20, ఏప్రిల్ 2021, మంగళవారం

రాంసక్కనోడివిరా పిలగో...

రఘు కుంచె స్వరపరచి పాడి నటించిన ఈ హుషారైన స్పెషల్ సాంగ్ మీకోసం. లేడీ వాయిస్ మంగ్లీ పాడిందిలెండి రఘు పాడిన ఐటమ్ సాంగ్ ఏంటీ అని అలా క్లోజ్ చేసేయకండి :-)

ఈడియో ::

16, మార్చి 2021, మంగళవారం

జల జల జలపాతం - ఈటీవీ

సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కన్నా వీళ్ళ కెమిస్ట్రీ ఫిజిక్సూ బయాలజీ అన్నీ టూమచ్ గా ఉన్నట్లున్నాయ్ కదా. అంతా బానే ఉంది కానీ ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా టీవీ చూసే సమయంలో ఈ పాట ప్రసారం చేయడం మాత్రం... హ్మ్.. ఎందుకులెండి.. ఏమైనా అంటే రిమోట్ లేదా అంటారు.. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఈ పోస్ట్ చివర ఉంది.

ఈడియో ::

5, మార్చి 2021, శుక్రవారం

పైన పటారం...

ప్రోమోలో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు చూసి ఐటమ్ సాంగ్ అనుకున్నా కానీ ఈ పాట లిరిక్స్ విన్నాక అనసూయ అన్నట్లు ఇది ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే. మరి ఈ పాట విశేషమేంటో ఈ వీకెండ్ మీరే చూసి తేల్చుకోండి.

ఈడియో ::

27, ఫిబ్రవరి 2021, శనివారం

నా తప్పు ఏమున్నదబ్బా..

నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా నా అందం చూసి మీరు మతిపోగొట్టుకుంటే అందులో నా తప్పేముందంటూ ప్రశ్నిస్తున్న ఈ మిస్ యూనివర్స్ కంటెండర్ "ఊర్వశి రౌతేలా" గొడవేంటో మీరూ కాస్త చూడండి ఈ వీకెండ్.

ఈడియో ::

20, ఫిబ్రవరి 2021, శనివారం

జర్ర జర్ర / సూపర్ హిట్టూ..

గద్దలకొండ గణేష్ సినిమాలో ఇది విలన్ పాటే అయినా ఐటం గర్ల్ "డింపుల్ హయాతి" పాడే సూపర్ హిట్టు పల్లవే అసలైన కిక్కు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాట వింటూ మీరు పాదం కలిపేయండి ఈ వీకెండ్.   

ఈడియో ::