9, ఆగస్టు 2016, మంగళవారం

మాయదారి సిన్నోడూ..

అప్పట్లో ఎందరో కుర్రకారుకి మనశ్శాంతి కరువయ్యేలా చేసిన జ్యోతిలక్ష్మి ఈ ఉదయం మరణించారుట. వారి ఆత్మకి శాంతి చేకురాలని కొరుకుంటూ.. ఈ హుషారైన పాట అభిమానుల కోసం. 

ఆడియో ::
http://gaana.com/album/amma-maata

ఈడియో ::


లిరికియో ::

మాయదారి సిన్నోడూ
మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు..
లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కాఁవమ్మ సెప్పవే.. రాఁవమ్మ సెప్పవే
రత్తమ్మ సెప్పవే.. అత్తమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..
సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..

సిగరుల్లో.. సిగురుల్లో..
సిగురుల్లో మాటేసి కన్నుగీటిండే
జివ్వున పానాలు తోడేసిండే..
ఎప్పుడ్రా మాఁవా అంటే..
సంకురాతిరి పొయ్యేదాకా..
మంచి గడియే లేదన్నాడే...

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే
పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..

ఊరి సెరువులో నే నీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే
ఊరి సెరువులో నేనీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే..

బుడుంగున...  బుడుంగున
బుడుంగున మీదికి తేలిండే
నా తడికొంగు పట్టుకుని లాగిండే
ఎప్పుడురా మాఁవా అంటే
శివరాతిరి ఎల్లేదాకా శుభలగ్గం లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే
కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే
కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే..

గబుక్కున.. గుబుక్కున..
గబుక్కున కళ్లు రెండు మూసిండే
రివ్వున వాటేసి నవ్వేసిండే
ఏందిరా మాఁవా అంటే
కోడికూసీ కూయంగానే తాళి కడతానన్నాడే..

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే
పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
కోడి కూసి కూయంగానే తాళి కడతానన్నాడే
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

సైన్మా :: అమ్మ మాట -- 1972
దరువుల్ :: రమేశ్ నాయుడు
రాతల్ :: సినారె
గొంతుల్ :: ఎల్.ఆర్. ఈశ్వరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.