చూసి ఎంజాయ్ చేయండి.

’ఈటీవీ’లో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముఫ్ఫై నిముషాలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.