22, ఆగస్టు 2017, మంగళవారం

నీ మీద నాకు ఇదయ్యో..

మోస్ట్ మెలోడియస్ ఐటంసాంగ్.. చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా.. ఎంజాయ్..

ఆడియో :: 

ఈడియో ::


లిరికియో ::

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
గిజిగాడి గిచ్చుళ్ళాయే.. చలిగాలి చిచ్చాయే
చేయించు తొలి మర్యాద.. యా యా యా యా

నీ మీద నాకు అదమ్మో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో
నీ కళ్ళు కవ్విస్తుంటే.. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా.. యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

నీ వంటి మగమహరాజే మగడే ఐతే
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి
నీ వంటి భామామణులు దొరికే వరకే
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి
నీ వీర శృంగారాలే..ఏ..ఏ..
నీ వీర శృంగారాలే చూపించవా
ఒకసారి ఒడి చేరి

నీ మీద నాకు అదమ్మో
అందం నే దాచలేను పదయ్యో

నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే

నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్దమందారాలే..ఏ..ఏ..
నీ ముద్దమందారాలే ముద్దాడనా
ప్రతి రేయి జత చేరి..

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
నీ కళ్ళు కవ్విస్తుంటే.. ఆకళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాదా.. యా యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో

సైన్మా ::  రాక్షసుడు - 1986
దరువుల్ :: ఇళయరాజా
రాతల్ :: వేటూరి
గొంతుల్ :: బాలు, జానకి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.